Reading Time: < 1 min

Super Subbu Teaser Review
సూపర్ సుబ్బు టీజర్ రివ్యూ

ఇండియాలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రవేశపెట్టాలి అని చాలా కాలంగా అనేక సంఘాలు ప్రతిపాదిస్తున్నాయి. కారణాలు ఏవైనా ఇప్పటివరకు అలాంటి చర్యలకు ఏ ప్రభుత్వం ముందుడగు వేయలేదు. దీనిపై తెలుగులో సైతం పెద్దగా సినిమాలు తెరకెక్కలేదు. ఇన్నాళ్లకు సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో ఓ సిరీస్ రాబోతుంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సూపర్ సబ్బు చిత్రం ఈ కోవకు చెందినది అని టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. అద్భుతం, టిల్లు స్కేర్ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మల్లిక్ రామ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.

సందీప్ కిషన్ తో పాటు ఈ సినిమాలో బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు, హైపర్ ఆది, మురళి శర్మ, మితిలా పాల్కర్, మానస చౌదరి తదితరులు నటిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ పై మొట్టమొదటి తెలుగు సిరీస్ గా సూపర్ సుబ్బు తెరకెక్కుతుంది. టీజర్ చూపించన కంటెంట్ బట్టి ఈ చిత్రం ఒకరకమైన అడల్ట్ కామెడీ అని అర్థం అవుతుంది. సుబ్బు పాత్రలో సందీప్ కిషన్ నటిస్తున్నారు. సుబ్బు లవ్ కోసం జాబ్ చేయాల్సి వస్తుంది. జాబ్ కోసం బ్రహ్మనందం దగ్గరకు వెళితే.. సుబ్బుకు సెక్స్ ఎడ్యూకేషన్ జాబ్ రోల్ ఇస్తారు. అక్కడి నుంచి సిరీస్ లో అసలు కథ మొదలు అయ్యేలా ఉంది.

సంపూర్ణేష్ బాబు డైలాగ్ కామెడీగా ఉంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు.. “సుబ్బి పెళ్లి సుబ్బు చావుకే వచ్చింది” అంటున్నారు. అలాగే హైపర్ ఆది అంటున్న “టాయిలెట్ పోసినంత ఈజీగా పిల్లలు పుడుతారు సార్ ఆ ఊళ్లో” అనే డైలాగ్ కూడా కథ ఏంటో తెలిపేలా ఉంది. ఆ గ్రామస్తులనే ఎడ్యుకేట్ చేయడానికి సుబ్బు ఆ వస్తాడని అర్థం అవుతుంది. ఆ గ్రామంలో పాపులేషన్ తగ్గించడానికి సుబ్బు ఎలాంటి పాట్లు పడుతాడు అనేది సూపర్ సుబ్బు సిరీస్. టీజర్ తో ఆసక్తిరేపిన ఈ సిరీస్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి మొదలైంది. చూడాలి మరి సందీప్ కిషన్ కు ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో.