Reading Time: 3 mins

Thandel Movie Hindi Trailer Launch Event

 

తండేల్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

‘తండేల్’ ట్రైలర్ ఫెంటాస్టిక్ గా వుంది. నాగచైతన్య అమెజింగ్ యాక్టర్. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి: హిందీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్

-‘తండేల్’ లాంటి గొప్ప సినిమాలో పార్ట్ కావడం నా అదృష్టం: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైల‌ర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. మీ అందరి ప్రేమకి ధన్యవాదాలు. అరవింద్ గారు నాకు  బ్రదర్ లాంటివారు. తండేల్ ఫిబ్రవరి 7న వస్తుంది. అలాగే మా అబ్బాయి నటించిన సినిమా కూడా అదే రోజు వస్తుంది. అయినా పర్లేదు ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కి వస్తానని చెప్పాను. కథ బావుంటే ఎన్ని సినిమాలు అయినా ఆడియన్స్ చూస్తారు. తండేల్ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఫెంటాస్టిక్ గా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశారు. మ్యూజిక్ ఫెంటాస్టిక్ గా ఉంది. దేవిశ్రీ చేసిన డింకచిక డింకచిక సాంగ్ నా ఫేవరెట్. బేసిగ్గా నాకు డాన్స్ చేయడం ఇష్టం ఉండదు కానీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాను. తండేల్ ట్రైలర్ లో హార్ట్ టచింగ్ ఎమోషన్స్ వున్నాయి. చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. ఐడియల్ కోస్టార్. తనతో వర్క్ చేయడం చాలా అమెజింగ్ ఎక్స్ పీరియన్స్. తను మంచి హ్యూమన్ బీయింగ్. సాయి పల్లవి కూడా చాలా మంచి పెర్ఫార్మర్. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలి.  టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు.

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. వెరీ గుడ్ ఈవెనింగ్ టు ఎవ్రీ వన్. సాయి పల్లవి తో చేసిన లవ్ స్టోరీ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు చూసి చాలా బాగుందని మెసేజ్ పెట్టారు. ఆ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు తండేల్ ట్రైలర్ ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఆయన ట్రైలర్ లాంచ్ చేయడం నాకు మ్యాజికల్ మూమెంట్. లాల్ సింగ్ సినిమా అమీర్ గారితో చేయడం నాకు గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆరు నెలల్లో ఆయన దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్ గా ఉంటుందో అర్థమైంది. ఇలాంటి కథలు యాక్టర్స్ కి చాలా అరుదుగా వస్తాయి. ఇది నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ. ఇలాంటి సినిమాల్లో పార్ట్ కావడం అదృష్టంగా భావిస్తున్నాను. నన్ను ట్రస్ట్ చేసిన అరవింద్ గారికి థాంక్యూ. ఈ లుక్ లోకి ట్రాన్స్ఫర్ కావడానికి ఏడాదిన్నర పట్టింది. అరవింద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని తీశారు. అరవింద్ గారితో చేసిన 100% లవ్ నా కెరీర్ లో ఒక టర్నింగ్ పాయింట్. తండేల్’ కూడా మరో టర్నింగ్ పాయింట్ అవుతుందని భావిస్తున్నాను.చందు చాలా అద్భుతంగా సినిమాని తీశాడు. దేవిశ్రీ పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్స్ అయ్యాయి. సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. మీరంతా ఫిబ్రవరి 7న సినిమాని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. జునైద్ సినిమాకు  కూడా ఆల్ ది వెరీ బెస్ట్’ అన్నారు.

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ సినిమాతో పాటే అమీర్ ఖాన్ గారి అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ సినిమా చేసిన సూపర్ స్టార్ ఒక్కరే. ఆయనకి  ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ గురించి చెప్పాను. ‘ఏం పర్లేదు.. రెండు సినిమాలు అద్భుతంగా ఆడుతాయి. నేను వస్తున్నాను’అన్నారు. ఆయన కైండ్ హార్ట్ కి థాంక్ యూ. తండేల్ నిజంగా జరిగిన కథ. వైజాగ్ తీర ప్రాంతంలోని కొందరు వ్యక్తులు చేపల వేటకు గుజరాత్ వెళ్లి పొరపాటున బోర్డర్ క్రాస్ చేసి పాక్ సైన్యం చేతిలో చిక్కుకొని జైలు పాలైనవారి కథ. నిజ జీవితంలోని వ్యక్తులని కలసి వారితో మాట్లాడటం జరిగింది. దర్శకుడు చందు ఈ కథని అద్భుతంగా తీర్చిదిద్దాడు.  జైలు సీన్స్, విలేజ్ సీన్స్, లవ్ స్టొరీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయి పల్లవి చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్ తండేల్ తర్వాత తండేల్ కి ముందు అన్నట్టుగా వుంటుంది. ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటుగా నిరంతరం కష్టపడ్డారు. దేవిశ్రీ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ’ అన్నారు.

డైరెక్టర్  చందూ మొండేటి  మాట్లాడుతూ…అమీర్ ఖాన్ గారితో స్టేజ్ ని షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది  అమీర్ గారి సినిమాల్లో ఆరు నెలలపాటు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయాలని ఉంది.తర్వాత ఆయనకి ఒక కథ చెప్పాలని ఉంది. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. (నవ్వుతూ). ఇది బ్యూటీఫుల్ లవ్ స్టొరీ. రాజు అనే క్యారెక్టర్ కరాచీలో తన మనుషుల కోసం ఏం చేశాడనేది కూడా చాలా ఆసక్తికరంగా వుంటుంది. దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు  రైటింగ్ లో కూడా  తన కాంట్రీబ్యుషన్ వుంది’ అన్నారు

రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. అమీర్ సార్ వి లవ్ యు. తండేల్ సినిమాకి అమీర్ ఖాన్ గారు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని కలవడం గర్వంగా ఉంది. ఇండియన్ సినిమాకి ఆయన కాంట్రిబ్యూషన్ వెలకట్టలేనిది. ముంబై ఆడియన్స్ నా పాటలకు ఎప్పుడు కూడా చాలా గ్రేట్ రెస్పాన్స్ ఇచ్చారు. అల్లు అరవింద్ గారికి థాంక్యూ. గీత ఆర్ట్స్ అద్భుతమైన చిత్రాలన్నీ నిర్మిస్తుంది. తండేల్ ని కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది చాలా గ్రేట్ జర్నీ. డైరెక్టర్ చందు చాలా అద్భుతమైన కథను రాశారు. సినిమాని హార్ట్ టచింగ్ గా తీశారు. నాగచైతన్య ఫెంటాస్టిక్ గా పెర్ఫార్మ్ చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ఆయన బీస్ట్ మోడ్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యారు. సాయిపల్లవి మార్వలెస్ గా యాక్ట్ చేసింది. వారి కెమిస్ట్రీ మీ అందరిని ఆకట్టుకుంటుంది. లిరిక్ రైటర్స్ కి,  టెక్నీషియన్స్ కి, మ్యూజిషియన్స్ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’అన్నారు.