Singles Day Special in Telugu Films
తెలుగు చిత్రాల్లో సింగిల్స్ డే స్పెషల్
చాలా మంది చెబుతూ ఉంటారు సింగిల్స్ గా ఉన్నప్పుడు ఉండే స్వేచ్చా.. జీవితంలో ఒక పార్ట్నర్ వచ్చిన తరువాత ఉండదు అని.
ఈ పాయింట్ ను బేస్ చేసుకొని తెలుగు చిత్రాల్లో కొన్ని పాటలు వచ్చాయి. ఫిబ్రవరి 15 సింగిల్స్ డే కాబట్టి ఒంటరిగా ఉన్న వాళ్ల కోసం చిత్రాల్లో వచ్చిన పాటల గురించి తెలుసుకుందాం.
ఓ మై బ్రదరు చెబుతా వినరో
ఓ మై బ్రదరు చుబుతా వినరో వన్ సైడు లవ్వేరా ఎంతో బెటరు.. నా సలహాలు వింటే ఎవరు ఇకపైన ఎపుడు మరి మజ్నులవరు. అంటూ సాగే పాటలో వన్ సైడ్ లవ్ గురించి, అలా చేస్తే వస్తే బెనిఫిట్స్ గురించి వివరిస్తాడు. మదన పడి మొదడు చెదిరే ట్రాజిక్ లవ్ కన్నా.. అసలు ఫైయిల్ అయ్యే ఛాన్స్ లేని వన్ సైడ్ లవ్ మిన్నా, ఈ కిటుకే తెలిసుంటే దేవాదాసు అయినా… కుడి ఎడమైతే పాట పాడి గ్లాసు దాసుడవునా అనే ఎక్స్ ప్రెషన్స్ బాగుంటాయి. అల్లు అర్జున్ నటించిన ఆర్య సినిమాలోని ఈ పాటలో ప్రతీ అందాన్ని ప్రేమిస్తూ సరదా పడు అంటూ తన మ్యూజిక్ తో దేవి శ్రీ ప్రసాద్ మంచి బీట్ సాంగ్ ను అందించారు.
వద్దురా సోదరా
వద్దురా సోదరా పెళ్లంటే నూరెళ్ల మంటరా.. కళ్యాణమే ఖైదురా జన్మంత విడుదల లేదురా.. డోంట్ మ్యారీ.. బీ హ్యాప్పీ.. అంటూ సాగే పాటను ఏస్పీ బాలసుబ్రమణ్యం పాడారు. దేవదాసు వాలకం ఎందుకంటే దేవిదాసు కావడం వలన అనే ఎక్స్ ప్రెషన్స్ ఉంటాయి. నాగార్జున్ నటించిన మన్మథుడు సినిమాలో ఓ సందర్భంలో వచ్చే ఈ పాటకే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిగా సిరివెన్నెల సీతారామ శాస్త్రీ రాశారు.
ఆడాళ్ల ప్రేమ వల్ల పిచ్చిపట్టిన
నమ్మకు కొందరు ఆడల్లలోని ప్రేమలనీ.. నమ్మిన వాడికి చూపేడుతారు నష్టాన్ని.. అన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కోచేస్తారు.. కొందరు ఆడాళ్లు తేనే కత్తులు.. మన మగవాళ్లు త్యాగమూర్తులు అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాశారు. వందేమాతరం శ్రీనివాస్ పాడగా ఎస్ఏ రాజ్ కుమార్ పాడారు. ఈ పాటలో ఆడదానికై మగడొకడు తాజ్ మహల్ కట్టగా.. మగవాడికై ఏ ఆడదైన చిన్న పూరి గుడిసే కట్టిందా, ఆడవాళ్ల అందాలకే స్వర్ణ కిరీటాలు వాళ్ల వాత పడ్డ మగాళ్లకే మాసిన గడ్డాల అనే పదాలు కొన్ని లాజిక్ గా బాగుంటాయి. కానీ పాట చివర్లో స్త్రీ ప్రేమ గురించి ఒక పాదంలో చెబుతారు.
బుల్లి గౌను వేసుకుని
రణం సిినిమాలో అలి పాడే ఈ పాట ప్రేమ కోసం అతను పాడే పాట్లు చెబుతాడు. బుల్లి గౌను వెసుకొని గిల్లి గజ్జాలు ఆడుకుంటూ పల్లు బయట పెట్టినవే ఓ బేబీ మా టెంత్ క్లాస్ బెంచ్ మెంట్ గులాబీ.. అంటూ సాగే ఈ పాటలో నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు… నమ్మొద్దు నమ్మొద్దు గల్లో పాపను నమ్మొద్దు. అంటూ సరదాగా సాగుతుంది.
ప్రౌడ్ సే సింగిల్
సింగిల్ గా ఉండు మామ గాళ్ ఫ్రెండ్ ఎందుకు.. సింపుల్ గా ఉన్న లైఫ్ ను కాంప్లికేట్ చేయకు.. అనే పాటలో మామా ప్రౌడ్ సే బోలో ఛాన్సె దొరికిన అవకు మింగిలు అనే పాటను రఘురామ్ రాశారు. ఈ పాటను నాకాష్ అజిజ్, బీమ్స్ ఇద్దరు కలిసి పాడారు.
సింగిల్ కింగులం
సింగిల్ కింగులం.. తెల్ల తెల్లాగున్న తాజ్ మహాల్ కి రంగులేసి రచ్చలేపే గబ్బరు సింగులం అంటూ సాగే ఈ పాట సందీప్ కిషన్ నటించిన ఏ1 సినిమాలోనిది. సమ్రాట్ రాసిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ రాశారు. హిప్ హాప్ తమిజా ఇచ్చిన మ్యూజిక్ మాస్ బీట్ ఉంటుంది.
సింగిల్స్ ఆంథమ్
నితిన్ హీరోగా నటించిన భీష్మ చిత్రంలో హై క్లాస్ నుంచి లో క్లాస్ దాకా నా క్రష్ లే.. వందల్లో ఉన్నారులే.. ఒక్కల్లు సెట్టవ్వలే, కిస్సింగ్ కోసం, హగ్గింగ్ కోసం వైటింగులో పాపెనుకే జాగింగ్ లే.. లైఫంతా బిగ్గింగ్ లే.. ఎన్నాళ్లీలా ఈ ఒంటరి బతుకే నాకిలా.. బాయ్ ఫ్రెండ్ గా మార్చదే ఏ పిల్లా.. అంటూ సాగే ఈ పాటలో సింగిలే ఐ యామ్ రెడీ టు మింగిలే లైఫ్ కు లేదే రంగులే నువ్వు పడవా పాపా అంటూ చాలా హుషారుగా సాగుతుంది. శ్రీమణి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు.
బ్యాచిలర్స్ ఆంథమ్
సందీప్ కిషన్ హీరోగా లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించిన మజాకా సినిమాలో బ్యాచిలర్ ఆంథమ్ అనే సాంగ్ ఉంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సింగర్ ధనుంజయ్ పాడారు. స్టేటస్ సింగల్లే.. అయ్యో.. పార్ట్ నర్ దొరకట్లే.. అయ్యే.. వంటరి ముచ్చట్లే అయ్యో.. అయ్యో అయ్యో అంటూ సాగే ఈ పాట చాలా సరదాగా సాగిపోతుంది. ఈ పాటలో స్టిల్లు మేము బ్యాచిలర్సే.. ఇంకా మేము బ్యాచిలర్లే అనే హుక్ లైన్ బాగుంటుంది.
ఏదేమైనా ఒక పరిపూర్ణ జీవితాన్ని అనుభవించాలంటే జీవితంలో ఒక తోడు ముఖ్యం అని ఎంతో మంది మహానుభావులు అంటారు. ఈ రోజు సింగిల్స్ డే కాబట్టి ఈ పాటలను కాసేపు విని ఆనందించండి.