Arjun S/o Vyjayanthi Teaser Review
అర్జున్ S/o వైజయంతి టీజర్ రివ్యూ
కల్యాణ్ రామ్ హీరోగా సీనియర్ నటీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ S/o వైజయంతి. కొడుకు పోలీసు ఆఫీసర్ కావాలి అనుకునే తల్లి వైజయంతి, తల్లిని ప్రేమించే కొడుకు అర్జున్ మధ్య జరిగే డ్రామానే ఈ సినిమా అనేది టీజర్ చూస్తే అర్థం అవుతుంది. చట్టాన్ని గౌరవిస్తూ తన డ్యూటీని చేసిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా వైజయంతి పాత్రలో విజయశాంతి ఒదిగిపోయారు అనిపిస్తుంది. రాములమ్మగా తెలుగు ప్రజలు గౌరవించే ఆ పౌరుషం మళ్లీ తెరపై చూపిస్తారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఒక 20 నిమిషాలు అయినా కనిపిస్తారు అనేది టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక్కడ అర్జున్ క్యారెక్టర్ చాలా ఆసక్తిగా అనిపిస్తుంది.
అనుకోని పరిస్థితుల వలన పోలీస్ కావాల్సిన అర్జున్ చట్టాన్ని తన చేతులోకి తీసుకొని వైజాగ్ ను శాసిస్తుంటాడు అనేది ఆయన చెప్పే డైలాగ్ ను బట్టి అర్థం అవుతుంది. ఈ వైజాగ్ ను రేపటి నుంచి పోలీసు బూట్లు, నల్లకోట్లు కాదు నా కనుసైగలు శాసిస్తాయి అనే డైలాగ్ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. పోలీసులపై గుండాల దౌర్జన్యం ఏంటి అనేది పోలీస్ ఆఫీసర్ గా పృథ్వీ చెప్పే డైలాగ్ వింటే అర్థం అవుతుంది. అలాంటి మదగజాలను అనచాలంటే లా అండ్ ఆర్డర్ ను ఫాలో అయ్యే పోలీస్ గా కాదు, చట్టాలను అతిక్రమించి గుండాలను కట్టడి చేసే అర్జున్ పాత్రలో కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. పోలీసు ఆఫీసర్లు కూడా తన వెనుకే ఉన్నట్లు కొన్ని షాట్స్ లలో చూపించారు. అయితే వైజయింతి చెప్పే మరో డైలాగ్ తల్లి కొడుకుల మధ్య ఉన్న కాన్ ఫ్లిక్ట్ ను చూపిస్తుంది. చచ్చింది శత్రువు అయినా చంపింది బంధువు అయినా వదిలిపెట్టను అంటుంది. చూడాలి మరి ఈ ఆసక్తికరమైన యాక్షన్ డ్రామా ఎలా ఉండబోతుందో.