Reading Time: 2 mins

Lord Shiva Backdrop Upcoming Movies In Telugu
శివుని చుట్టు సాగే కథల నేపథ్యంలో రాబోవు సినిమాలు

తెలుగు సినిమాలు నిర్మిస్తున్న కాలం నుంచి నేటి వరకు భక్తిరస చిత్రాలు వస్తూనే ఉన్నాయి. తెలుగు పండుగలు సందర్భంగా ఆ పండుగ నేపథ్యంలో సినిమాలు తీయడం నేటికి అనవాయితీగా వస్తున్నాయి. అలా పరమేశ్వరుని నేపథ్యంలో ఇప్పటివరకు చాలా సిినిమాలు వచ్చాయి. అందులో ఎన్నో సినిమాలు ప్రేక్షాదరణ పొందాయి. ప్రస్తుతం కూడా శివుని నేపథ్యంలో తెలుగు సినిమాలు నిర్మిస్తున్నారు. పూర్తిగా శివుడి గాధనే కాకుండా కొంత భాగమైన ఆ జఠాధరుడిని స్పృషిస్తూ తెరకెక్కించే సీనులు వస్తున్నాయి. మరి తెలుగులో రాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం.

భక్త కన్నప్ప

శివ భక్తుడు కన్నప్ప గురించి ఇది వరకే కృష్ణంరాజును చూశాము. ఇప్పుడు అదే కన్నప్ప పాత్రలో మంచు విష్ణును చూడబోతున్నాము. ముకేశ్‌ కుమార్‌సింగ్‌ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో విజువల్‌ ఎఫెక్ట్స్‌ భారీ స్థాయిలో చేస్తున్నట్లు ఇదివరకే విడుదలైన టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్‌ కుమార్‌, తిన్నడుగా విష్ణు, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, కాజల్‌ తదితరులు నటిస్తున్నారు.

అఖండ 2

బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించారు. ఆ సినిమాలో బాలయ్య పరమశివుడి భక్తుడిగా నటించిన తీరు అందరిని మెప్పించింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా అఖండ 2 తాండవం రాబోతుంది. ఈ చిత్రం సెప్టెంబరు 25న విడుదలకు సిద్దం అవుతుంది.

ఓదెల 2

దర్శకుడు సంపత్ నంది అందిస్తున్న కథతో ఓదెల రైల్వేస్టేషన్‌ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా ఓదెల 2 చిత్రం రూపొందుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనేది ఈ కథ. ఈ చిత్రాన్ని అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్నారు. శివశక్తిగా, దైవిక నాగ సాధువు పాత్రలో తమన్నా కనిపించబోతున్నారు. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్‌ సింహ తదితరులు నటిస్తున్నారు.

జఠాధర

సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జఠాధర. ఈ చిత్రాన్ని దర్శకుడు వెంకట్‌ కల్యాణ్‌ తెరకెక్కిస్తున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ రాసుకున్న కథ. ఇప్పటికీ చాలా రహస్యంగా ఉన్న ఆ గుడి నేపథ్యంలో సాగే కత ఇది. శివుడి సపంబంధించిన సన్నివేశాలూ ఈ మూవీలో అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఏ మాస్టర్‌పీస్

అరవింద్‌ కృష్ణ, అషురెడ్డి, జ్యోతి పూర్వజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్ర ఏ మాస్టర్ పీస్. ఈ మూవీని దర్శకుడు సుకు పూర్వజ్‌ తెరకెక్కిస్తున్నారు. శివుడి నేపథ్యంలో సాగుతుంది.

హైందవ

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటిస్తున్న చిత్రం హైందవ. ఈ మూవీని లుధీర్‌ బైరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పురాతన ఆలయం చుట్టూ జరిగే కథ ఇది. ఇటీవల విడుదలైన గ్లింప్స్‌ చాలా బాగున్నాయి. సాయి శ్రీనివాస్‌ అఘోరగా అలరిస్తున్నారు. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది.