Reading Time: < 1 min

This Week Releases Movies
ఈ వారం విడుదలవుతున్న సినిమాలు

మార్చి నెలలో పెద్దగా సినిమాలు విడుద‌ల అవవు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే సినిమాలకు ఇది బ్యాడ్ సీజ‌న్‌. ఇంటర్ మీడియట్ ప‌రీక్ష‌లు మొద‌లైపోతాయి, వాటి తరవాత పదవతరగతి, అలా యువ‌త‌రం అంతా ఎగ్జామ్స్ హడావుడిలో ఉంటారు. అయినా సరే ఈ వారం సినిమాలు జోరుగానే వ‌స్తున్నాయి. అయితే పెద్ద సినిమాలు కాకపోయిన మధ్యతరగతి సినిమాలు థియేటర్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ వారం మొత్తం 8 సినిమాలు విడుదల కానున్నాయి. అవేంటో చూద్దాం.

జీవీ ప్ర‌కాష్ హీరోగా నటించిన కింగ్స్ట‌న్‌ సినిమా ఈ వారమే విడుదలకు సిద్ధమైంది. స‌ముద్ర ప్ర‌యాణంలో జాంబీలు ఎదురైతే ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ట్రైల‌ర్‌ బాగుంది. తరువాత బాలీవుడ్ లో ఘ‌న విజ‌యం సాధించిన ఛావా ఇదే వారం వస్తుంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రీబ్యూట్ చేస్తుంది. వీటితో పాటు రాక్ష‌స‌, నారీ, రారాజు, శివంగి, పౌరుషం, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో సినిమాలు కూడా రిలీజ్ కు సిద్దం అయ్యాయి. వీటితో పాటు రీ రిలీజ్ ట్రెండ్ సాగుతున్న తరుణంలో వెంక‌టేష్ – మ‌హేష్ బాబు మ‌ల్టీస్టార‌ర్ చిత్రం సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు రీ రిలీజ్ చేస్తున్నారు.