Reading Time: < 1 min

Brahma Anandam Movie Pre Release Event
బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్

కామెడీ కింగ్ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కాంబినేషన్ లో రిలీజ్ కాబోతున్న తాజా చిత్రం బ్రహ్మా ఆనందం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బ్రహ్మా ఆనందం సినిమా తాతా మనువళ్ల స్టోరీ కాబట్టి స్క్రీన్ మీద చిరంజీవి తాతా ఫోటో వేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా రసికుడు అని మెగాస్టార్ వ్యాఖ్యానించారు. అలాగే తనకు మనవడు కావాలని చెప్పకనే చెప్పారు. తన మనవరాళ్ల ఫోటోలను చూస్తూ ఇంట్లో ఓ లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటుందని ఆయన పరిస్థితి అని నవ్వారు. అందరూ మనవరాళ్లే అని ఈసారికైనా అబ్బాయిని కనరా అని రామ్ చరణ్ తో చెప్పినట్లు చెప్పారు. మన లెగసీ కంటిన్యూ కావాలంటే మగపిల్లాడిని కనరా అన్నట్లు నవ్వుతూ చెప్పారు.

చిత్ర డైరెక్టర్ నిఖిల్, నిర్మాత రాహుల్ యాదవ్ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా అందరికి నచ్చుతుందని చెప్పారు. బ్రహ్మానందం ఆయన కొడుకు గౌతమ్ ఇద్దరు ప్రేక్షకులను అలరిస్తారు అని పేర్కొన్నారు. నిజంగా ఇలాంటి లెజండరీ యాక్టర్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే హీరో గౌతమ్ మాట్లాడుతూ.. సొంత నాన్నతో ఈ సినిమాలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని అనుభవం అని పేర్కొన్నారు. సినిమాలో పనిచేసిన నటీనటులకు, టెక్నికల్ టీమ్ అందరికీ థ్యాంక్స్ చెప్పారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. సిినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రేక్షకులకు చేరవేయడం పెద్ద సవాల్ అని అందుకే మెగాస్టార్ ను ఈ వేడుకకు పిలిచినట్లు చెప్పారు. బ్రహ్మానందం అనే చాలా మంచి సినిమా అని మనస్తత్వం లేని ఇద్దరు వ్యక్తులు చివరికి ఎలా మారుతారు అనేది కథాంశం అని చెప్పారు. ఇక చిరంజీవితో ఆయనకు ఉన్న అనుబంధం గురించి వివరిస్తూ.. తెనాలి నుంచి వచ్చిన తనను చేయి పట్టుకొని ఇండస్ట్రీకి తీసుకొచ్చినట్లు అదే ప్రోత్సాహంతో తన కొడుకును ఆశీర్వదించాలని కోరారు.

చిరంజీవి మాట్లాడుతూ.. ప్రతీ సినిమా వేడుకకు చిరంజీవేనా అని కొంతమంది అనుకుంటారు. కానీ చిరంజీవి వలన ఒక సినిమాకు, ఒక వ్యక్తికి మంచి జరుగుతుంది అంటే కచ్చితంగా చిరంజీవి వస్తాడు అని చెప్పారు. అందులో బ్రహ్మానందం కొడుకు అంటే నాకు బిడ్డలాగే అని చెప్పారు. వెన్నెల కిషోర్, రజీవ్ కనుకాల, రఘుబాబు కూడా ఈ సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కచ్చితంగా ఈ సిినిమా అలరిస్తుందని అన్నారు. ఫిబ్రవరి 14న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది అంటే ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమా విడుదల కావడం సంతోషం అని చెప్పారు. బ్రహ్మానందంతో నాకు 40 సంవత్సరాల ప్రయాణం అని చెప్పారు. కచ్చితంగా సినిమాను ఆదరించాలని పేర్కొన్నారు.