Telugu Cinema History 1956
తెలుగు సినిమా హిస్టరీ 1956
తెలుగు చలన చిత్రానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. దీనిలో భాగంగా 1956 లో వచ్చిన సినిమాలపై ఓ లుక్కేద్దాం. ఈ సంవత్సరం మొత్తం 27 చిత్రాలు విడుదలైయ్యాయి. బి.ఎస్ రంగా దర్శక నిర్మాతగా తెనాలి రామకృష్ణ అనే చిత్రం ఇదే సంవత్సరం విడుదలైంది. ఈ చిత్రానికి రాష్ట్రపతి రజిత పథకం లభించింది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు శ్రీకృష్ణదేవరాయుల పాత్రలో నటించారు.
ఇదే సంవత్సరం శ్రీ రాజరాజేశ్వరీ వారు నాగపంచమి సినిమాను తమిళంలో తీశారు. ఇదే సినిమాను తెలుగులో నాగులచవితి పేరుతో విడుదల చేసి మంచి విజయాన్ని సాధించారు. ఇదే సంవత్సరం రాజ్యం పిక్చర్స్ పతాకంపై హరిచంద్ర చిత్రాన్ని నిర్మించారు. హరిచంద్రునిగా ఎస్ వి రంగారావు, చంద్రమతిగా లక్ష్మిరాజ్యం నటించారు. ఈ చిత్రంలో గుమ్మడి విశ్వామిత్ర పాత్రలో నటించారు.
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి కాంబినేషన్ లో భలేరాముడు చిత్రం విడుదలైంది. ఏది నిజం చిత్రం కూడా ఇదే సంవత్సరం విడుదలైంది. ఈ మూవీతో నాగభూషణం హీరోగా పరిచయం అయ్యారు. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసాపత్రం లభించింది. ఘంటసాల నిర్మించిన సొంత వూరు చిత్రంలో ఎన్టీ రామారావు మొదటి సారిగా శ్రీ కృష్ణుడి పాత్రలో నటించారు.