Reading Time: < 1 min

The Paradise Teaser Review
ది ప్యారడైజ్ గ్లింప్స్ రివ్యూ

నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో తెరకెక్కిన దసరా చిత్రం విజయవంతం అయింది. ఇదే కాబినేషన్ లో ఇప్పుడు ది ప్యారడైజ్ అనే చిత్రంతో వస్తున్నారు. ది పారడైజ్ నుంచి గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. నాని మాస్ లుక్‌లో డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నారు. గ్లింప్స్ అదిరిపోయింది. నాని నుంచి ఇలాంటి ఫర్ఫార్మెన్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా సమాధానంగా కనిపిస్తుంది. తెలంగాణ మాండలికంలో చెప్పిన వాయిస్ ఓవర్ చాలా బాగుంది. అలాగే ఒక పదాన్ని వాడడం వెనుక నెట్టింట చర్చ జరుగుతోంది.

విడుదలైన వీడియోలో తల్లినే తన కొడుకు గురించి, ఆయన చరిత్ర గురించి చెబుతుంది. అలాంటి అప్పుడు ఆ పదాన్ని తన తల్లినే ఎందుకు వాడింది అనేది చాలా ఆసక్తిగా కరంగా మారింది. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది అంటే 26-3-2026 లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చూడాలి మరి సినిమా ఎలా ఉండబోతుందో.