National Pet Lovers Day Special In Movies
పెంపుడు జంతువులపై వచ్చిన తెలుగు సినిమా
ఈ ప్రకృతిలో ఉన్న వాటిలో జంతువులపై మనుషులకు ఉండే ప్రేమ చాలా నిజాయితీ పరమైనది అని చాలా మంది నమ్మకం. నిజానికి మూగజీవులను ఎంత ప్రేమిస్తే అవి తిరిగి ప్రేమిస్తాయి అనే మాటలను కూడా వింటూనే ఉంటాము. ఈ రోజు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం కాబట్టి ఈ నేపథ్యంలో వచ్చిన సిినిమాల గురించి చూస్తే.. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన టామి, కన్నడ నుంచి తెలుగు డబ్ అయిన చార్లీ 777 సినిమాలు కంప్లీట్ గా పెట్ లవర్స్ కోసం తీసిన సినిమాలు. వీటిలో చార్లీ777 సినిమా ప్రత్యేకం. ఎందుకంటే కేవలం మనిషికి, జంతువుకు మధ్య భావోద్వేగాన్ని మాత్రమే కాకుండా కుక్కల జీవితాలకు సంబంధించిన ఒక విషయాన్ని తెరమీద చూపించారు. ఆ పాయింట్ ఏంటీ, సినిమా కథ ఏంటో ఒకసారి చూద్దాం.
హీరో ధర్మ చాలా నిర్లక్ష్యంగా తన జీవితాన్ని గడుపుతుంటాడు. అలాంటి అతని లైఫ్ లోకి అనుకోకుండా ఒక కుక్క వస్తుంది. దాని పేరు చర్లీ777 అని పేరు పెట్టి తనతో పాటే పెంచుకుంటాడు. అలాంటి సమయంలో కుక్కకు మంచు అంటే ఇష్టం అని దానికి ఒక అరుదైన వ్యాధి కారణంగా చనిపోతుంది అని తెలుసుకుంటాడు. దాని చివరి కోరిక మంచులో ఆడిపించడానికి హిమాచల్ ప్రదేశ్ కు తీసుకెళ్తాడు. ఆ సమయంలో ఆ కుక్క ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పటికే వాళ్లిద్దరి మధ్యలో మంచి అనుబంధం ఏర్పడుతుంది. అలాంటి సమయంలో ఒక వ్యక్తి కీటన్ అనే పేరు పిలవగానే భయపడిపోతుంది.
ఒక వ్యక్తి డబ్బు సంపాదించాలనే అత్యాశతో మంచి జాతి కుక్కలకు ఇంజక్షన్లు ఇచ్చి అసహజ పద్దతిలో అవి ప్రెగ్నెంట్ అయ్యేలా చేస్తాడు. అలాంటి కుక్కలు చాలా ఉంటాయి. కీటన్ అంటే చార్లీ మొదట అతని దగ్గరే ఉంటుంది. అక్కడి నుంచి తప్పించుకొని వస్తుంది. అలా వచ్చి ధర్మ దగ్గర చేరుతుంది. అసలు విషయం తెలుసుకున్న ధర్మ మీడియాకు, బ్లూ క్రాస్ వాళ్లకు ఆ కుక్కలను అప్పగిస్తాడ. ఆ తరువాత చార్లీని తీసుకొని మంచు ప్రదేశానికి వెళ్లిపోతాడు. అక్కడే హాయిగా ఆడుకుంటున్న చార్లీ సడన్ గా మాయం అవుతుంది. దాన్ని వెతుకుతూ వెళ్లిన ధర్మకు ఒక శివుని గుడి బయట మంచులో చార్లీ చనిపోయినట్లు కనిపిస్తుంది. ఆ గుడిలోంచి చార్లీ జన్మనిచ్చిన కుక్కపిల్ల వస్తుంది. దాన్ని తీసుకొని చార్లీ చాలా భావోద్వేగానికి గురవుతాడు.
ఈ చిత్రం చిన్పపిల్లల నుంచి పెద్దల వరకు అందరిని కదిలించింది. అందుకే ఈ రోజు ఆ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. టోక్యోలో సైతం హిచికో అనే ఒక కుక్క గురించి చాలా మంది చెబుతారు. హిచికో కుక్క స్టోరీతో కూడా ఒక సినిమా వచ్చింది.