Laila Trailer Full Of Fun Ride
ఫుల్ ఫన్ రైడ్‌గా లైలా ట్రైలర్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. విశ్వక్ సేన్ తొలిసారి ఈ సినిమాలో లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ అంచనాలను పెంచాయి. సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో చేస్తున్న టీమ్ తాజాగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఏ మాల్‌గా చాలా గ్రాండియర్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో మరింత హైప్ పెంచేసింది.
ట్రైలర్ విషయానికి వస్తే.. లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న సోనూ మోడల్(విశ్వక్) అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే మనుషులు అతడు దొరికితే చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితిలో తన ప్రాణాలను రక్షించుకోవడానికి, సోనూ లైలాగా మారిపోతాడు. అయితే, లేడీ గెటప్‌లో మారిన విశ్వక్‌కు ఎదురైన అనేక సంఘటనలు ఏంటి? ఎమ్మెల్యే హత్య కేసుకు, సోనూకి సంబంధం ఏంటి? అనే విషయాలు సినిమాలో ఆసక్తికరంగా ఉండనున్నాయి. సోను మోడల్ పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్.. అతడు చేసే కామెడీ ఆకట్టుకోనుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ మొత్తం ఎట్రాక్టింగ్ డైలాగ్‌లతో నింపారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా ఉంది. లేడీ పాత్రలో విశ్వక్ సేన్ చేసే అల్లరి థియేటర్లలో ప్రేక్షకులు పడిపడి నవ్వేలా చేస్తుందనడంలో సందేహం లేదు. అటు హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకోనుంది. లియోన్ జేమ్స్ సంగీతం మేజర్ అసెట్‌గా రానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..‘‘ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థియేటర్లలో మీరు నవ్వి నవ్వి మీ ఛాతీ చపాతీ కావాలని డిసైడ్ అయ్యాం. కచ్చితంగా లైలా మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. ట్రైలర్ బయటకు వచ్చింది కాబట్టి.. నాకంటే ట్రైలర్ ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా. ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుతా. లైలా నుంచి నెక్ట్స్ అటక్ పటక్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ నేనే రాశా. అది కూడా మీకు నచ్చుతుంది. ఫిబ్రవరి 14న అందరూ థియేటర్లలో కలుద్దాం.’’ అని చెప్పారు.
అనంతరం మీడియా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు టీమ్ సమాధానాలిచ్చారు
లైలా టార్గెట్ ఏంటి? ఎంటర్‌టైన్‌మెంట్‌యేనా?
డైరెక్టర్ రామ్ నారాయణ్: పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
సినిమా సెన్సార్ అయింది కదా? రిపోర్ట్ ఏం వచ్చింది?
విశ్వక్ సేన్: నేను ఈ సినిమాలో లేడీ గెటప్ వేసింది ఎంటర్‌టైన్ చేయడానికి. మా ఇంటెన్షన్ కేవలం మిమ్మల్ని నవ్వించడమే. అందులో భాగంగానే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. యూత్‌కు పవర్‌ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది.
విశ్వక్ గారూ.. ఈ సినిమాకు సంబంధించి మీకు కష్టమనిపించింది ఏంటి?
విశ్వక్ సేన్: సాయంత్ర పూట ఇంట్లో ఒక్కడినే ఉండడం కష్టం అయింది. ప్యాంట్, షర్ట్ వేసుకుని ఈ గెటప్‌లో బయటకు వెళ్లడం కుదరలేదు. ఈ గెటప్ కోసం రోజూ రెండు గంటలు పట్టేది.
కామాక్షి గారూ.. ఈ సినిమాలో మీ రోల్ ఏలా ఉంటుంది?
నటి కామాక్షి భాస్కర్ల: ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అందుకే టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా చూపించలేదు. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ చేస్తుందనే మార్క్ ఉంది. ఆ మార్క్‌కు తగ్గట్లే ఇందులో నా పాత్ర ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ రామ్ నారాయణ్‌దే.
భానూ గారూ విశ్వక్ సేన్‌తో మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
డాన్స్ మాస్టర్ భాను: ఈ సినిమాలో అన్ని పాటలు నేను చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్స్. ఫస్ట్ సాంగ్ సోనూ మోడల్ పెద్ద హిట్ అయింది. అలాగే లాస్ట్ సాంగ్ కోయి కోయిని కూడా హిట్ చేశారు. ప్రతి సాంగ్ సందర్భానుసారం ఉంటుంది. సినిమా మొత్తం బ్లాక్‌బస్టర్‌గా ఉంటుంది.
నటీనటులు: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ
తారాగణం:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకుడు: రామ్ నారాయణ్
రచయిత: వాసుదేవ మూర్తి
సంగీత దర్శకుడు: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో