Reading Time: < 1 min

History Of Telugu Cinema 1957
తెలుగు సినిమా చరిత్ర 1957

ఎంతో చరిత్ర కలిగిన తెలుగు సినిమాల్లో 1957 నాటికే అక్కినేని నాగేశ్వరరావు 60 చిత్రాలు పూర్తి చేసుకున్నారు. ఇదే సంవత్సరం మాయాబజార్ చిత్రం విడుదలైంది. విజయ సంస్థవారు మాయా బజార్ చిత్రాన్ని తెరకెక్కిస్తే, ఎన్ఎటి సంస్థవారు భక్తి చిత్రం పాండురంగమహాత్మ్యం నిర్మించారు. అంజలీ పిక్చర్స్ వారు జానపద చిత్రం సువర్ణ సుందరి చిత్రాన్ని నిర్మించారు. అన్నపూర్ణ పిక్చర్స్ వారు తోడికోడళ్లు అనే సాంఘిక చిత్రాన్ని ఇదే సంవత్సరం నిర్మించారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు హీరోగా దొంగల్లోదొర చిత్రాన్ని విడుదల చేశారు.

ఈ సంవత్సరం విడుదలైన చిత్రాలలో మాయాబజార్ చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సినిమాలో ప్రస్థావించిన చాలా సన్నివేశాలు అటు మహాభారతంలో గానీ, ఇటు అష్టాదశపురాణాల్లో గాని లేవు. అసలు పాండవులు కూడా కనిపించరు అదే ఈ సినిమా ప్రత్యేకత అంటారు. దీనికి ఒక కారణం ఉంది. అప్పటికే తెలుగు పరిశ్రమలో సీనియర్ నటులందరూ వివిధ పాత్రల్లో సెటిల్ అయిపోయారు. ఇక పాండవుల పాత్ర వేయడానికి నటీనటులు ఎవరు లేరు. జూనియర్ ఆర్టిస్టులతో వేశాలు వేయించాలంటే భయం. ఇలాంటి సమయంలో విజయ సంస్థ అధినేత చక్రపాణి తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యశకితుల్ని చేస్తుంది. పాండవుల ప్రస్థావన తీసుకోద్దాము కానీ వారిని తెరమీద కనిపించాల్సిన అవసరం లేదు అన్నారు. దాంతో పాండవులు లేకుండానే సినిమా తీశారు. ఈ సినిమాలో ఎన్టీరామారావు శ్రీకృష్ణుడి పాత్రలో నటించారు. సావిత్రి శశిరేఖ పాత్రలో నటించిగా, ఎస్ వి రంగారావు ఘటోత్కచుడు పాత్రలో ఇమిడిపోయారు.

డిఎల్ నారయణ నిర్మించిన దొంగల్లో దొర చిత్రం నాగేశ్వరరావు వజ్రోత్సవ చిత్రంగా విడుదలైంది. ఈ సంవత్సరం పొన్నలూరి వసంతకుమార్ రెడ్డి భాగ్యరేఖ చిత్రాన్ని నిర్మించి రాష్ట్రపతి చేతుల మీదుగా రజిత పతకాన్ని అందుకున్నారు. ఈ ఏడాది మద్రాసులో శబ్ద చిత్రాల రజితోత్సవం   జరిగింది. ఈ సందర్భంగా తొలి చిత్రం భక్తప్రహ్లాద దర్శకుడు హెచ్ఎం రెడ్డిని, సురభి కమలాబాయిని సత్కరించారు.