Drogan Movie Hero pradeep Ranganathan
డ్రాగన్ మూవీ హీరో ప్రదీప్ రంగనాథన్
లవ్ టుడే సినిమాలో ఫేమ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ఓ యూట్యూబర్ అని ఎంతమందికి తెలుసు. ప్రదీప్ రంగనాథన్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానెల్ కు 6లక్షల 33 వేల మంది సబ స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన కేవలం 46 వీడియోలు మాత్రమే పోస్ట్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ తో ఇండస్ట్రీలోకి వచ్చారు. లవ్ టుడే కంటే ముందే 2019లో కోమలి అనే సినిమాతో మంచి హిట్ అందుకోవడమే కాదు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ కెటగిరీలో సైమా అవార్డు కూడా అందుకున్నారు. అలాగే లవ్ టుడే సినిమాకు బెస్ట్ డెబ్యూడ్ యాక్టర్ గా సైమా అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ తో వస్తున్నారు.
ప్రదీప్ రంగనాథన్ రైటర్ డైరెక్టర్ అండ్ యాక్టర్ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ కూడా. ఆయన ప్రొడ్యూస్ చేసిన లవ్ యాప చిత్రం రీసెంట్ గా విడుదలైంది. హిందీలో తెరకెక్కిన ఈ రోమాంటిక్ కామెడీ ఫిల్మ్ కు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ తనయులు నటించారు. శ్రీదేవి కూతురు కుషి కపూర్, అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించారు. ప్రదీప్ రంగనాధన్ ప్రస్తుతం డ్రాగన్ చిత్రంతో వస్తున్నారు. ఆయన అప్ కమింగ్ ఫిల్మ్ టైటిల్ కూడా చాలా విచిత్రంగా ఉంది. అదేంటంటే లవ్ ఇన్సు రెన్స్ కంపెనీ. ఈ చిత్రానికి రచయితగా, హీరోగా చేస్తున్నారు.
ప్రదీప్ రంగనాధన్ మాములోడు కాదు. లవ్ టుడే సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా 5 కోట్లుకు తక్కువే కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు మాత్రం 100 కోట్లకు ఎక్కువే. కరెంట్ సిచువేషన్స్ ను తనదైన స్టైల్ లో రాసుకోవడం ఆయనకు అలవాటు. అందుకే లవ్ టుడే సూపర్ హిట్. ఇప్పుడు అదే తరహాలో వస్తున్న డ్రాగన్ ట్రైలర్ లో కూడా చాలా అంశాలను చూపించారు. ఈ సినిమాను దాదాపు 37 కోట్లు పెట్టి నిర్మించారు. ఈ ఒక్క విషయం చాలాదా ప్రదీప్ కేరీర్ గ్రాఫ్ చెప్పడానికి. తెలుగులో కూడా ఆయనపై మంచి అంచనాలు ఉన్నాయి. దానికి తోడు సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కేఎస్ రవి కుమార్, గౌతమ్ మీనన్ కూడా ఉన్నారు.