Laila Movie Review
లైలా మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం లైలా. మాస్ కా దాస్ గా పేరున్న విశ్వక్ సేన్ మొదటి సారి ఓ లేడీ గెటప్ పాత్ర చేస్తుండంతో అందరిలో ఆ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. టీజర్, ట్రైలర్ లో కూడా యువతను ఆకర్షించే డైలాగ్స్ తో సినిమాపై అంచనాలు పెంచారు. ఇక సాంగ్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా సిినిమాపై మంచి అంచనాలు పెంచాయి. ఇన్ని అంచనాల నడుమ విడుదలైన లైలా చిత్రం ఈ రోజు థియేటర్లో విడుదలైంది. మరి ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అనేది చూద్దాం.
కథ:
సోను(విశ్వక్ సేన్) సీతా అనే బ్యూటీపార్లల్ ను రన్ చేస్తూ.. లేడీ కస్టమర్లతో సరదాగా ఉంటాడు. వారితోనే ఎక్కువ సమయం పార్లల్ లో ఉండడం వలన వారితో మంచి బాండింగ్ ఏర్పడి వారికి డబ్బు సాయం కూడా అందిస్తుంటాడు. అదే సమయంలో జెన్ని(ఆకాంక్ష శర్మ) అందాన్ని చూసి లవ్ లో పడుతాడు. ఇక అందరూ లేడీస్ సోనూ పార్లల్ కు వెళ్లడం వాళ్ల భర్తలకు నచ్చదు, దాంతో ఓల్డ్ సిటీ మగళ్లంతా సోను పార్లల్ పడగొట్టాలని చూస్తారు. అదే సమయంలో ఆ ఏరియా ఎస్ఐ(పృథ్వీ) భార్యకు, తన కీప్ కు మధ్య సోను గొడవ పెట్టడంతో ఎస్ఐ కి కూడా సోనుపై పగ పెంచుకుంటాడు. మరోవైపు పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న ఆ ఏరియా లీడర్(అభిమన్యు సింగ్)కు ఏ అమ్మాయి సెట్ అవదు. అలాంటి పరిస్థితుల్లో బ్లాక్ ఉండే ఒక అమ్మాయి(కామాక్షీ భాస్కర్ల)కు మేకప్ చేసి చాలా అందంగా రెడీ చేస్తాడు. అది తెలియని అభిమన్యు సింగ్ తనను పెళ్లిచేసుకొని మోసపోతాడు. దాంతో సోనూపై పగ పెంచుకుంటాడు. ఒక పాయింట్ కు వచ్చేసరికి వీరందరికీ సోను టార్గెట్ అవుతాడు. వారి నుంచి తప్పించుకోవాడానికి లైలా అవతారం ఎత్తుతాడు. సోనుకు పార్లల్ అంటే అంత ఎమోషన్ ఎందుకు? సోను వారి నుంచి ఎలా తప్పించుకున్నాడు? సోనును పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు? చివరికి సోను వాళ్ల మోసంపై ఎలా గెలిచాడు అనేది లైలా కథ.
విశ్లేషణ:
లైలా మూవీ కథ మొత్తం హీరో చుట్టూనే సాగుతుంది. పార్లల్ లో సోను చేసే మేకప్, ఆ సమయంలో అక్కడి లేడీస్ తో ముచ్చట్లు కొన్ని ఆసక్తికరంగా ఉంటాయి. అయితే సినిమా ప్రీ ఇంటర్వెల్ వరకు ఎలాంటి కాన్ ఫ్లిక్ట్ లేకుండా చాలా ఫ్లాట్ గా సాగుతుంది. హీరోయిన్ కనిపించడం, హీరో ఇంప్రెస్ అవడం, వెంటపడడం కట్ చేస్తే ఇద్దరు లవ్ చేసుకోవం. లవ్ స్టోరీని చాలా సింపుల్ గా తేల్చారు. సినిమా కాన్సెప్ట్ వేరే కాబట్టి అలా అవగొట్టారు అనుకోవచ్చు. ఇక సోనుకు వచ్చే ప్రాబ్లమ్స్ లో పెద్దగా లాజిక్స్ చూపించలేదు. ఇది కామెడీ జోనర్ లో వెళ్లాలి అనుకున్నారు కాబట్టి లాజిక్స్ కు చోటు ఇవ్వలేదు. కొన్ని చోట్ల కామెడీ వర్క్ అవుట్ అయింది. కొన్ని చోట్ల మాత్రం పెద్దగా పండలేదు. ఇక ఫస్ట్ హాప్ లో సోషల్ మీడియాలో సాక్రీఫై స్టార్ గా పేరున్న సునిశిత్ కాసేపు నవ్వించే ప్రయత్నం చేశాడు.
సెకండ్ హాఫ్ అంతా లైలా ఉంటుంది. లేడీ పాత్రలో విశ్వక్ సేన్.. అప్పుడప్పు విశ్వక్ సేన్ బాడీలాంగ్వేజ్ కనిపిస్తుంది. లైలాకు అభిమన్యు సింగ్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. అక్కడక్కడ కాస్త డబల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నా ఆ ఫ్లోలో కలిసిపోతాయి. ప్రీ క్లైమాక్స్ వరకు లైలా పాత్ర ఎంగేజ్ చేస్తుంది. ఆ పాత్రలోనే తనమీద పడిన ఆ నిందకు సమాధానం వెతికి… అసలైన దోషులను కోర్టులో నిలబెడుతాడు సోను. ఇక్కడితో కథ సుఖాంతం అవుతుంది.
నటీనటులు:
ముఖ్యంగా ఇది హీరో సెట్రిక్ పాత్ర కాబట్టి విశ్వక్ సేన్ చుట్టూనే కథ అంతా సాగుతుంది. సోను, లైలా రెండు విభిన్న పాత్రలు పోషించారు. సోనుగా విశ్వక్ ఎలా చేస్తాడో చాలా సినిమాల్లో చూశాము. లైలాగా అలరించడం కొత్తగా ఉంటుంది. ఆ పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు. లేడీస్ హావభావాలను బాగానే పలికించారు కానీ కొంత ఫర్ఫెక్షన్ మిస్ అయింది అన్న ఫీలింగ్ ఉంటుంది. ఓవరల్ గా పెద్ద బాధ్యతనే విశ్వక్ మోశారు అని చెప్పవచ్చు. హీరోయిన్ గ్లామర్ చూపించే పాత్రలో కన్పించింది. పెద్దగా ప్రాధాన్యత లేదు సపోర్ట్ రోల్ లా ఉంది. పోలీసు పాత్రలో అలరించిన పృథ్వీ, అభిమన్యు సింగ్ మిగితా క్యారెక్టర్లు కూడా తమ పాత్రల పరిధి మేరకు అలరించారు.
సాంకేతిక అంశాలు:
దర్శకుడు రామ్ నారయణ్ కొంత గందరగోళానికి లోనయ్యాడా అనిపించింది. కొన్ని చోట్ల టేకింగ్ చాలా బాగుంది. కొన్ని సీన్లలో పెద్దగా ఆకట్టుకోలేదు. మ్యూజిక్ డైరెక్టర్ లీయోన్ జేమ్స్ బీజీఎం చాలా బాగుంది. కానీ కొన్ని కామెడీ సీన్స్ లలో ఇంకా ఎలివేట్ అవలేదు అని పించింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
విశ్వక్ సేన్ నటన
బీజీఎం
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేకపోవడం
కామెడీ పెద్దగా వర్క్ అవుట్ అవలేదు
అంతిమతీర్పు
లాజిక్స్ లేని కామెడీ చిత్రం, కథనం, డైలాగ్స్ తో అలరించే ప్రయత్నం చేశారు. డబుల్ మీనింగ్ సీన్స్, డైలాగ్స్ కాస్త ఇబ్బంది పెడుతాయి.
Movie Title:-Laila
Banner:-Shine Screens
Release Date:-14-02-2025
Censor Rating : “A”
Cast- Vishwaksen, Akanksha Sharma
Director:- Ram Narayan
Music: Leon James
Cinematography: Richard Prasad
Producer: Sahu Garapat
Runtime : 136 minutes