Reading Time: < 1 min
Sankranthiki Vasthunnam Distributors Gratitude Meet Details
సంక్రాంతికి వస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్
ఎస్ వి సి బ్యానర్ పై దిల్ రాజ్ నిర్మాతగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో సక్సెస్ మీట్లు నిర్వహించిన ఈ చిత్రం తాజాగా డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నైజాం, ఆంధ్ర, గుంటూరు, సీడెడ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు హాజరయ్యారు.
చాలాకాలంగా మంచి సక్సెస్ లేని డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా 20% కమిషన్ను తెచ్చిపెట్టిందని అందరు డిస్ట్రిబ్యూటర్లు ఆనందం వ్యక్తం చేశారు. చాలా ఏరియాలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మూడవ రోజే బ్రేక్ ఈవెన్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. 300 కోట్ల గాస్ వసూలు రాబట్టిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా, డిస్టిబ్యూటర్ కుటుంబాలను, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థను నిలబెట్టిందని తెలిపారు. ఇంత మంచి సినిమాను నిర్మించిన దిల్ రాజ్, శిరీష్ లకు.. దర్శకత్వం వహించిన అనిల్ రావిప్పుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శిరీష్ మాట్లాడుతూ.. ఇది కచ్చితంగా ఆనందించాల్సిన సమయం అని, ఇలాంటి వేడుకలు ఎప్పుడో గాని జరగవని 10 సంవత్సరాల క్రితం ఇలాంటి వేడుకలు ఉండేవని గుర్తు చేశారు. నష్టాల్లో తమతో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో 10 శాతమే సక్సెస్ అని అలాంటిది సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇంత మంచి విజయం సాధించడం చాలా గొప్ప విషయం అన్నారు. ఎంతోకాలంగా కుటుంబంలా కలసిపోయి మా సంస్థలో వస్తున్న అన్ని సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒక సినిమా విజయవంతం సాధిస్తే.. చాలామంది సంతోషంగా ఉంటారని.. ఎంతోమందికి ఉపాధి ఉంటుందని తెలిపారు.
దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఈ సినిమా ఎంత పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దిల్ రాజ్ తో ఏ సినిమా చేసినా చాలా కంఫర్ట్ ఉంటుందని, అందుకే ఇలాంటి బ్లాక్ బస్టర్స్ చేయగలుగుతున్నామని అన్నారు. డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి ఇలాంటి వేడుక చేయడం సంతోషంగా ఉందని ఇలాంటి వేడుకలు అన్ని సినిమాలకు జరగాలని కోరుకున్నారు.