Reading Time: < 1 min

Hit 3 Teaser Review
హిట్ 3 టీజర్ రివ్యూ

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ 3 నుంచి టీజర్ విడుదలైంది. హిట్ సిరీస్ లలో ది థార్డ్ కేసుగా ఈ చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్ బ్యానర్లపై ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా రూపోందుతున్న ఈ చిత్రం మే 1 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అర్జున్ సర్కార్ పాత్రలో వేరీ యాంగ్రీ మెన్ గా నాని నటిస్తున్నారు. వైలెన్స్ నెక్ట్స్ లెవల్ ఉంటుందని తాజా టీజర్ చూస్తే అర్థం అవుతుంది. పోలీస్ ఆఫీసర్ రావు రమేష్ డైలాగ్ ఒకటి ఉంది. ఈ కేసు ను అర్జున్ సర్కార్ కు ఇవ్వడానికి నాకేలాంటి ప్రాబ్లమ్ లేదు కానీ అతని చేతికి చిక్కిన నిందితుడి పరిస్థితి ఆలోచిస్తే భయం వేస్తుంది అంటున్నారు. దాన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

నాని సరసన శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు కానీ తన పాత్రను ఈ టీజర్ లో చూపించలేదు. ఇప్పటికే హిట్ సిరీస్ లు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. మొదటి సిరీస్ లో విశ్వక్ సేన్ నటించారు. ఆ తరువాత అడవి శేషు నటించారు. అదే పరంపరను కొనసాగిస్తూ నాని ది థార్డ్ కేసులో నటిస్తున్నారు. వరుస హత్యలు సేమ్ పాటర్న్ లో జరుగుతున్నాయంటే ఏదో మోటీవ్ ఉంది అని నాని చెప్పే డైలాగ్, ఆ తరువాత ఆయన ప్రవర్తన చాలా ఉక్రోషంగా ఉంది. కొన్ని సీన్లు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇక టీజరే ఈ రేంజ్ లో ఉంటే ఫుల్ సినిమా ఎలా ఉంటుందో మరి.