Reading Time: 4 mins

Mazaka Movie Thanks Meet

మజాకా మూవీ థాంక్స్ మీట్

మజాకా కి అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్ కి బిగ్ థాంక్స్: పైసా వసూల్ సినిమా ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు: నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ లో హీరో సందీప్ కిషన్

పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్, ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన లేటెస్ట్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ పై రాజేష్ దండా నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్  కీలక పాత్రలు పోషించారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ నవ్వుల బ్లాక్ బస్టర్ మజాకా థాంక్స్ మీట్ ని నిర్వహించారు.

థాంక్స్ మీట్ లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ..  అందరికీ థాంక్యు. ఈ సినిమా చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమాకి అందరూ చాలా ప్రేమతో పని చేశారు. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి అందరికీ థాంక్స్. ముందుగా ప్రసన్న గారికి థాంక్స్ చెప్పాలి. నేను త్రినాథ్ గారు కలిసి పని చేయాలని కోరిక ప్రసన్న గారికే ఎక్కువుంది. చాలా సంవత్సరాలుగా అనుకున్నాం. ఫైనల్ గా మజాకాతో కుదిరింది. నేను చాలా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. పిల్లలు, పెద్దలు థియేటర్ కి వెళ్లి పగలబడి నవ్వుకోవాలని ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. నేను ఈ సినిమాని థియేటర్స్ లో చూశాను. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చివర్లో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు. ఆడియన్స్ రెస్పాన్స్ కి బిగ్ థ్యాంక్స్.  ఆడియన్స్ సినిమా చాలా బాగుందని చెప్పడం ఆనందాన్ని ఇచ్చింది, సినిమా జనాల్లోకి వెళ్ళింది. తప్పకుండా ఈ సినిమాని థియేటర్లోకి వెళ్లి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. పైసా వసూల్ సినిమా ఇది. థియేటర్స్ కి రండి.  చాలా ఎంజాయ్ చేస్తారు. మా ఈవెంట్ కి గెస్ట్ గా అతిథులుగా వచ్చిన అందరికీ థాంక్యు. అనిల్ గారికి థాంక్యూ. రాజా నాకు బ్యాక్ టు బ్యాక్ రెండు మంచి సినిమాలు ఇచ్చాడు.  తను మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు’అన్నారు.

డైరెక్టర్  త్రినాధరావు నక్కిన మాట్లాడుతూ..  ఆడియన్స్ థియేటర్స్ లో సినిమాని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి  బాగా కనెక్ట్ అయింది. మేము ఏదైతే నవ్వించాలని చేశాము అది సక్సెస్ఫుల్ గా వర్క్ అవుట్ అయింది. లాస్ట్ 15 మినిట్స్ ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. నవ్వొచ్చినప్పుడు నవ్వాలి ఏడుపు వచ్చినప్పుడు ఏడవాలి అప్పుడు హెల్త్ చాలా బాగుంటుంది. ఈ రెండు మా సినిమాలో ఉన్నాయి.అంతవరకు సక్సెస్ అయ్యానని ఫీల్ అవుతున్నాను. మజాకా చూసిన ఆడియన్స్ ఇంటికి వెళ్లి సినిమా గురించి చెప్పండి .ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది.  మా డైరెక్షన్,  ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఈ సినిమా కోసం చాలా సపోర్ట్ చేశారు.  సందీప్ గారు నా మీద నమ్మకంతో ఈ సినిమా చేశారు. సక్సెస్ పట్ల ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ థియేటర్స్ కి వెళ్ళండి సినిమా చూడండి. ఇది తప్పకుండా థియేటర్స్ లోనే చూడాల్సిన సినిమా. థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయండి’అన్నారు.

హీరోయిన్ రీతు వర్మ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా సినిమాకి సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి హిట్ ఇచ్చిన ఆడియన్స్ కి బిగ్ థ్యాంక్స్. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది.  టీమ్ లో అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుంది’అన్నారు.

నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.  ఈ సినిమా ఆడియన్స్ థియేటర్స్ లో చాలా నవ్వుతున్నారు. మేము అనుకున్నట్టు ఈ సినిమా నవ్వుల కోసమే లాజిక్స్ కోసం కాదు. థియేటర్స్ లో జనంతో కలిసి చూస్తే నవ్వులు పదింతలు అవుతాయి. దీంతో ఆరోగ్యం పదింతలు పెరుగుతుంది. మా మజాకాలో అలాంటి నవ్వులు పుష్కలంగా ఉన్నాయి. సినిమా ఇలాగే కంటిన్యూ అవ్వాలని వీకెండ్ కి మరింత పెరగాలని కోరుకుంటున్నాను. సందీప్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు లాస్ట్ వన్ మంత్ అసలు నిద్రపోలేదు. తన లైనఫ్ అద్భుతంగా ఉంది. కామెడీలో తను ఎంత అద్భుతంగా చేయగలడో ఈ సినిమా నిరూపించింది. ప్రసన్న రైటింగ్ నాకు చాలా ఇష్టం. తనతో మరోసారి కలసి పని చేయాలని వుంది. రీతు అన్షు చక్కగా చేశారు. రావు రమేష్ గారి నటన అద్భుతం. రాజా సినిమా కోసం చాలా కష్టపడతాడు.ఈ సినిమాని అనుకున్న సమయంలో థియేటర్స్ లో లాంచ్ చేయడానికి చాలా హార్డ్ వర్క్ చేశాడు. మేము అనుకున్న రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి రావడం చాలా ఆనందంగా వుంది. త్రినాధ్ గారి పాజిటివిటీ సినిమాలో కనిపిస్తుంది. అందరికీ థాంక్ యూ’ అన్నారు.

యాక్టర్ అన్షు మాట్లాడుతూ.. అందరికీ థాంక్ యూ. ఈ సినిమాలో యశోద లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్. నా క్యారెక్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ వెల్ కం బ్యాక్ అని చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మీ అందరి ప్రేమకి థాంక్ యూ. ప్రసన్న గారి సపోర్ట్ ని మర్చిపోలేను. త్రినాథ్ గారి, రీతూ, సందీప్ అందరికీ థాంక్ యూ’అన్నారు.

రైటర్ ప్రసన్న మాట్లాడుతూ… మజాకా మా లైఫ్ లో హ్యాపీయస్ట్ మెమరీ. ఈ సినిమా సెట్స్ లో ప్రతిరోజు పండగలా ఉండేది. అన్షు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె ఇక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. రీతూ గారు సిన్సియర్ యాక్టర్. రావు రమేష్ గారు నాకు ఫాదర్ లాంటివారు. ఆయనకు రాస్తున్నప్పుడు అక్షరాలకి ఒక గౌరవం వస్తుందని భావిస్తాను. నిర్మాత రాజేష్ దండ గారు ఈ సినిమాకి స్ట్రాంగ్ బ్యాక్ బోన్. ఆయనకి ఎన్నో సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అనిల్ గారు యూఎస్ నుంచి వచ్చి ఈ సినిమా కోసం నిలబడ్డారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేను. సందీప్ గారు ఇండస్ట్రీలో నాకు క్లోజ్ గా ఉండే హీరో. ఈ సినిమాతో మరింత క్లోజ్ అయ్యారు. మమ్మల్ని నమ్మి మాకోసం ఈ సినిమా చేశారు. ఆయనతో వర్క్ చేయడం వెరీ హ్యాపీ. నేను రాసిన ప్రతి మాటకి గౌరవం తీసుకొచ్చినంత అందంగా డైరెక్టర్ త్రినాథ్ గారు సినిమాల్ని తీర్చిదిద్దారు. ఇంతకంటే మంచి డైరెక్టర్ ని ఏ రైటర్ అడగలేడు. సాయి కృష్ణ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఇదే యూనిట్ తో మళ్లీ సినిమా చేస్తే బాగుంటుందని ఫీలింగ్ నాకుంది. అందరికీ థాంక్యు.’అన్నారు.

డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ… మజాకా టీమ్ అందరికీ బిగ్ కంగ్రాజులేషన్స్. రావు రమేష్ గారి పర్ఫామెన్స్ ని చాలా ఎంజాయ్ చేశా. ఫ్యామిలీస్ అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో కల్సి ఎంజాయ్ చేసే సినిమా ఇది. మా హీరో సందీప్ గారు సక్సెస్ ని ఇలాగే కొనసాగిస్తూ మరో హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్యు’అన్నారు.

నిర్మాత రాజేష్ దండ మాట్లాడుతూ.. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఊరు పేరు భైరవకోనతో మంచి హిట్ కొట్టాం.  ఈ ఇయర్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మజాకాతో వచ్చి హిట్ కొట్టాం. సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. యూత్ అందరూ సినిమాని చూస్తున్నారు. వీకెండ్స్ లో ఫుల్ ఉంటాయి. సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. ఇంత మంచి సినిమా తీసి ఇచ్చిన మా డైరెక్టర్ త్రినాధ్ గారికి, రైటర్ ప్రసన్న గారికి అందరికీ థాంక్యూ. సందీప్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. రేపు సక్సెస్ టూర్ గా తిరుపతి వెళుతున్నాం. అక్కడి నుంచి అన్ని ఏరియాలు కవర్ చేస్తాం. అందరికీ థాంక్యూ’అన్నారు.

డైరెక్టర్ విఐ ఆనంద్ మాట్లాడుతూ.. నిర్మాతలకి కంగ్రాజులేషన్స్. చాలా రోజుల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం చూశాను. డైరెక్టర్, రైటర్ ఈ క్రెడిట్ దక్కుతుంది. త్రినాథ్ ప్రసన్న గారి కాంబినేషన్ ఎప్పుడు కూడా బ్లాక్ బస్టర్. మళ్లీ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ప్రూవ్ అయింది. ఫాదర్స్ అండ్ సన్ కెమిస్ట్రీని చాలా ఎంజాయ్ చేశాను. రావు రమేష్ గారి కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వర్క్. .సందీప్ కిషన్ ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నారు. ఇందులో తన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వుంది. ఫ్యామిలీ అందరితో ఎంజాయ్ చేసే సినిమా ఇది. అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా’అన్నారు.