Reading Time: < 1 min
Criminal 123 Movie Dressing up for a Summer Release
క్రిమినల్ 123 చిత్రం వేసవిలో విడుదలకు సిద్దం
ఈ వేసవిలో విడుదలకు సిద్దంగా ఉన్న క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ “క్రిమినల్ 123′
శ్రీ కనకదుర్గ పిక్చర్స్ బ్యానర్ పై బేబి. బి.డివిష శ్రీ , మాస్టర్ ఆశ్రీత్ ప్రజెన్స్ లో కె.హైమావతి నిర్మాతగా కె. గీత ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వంశీ కృష్ణ, రియాజ్ ఖాన్, దినేష్, కలాసి సెల్వన్, విజ్ఞేష్, గాయత్రి రిమ తదితరులు నటించిన చిత్రం క్రిమినల్ 123.
తమిళ్ లో విడుదలై విజయం సాధించిన రాకాదన్ చిత్రం ఇప్పుడు తెలుగులో క్రిమినల్ 123 పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది, పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న క్రిమినల్ 123 చిత్రం మే మొదటి వారంలో విడుదల థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
ఈ సినిమాను దినేష్ కలై డైరెక్ట్ చేశారు, ఏ ప్రవీణ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాకు మానస్ బాబు సినిమాటోగ్రఫీ అందించగా గోపికృష్ణ ఎడిటింగ్ చేశారు. కాకర్లమూడి రవీంద్ర కళ్యాణ్ ఈ చిత్రానికి మాటలు రాశారు.
త్వరలో ఈ చిత్ర సాంగ్స్, ట్రైలర్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. కె.జే.ఆర్ పిక్చర్స్ రామకృష్ణ, కిషోర్, జయబాబు ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయబోతున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.