Rose day Related Super Hit Telugu Songs
రోజ్ డే సందర్భంగా అదిరిపోయే తెలుగు పాటలు
ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికుల వేడుకలు హట్టహాసంగా జరుగుతాయి. ఫిబ్రవరి 14 వరకు ప్రతీ రోజును ఒక వేడుకలా జరుపుకుంటారు. అందులో భాగంగా 7 వ తేదీని రోజ్ డే నిర్వహిస్తారు. తమ సోల్ మేట్ కు రోజ్ ఇచ్చి తమ మనసులోని మాటను చెబుతారు. ఇదిలా ఉంటే రోజ్ డే అంటే గులాబి పువ్వు అని అందరికి గుర్తుకు వస్తుంది. మరి అలాంటి గులాబి పువ్వు మీద తెలుగు పరిశ్రమలో బోలెడు పాటలు వచ్చాయి. అందులో మనసుకు హత్తుకపోయే పాటలు ఉన్నాయి. రోజ్ డే సందర్భంగా ఆ పాటలు ఏంటో ఒకసారి గుర్తుచేసుకొని.. ఆ పాటల మాదుర్యాన్ని మరోసారి ఆస్వాదిద్దాం.
ఓహో గులాబి బాలా
“ఓహో గులాబి బాలా అందాల ప్రేమ మాల సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా” అంటూ సాగే ఈ పాట మంచిమనిషి సినిమాలోనిది. 1964 లో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్, జగ్గయ్య, జమున నటించారు. చక్కటి తెలుగు పదాలతో అద్భుతంగా సాగుతుంది ఈ పాట.
గులాబీలు పూచేవేళ
భలే అబ్బాయిలు అనే చిత్రంలో “గులాబీలు పూచేవేళా.. కొరికలే పెంచుకో. పసందైన చిన్నదాన్ని ప్రేమించుకో” అనే డ్యూయేట్ సాంగ్ మనసును హత్తుకుంటుంది. ఘంటసాల వెంకటేశ్వర రావు గారి సంగీత సారథ్యంలో ఈ పాట చక్కటి తెలుగు పదాలతో ఈ నాటికి అందరిని అలరిస్తుంది. భలే అబ్బాయిలు చిత్రం 1969లో పేకేటి శివరామ్ దర్శకత్వంలో తెరకెక్కింది.
గులాబి పువ్వై నవ్వాలి వయసు
ఎన్టీరామారావు, మురళి మోహన్, బాలకృష్ణ నటించిన అన్నదమ్ముల అనుబంధంలో చిత్రంలో గులాబి పువ్వై నవ్వాలి వయసు అనే పాట ఉంది. 1975లో తెరెక్కిన ఈ చిత్రం యాదోన్ కి బారాత్ అనే హిందీ చిత్రం ఆధారంగా తెరకెక్కించారు.
నా చెలి రోజావే
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన రోజా చిత్రంలో నా చెలి రోజావే నాలో ఉన్నావే అనే పాట ఎంత మధురంగా ఉంటుందో అందరికి తెలుసు.
రోజావే చిన్ని రోజావే
వెంకటేష్, మీనా కాంబినేషన్ లో వచ్చిన సూర్యవంశం చిత్రంలో రోజావే చిన్ని రోజావే.. రాగాలే నువ్వే రోజావే అంటూ సాగే ఈ పాట సంగవిని ప్రేమించే సందర్భంలో ఈ పాట వస్తుంది. ఈ సినిమా 1998లో వచ్చింది. ఎస్ ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించారు.
రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా
అల్లరి ప్రియుడు చిత్రంలో రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా రోజా పువ్వా పువ్వా పువ్వా.. రోజు రోజు పూస్తూ ఉన్న పువ్వే నువ్వా అంటూ సాగే ఈ సాంగ్ చాలా ఫేమస్. రాజశేఖర్ రమ్యకృష్ణ ఇద్దరు ఈ పాటకు ప్రాణం పోశారు. ఎమ్ఎమ్ కిరవాణి అందించిన మ్యూజిక్ ఇప్పటికీ వీణుల విందుగా ఉంటుంది.
గులాబి బుగ్గల రోజా
గులాబి బుగ్గల రోజా మన ప్రేమకెప్పుడు పూజా అనే సాంగ్ మందారం సినిమాలోనిది. ఈ పాటకు ఘంటాది కృష్ణ సంగీతాన్ని అందించారు.
గుచ్చే గులాబి లాగ
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో గుచ్చే గులాబి లాగ అంటూ సాగే పాట గోపి సుందర్ మ్యూజిక్ లో ఓ మ్యాజిక్ చేసింది. ఈ పాటను అనంత్ శ్రీరామ్, శ్రీమని ఇద్దరు రాయడం విశేషం.
గులాబి కళ్లు రెండు
గులాబి కళ్లు రెండు గెండెలోనా గుచ్చుతున్నాయే పాట ఎంత మెలోడియస్ గా ఉంటుందో దాన్ని తెరకెక్కించిన విధానం కూడా అంతే మధురంగా ఉంటుంది. కృష్ణ వంశి తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే సినిమాలో ఈ పాట ఓ రోమాంటిక్ సాంగ్ గా నిలిచిపోతుంది.
గుండెల్లో గులాబీలా గోలా
వెంకటేష్, కత్రీనాకైఫ్ నటించిన మళ్లేశ్వరి చిత్రంలో గుండెల్లో గులాబీలా గోలా పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
https://youtu.be/GdcnyKb2_dE
రోజా రోజా సాంగ్
ప్రేమికుల రోజు చిత్రంలో రోజా రోజా సాంగ్ అనే సాంగ్ అందరి హృదయాన్ని దోచేసింది. ఏ ఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ఈ పాటను ఎవరెస్టు అంచున నిలబెట్టింది.
నా రోజా నువ్వే
శివనిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఖుషి చిత్రంలో నా రోజా నువ్వే సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. మణిరత్నం సినిమా పేర్లతో ఈ సినిమాను అత్యంత అద్భంగా తెరకెక్కించారు.