This Weekend Releases
ఈ వారం విడుదలయ్యే సిినిమాలు
ప్రతీ శుక్రవారం థియేటర్లో, ఓటీటీలలో తెలుగు సినిమాలు విడుదల అవుతుంటాయి. అంతే కాకుండా ఈ మధ్య రీరిలీజ్ ట్రెండ్ సాగుతున్న నేపథ్యంలో తెలుగు సినిమాలు మళ్లీ విడుదలై మంచి వసుళ్లను సాధిస్తున్నాయి. అయితే ఈ వారం థియేటర్లో విడుదల అవుతున్న సినిమాలతో పాటు ఓటీటీలో అలరించబోయే తెలుగు సినిమాలేంటో చూద్దాం.
ఆది సాయికుమార్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ షణ్ముఖ. అవికా గోర్ హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని షణ్ముగం సాప్పని
డైరెక్షన్ చేశారు. ఓ ఆసక్తికర పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. పోలీసు ఆఫీసర్ గా ఆది సాయికుమార్ నటిస్తున్నారు. అమ్మాయిలు కిడ్నాప్ అవడం, వారిని ప్రేమించిన అబ్బాయిలు ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఉన్న రహస్యాన్ని హీరో ఎలా చేదించాడు అనేది ఈ సినిమా కథ. ఈ చిత్రం మార్చి 21 ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
వంశానికి చెందిన శాసనాల గ్రంథం ప్రకారమే పెళ్లి చేసుకోవాలి అనుకున్న ప్రసాద్ కు పెళ్లి అయిందా లేదా అనే నేపథ్యంలో వస్తున్న సినిమా పెళ్లికాని ప్రసాద్. సప్తగిరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏ మేరకు వినోదాన్ని పంచుతుందో చూడాలంటే ఈ నెల 21 వరకు వేచి చూడాల్సిందే.
హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి యువ నటులు నటిస్తున్న తాజా చిత్రం టుక్ టుక్ మార్చి 21 న విడుదలకు సిద్ధం అయింది. సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.
సినిమా అంతా ఆస్ట్రేలియాలో చిత్రీకరణ జరుకొని మార్చి 21న విడుదల అవుతున్న చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. నూతన దర్శకుడు తారక రామ ఈ చిత్రాన్ని యాదర్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. వీటితో పాటు ఆర్టిస్ట్, ది సస్పెక్ట్, కిస్ కిస్ కిస్సిక్ చిత్రాలు కూడా మార్చి 21 విడుదల అవుతున్నాయి. వీటితో పాటు రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా ఎవడే సుబ్రహ్మణ్యం, సలార్ పార్ట్ 1 చిత్రాలు మళ్లీ విడుదల అవుతున్నాయి.
ఓటీటీ విడుదలయ్యే సిినిమాలు చూసుకుంటే
ఈటీవి విన్
జితేందర్ రెడ్డి (మార్చి 20)
ఆహా
బ్రహ్మఆనందం (మార్చి 20)
నెట్ ఫ్లిక్స్
ఆఫీసర్ ఆన్ డ్యూటీ