History Telugu Cinema 1965-66
తెలుగు సినిమా చరిత్ర 1965-66
1965లో మొత్తం 32 చిత్రాలను నిర్మించారు. ఇదే సంవత్సరం కృష్ణ, రామ్మోహన్, కాంచన, సుకన్య, జయలలిత తదితరులు వెండితెరకు పరిచయం అయ్యారు. ఎం మల్లికార్జున రావు, సంజీవ రావు, బి.వి ప్రసాద్ దర్శకులు కూడా ఇదే సంవత్సరం పరిచయం అయ్యారు. ఈ సంవత్సరం శృంగారరసాన్ని తెలుగు తెరపై మొదటి సారిగా చూపించారు. జయలలిత నటించిన మనుషులు మమతలు చిత్రానికి ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి ఏ సర్టిఫికేట్ వచ్చిన చిత్రం మనుషులు మమతలు. ఇదే సంవత్సరం తేనే మనసులు చిత్రం విడుదలైంది. కలర్ లో వచ్చిన ఫస్ట్ సాంఘీక చిత్రం ఇది. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంస పత్రం వచ్చింది. ఇదే ఏడాది విడుదలైన అంతస్తులు చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం వచ్చింది.
1966లో మొత్తం 34 చిత్రాలను నిర్మించారు. కే విశ్వనాథ్ దర్శకుడిగా పరిచయం అయింది ఇదే సంవత్సరం. అన్నపూర్ణ వారు నిర్మించిన ఆత్మగౌరవం చిత్రంతో ఆయన పరిచయం అయ్యారు. ఈ సినిమాకు రాష్ట్రపతి యోగ్యతపత్రం లభించింది. అక్కినేని నాగేశ్వర రావు 9 పాత్రల్లో అలరించిన నవరాత్రులు సినిమా ఇదే సంవత్సరం విడుదలైంది. తెలుగులో జేమ్స్ బాండ్ చిత్రం గుఢాచారి 116 చిత్రం కూడా ఇదే ఏడాది విడుదలైంది. ఈ సినిమాలో కృష్ణ హీరోగా నటించారు.