Madha Gaja Raja Movie Review
మదగజరాజ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
విశాల్ హీరోగా నటించిన మదగజరాజ చిత్రం ఈ రోజు ప్రేక్షకులముందుకు వచ్చింది. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 12 సంవత్సరాల క్రితం షూటింగ్ జరుపుకొని సంక్రాంతి కానుకగా తమిళనాట విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో తెలుగులో డబ్ చేసీ విడుదల చేశారు. అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్, సంతానం తదితరులు నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
మదగజరాజు అలియాస్ ఎంజీఆర్(విశాల్) అరకులో కేబుల్ పనులు చేసుకుంటూ ఆ ఊరి ఎస్ఐ అయిన తన తండ్రికి సాహాయపడుతూ ఉంటారు. అలా సాయం చేసే సందర్భంలో మాధవి(అంజలి)తో ప్రేమలో పడుతాడు. కొన్ని కారణాల వలన వారి మధ్య దూరం ఏర్పడుతుంది. అదే సమయంలో వాళ్ల స్కూల్ మాస్టర్ కూతురు పెళ్లికి వెళ్తాడు. అక్కడ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటాడు. స్నేహితుల్లో సంతానం కూడా ఉంటాడు. అక్కడే మాయ(వరలక్ష్మీ వరత్ కుమార్) పరిచయం అవుతుంది. సరదాగా సాగుతున్న పెళ్లిలో ఒక ట్విస్ట్. దాన్ని స్నేహితులతో కలిసి సాల్వ్ చేసీ ఎవరి దారిన వారు వెళ్తున్న సమయంలో స్నేహితులకు ఉన్న ఇబ్బందులు తెలుసుకుంటాడు రాజు. వీరి సమస్యలకు కాకర్ల విశ్వనాథ్(సోనుసూద్) కారణం అని తెలుసుకుంటాడు. ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ తీర్చడానికి విశాల్ హైదరాబాద్ వచ్చి కాకర్లకు సవాల్ చేస్తాడు. ఇద్దరి మధ్య టిట్ ఫర్ టాట్ లాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఇంతకీ ఫ్రెండ్స్ సమస్య ఏంటీ? వారి సమస్యలు ఎలా తీర్చాడు? అంజలిని మళ్లీ కలిశాడా? అనే విషయాలు తెలియాలి అంటే సిినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సినిమా చూస్తున్నంత సేపు ఓల్డ్ సినిమా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ముందే 12 సంవత్సరాల తరువాత విడుదల అవుతున్న చిత్రం అనే ప్రచారం సినిమాకు కలిసొచ్చింది. సినిమా చూసే ప్రేక్షకుడు సినిమా ఎంగేజింగ్ గా వెళ్తుందా లేదా అనే కోణంలోనే చూస్తాడు తప్ప టెక్సికల్ అంశాల గురించి పెద్దగా పట్టించుకోడు. లాజిక్స్ ఏమీ లేకుండా అలా సాఫీగా సాగిపోతుంది మూవీ. ఫస్ట్ హాఫ్ లో లవ్ ట్రాక్ తో మొదలై బ్రేక్ అప్ వరకు చూపించారు. ఇక మాస్టర్ కూతురి పెళ్లికోసం ఫ్రెండ్స్ అందరూ కలవడం అక్కడే వాళ్లు చేసే కామెడీ బాగుంటుంది. ముఖ్యంగా సంతానం వాళ్ల అత్తపై వేసే పంచులు బాగా పేలాయి.
అదే పెళ్లిలో కామెడీతో పాటు ఓ ఎమోషనల్ సన్నివేశం కూడా అలరిస్తుంది. హీరో గ్యాంగ్ తో రన్నింగ్ రేసులో ఓడిపోయిన చిన్ననాటి ఫ్రెండ్స్ తో మళ్లీ రన్నింగ్ రేసు పోటీ భావోద్వేకంగా ఉంటుంది. సినిమా సెకండ్ హాఫ్ ఓపెన్ అవడమే కొత్త ప్లాట్ తో ఓపెన్ అవుతుంది. అసలైన కాన్ ఫ్లిక్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. స్నేహితుల ప్రాణాలకు మీదకు వచ్చిన సమస్యకు కారణం కాకర్ల సుబ్బారావు అని తెలుసుకున్న హీరో అతనికి సవాల్ చేయడం అనేది ఎక్కడ రియలిస్టిక్ గా అనిపించదు. కానీ అక్కడ జరిగే సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి. మినిస్టర్ సత్తిబాబు పాత్రలో మనోబాల నటన చాలా బాగుంది. సెకండ్ హాప్ చాలా వరకు తెరమీద కనిపించే పాత్ర ఆయనది. ఒక సిచ్యూవేషనల్ కామెడీలో ఆయన పాత్ర బాగుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా కేవలం ఫన్నీ ఎలిమెంట్స్ తో ఫిల్ చేసిన విధానం మెప్పిస్తుంది.
నటీనటులు:
యాక్షన్ హీరో విశాల్ వన్ మ్యాన్ షో, ఫైట్స్ ఎలాగో బాగా చేస్తాడు. నటన విషయంలో ఆయన కట్టిపడేశారు. అంజలి, వరలక్ష్మీ ఇద్దరికి పెద్దగా చెప్పుకోదగ్గ పాత్ర కాకపోయినా ఉన్నంతలో మెప్పించారు. సంతానం క్యారెక్టర్ చాలా బాగా చేశారు. కామెడీ టైమింగ్ బాగుంది. ఇక మిగితా నటీనటులు కూడా మెప్పించారు.
సాంకేతిక అంశాలు:
దర్శకుడు సుందర్ సి తనదైన శైలీ చిత్రం ఇది. 12 సంవత్సరాల తరువాత విడుదల చేసినా కామెడీ మాత్రం బాగా డీల్ చేశారు. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని మ్యూజిక్ బాగుంది. నేపథ్యం సంగీతం సినిమాకు ప్లస్ అయింది. కెమెరా, ఎడింట్ పనితనం బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
కామెడీ
కథనం
మైనస్ పాయింట్స్
చెప్పుకోదగ్గ కథ కాదు
అంతిమ తీర్పు:
ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. కొత్తదనాన్ని ఆశించకుండా నవ్వుకొడానికి మాత్రమే అయితే మదగజరాజ చిత్రాన్ని ఒకసారి చూడచ్చు.
Movie Title : Madha Gaja Raja(dubbed from Tamil)
Banners: Vishal Film Factory, Gemini Film Circuit
Release date:-31.01.2025
Cast : Vishal, Anjali, Varalaxmi Sarathkumar, Santhanam, Sonu Sood, Late Manivannan
Director: Sundar C
Music : Vijay Antony
Cinematography:-Richard M Nathan
Editing:-Srikanth N B
Producer: Vishal
Runtime : 133 minutes