A Great Honor To The Producer K Acchireddy
ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డికి ఘన సత్కారం
అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల కలయికలో ప్రముఖ సినీ నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డిని సత్కరించారు.
అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం అత్తిలి షాదీఖానా భవనం లో నిర్వహించారు. అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1971-73 ఇంటర్మీడియట్ బ్యాచ్ విద్యార్థులు 52 ఏళ్ల తరువాత కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు భరతనాట్యం, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. తమతో చదువు కున్న ప్రముఖ సినీ నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డిని సత్కరించారు. అలాగే వారితో చదువుకుని మృతి చెందిన పలువురు పూర్వ విద్యార్థుల మృతికి సంతాపం తెలిపారు. కార్యక్రమంలో పోలిశెట్టి చంటి, జెడ్పీ కోఆప్టెడ్ సభ్యుడు మహమ్మద్ అబీబుద్దీన్, దిరిశాల ప్రసాద్, చిన్నం లక్ష్మణరావు పాల్గొన్నారు. ఇక ఇదే కాలేజీలో తరువాతి రోజుల్లో బ్రహ్మానందం లెక్చరర్ గా పని చేయడం గమనార్హం. నిర్మాత కొవ్వూరి అచ్చిరెడ్డి స్టూడెంట్ లీడర్ గా వున్న టైం లోనే జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. అచ్చిరెడ్డి కొన్ని రోజులు నిరాహార దీక్ష కూడా చేసారు.