Sankrathiki Vasthunnam Complete 50 Days
సంక్రాంతికి వస్తున్నాం 50 రోజులు పూర్తి
వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో రికార్డు క్రియేట్ చేసింది. 92 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ZEE5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ కూడా సంక్రాంతికి వస్తున్నం థియేటర్లలో వసూళ్లు రాబట్టడం విశేషం. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంటర్ టైన్ చేస్తుంది.