Gopichandh Malineni Birthday Special
గోపిచంద్ మలినేని పుట్టిన రోజు స్పెషల్
తెలుగులో కమర్షియల్ డైరెక్టర్ లలో ఒకరైన గోపిచంద్ మలినేని ఒకరు. ప్రస్తుతం హిందీలో జాత్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ మూవీ కావడం విశేషం. 1980 మార్చి 13 న జన్మించిన గోపిచంద్ చిన్నప్పటి నుంచి సినిమాల్లో రాణించాలనే లక్ష్యంతో పని చేశారు. ప్రముఖ టెలివిజన్ ఛానెల్ లో ఒక ప్రోగ్రామ్ కు అసిస్టెంట్ కెమెరమెన్ గా ఆయన జర్నీని మొదలు పెట్టారు. ఆ తరువాత వీర శంకర్ దర్శకత్వంలో వచ్చిన హల్లో ఐ లవ్ యూ చిత్రానికి అసిస్టెంట్ కెమెరమెన్ గా పని చేశారు. ఆ తరువాత హీరో శ్రీహరితో మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. దర్శకుడు ఈ.వి.వి సత్యనారాయణ దగ్గర ఒక మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసీ, కామెడీపై మంచి పట్టు సాధించారు. అలాగే శ్రీను వైట్ల టీమ్ లో వెంకీ, ఢీ, అందరివాడు సినిమాలకు వర్క్ చేశారు.
మురగదాసు దర్శకత్వం వహించిన స్టాలీన్, మెహర్ రమేష్ తో కంత్రి, బిల్లా చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి 2010లో డాన్ సీను తో తొలిసారిగా దర్శకత్వం వహించారు. మొదటి సిినిమాతోటే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. రవితేజతో మూడు సినిమాలు చేశారు. డాన్ సీను, బలుపు, క్రాక్. నందమూరి బాలకృష్ణతో సైతం వీర సింహారెడ్డి సిినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నారు. వెంకటేష్ తో బాడీగార్డ్, రామ్ పోతినేనితో పండుగచేస్కో సినిమా, సాయి దుర్గ తేజ్ హీరోగా విన్నర్ సినిమా తీశారు. ప్రస్తుతం జాత్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ రోజు గోపిచంద్ మలినేని పుట్టిన రోజు సందర్భంగా బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున ఆయనకు బెస్ట్ విషేస్ అందిస్తున్నాము.