A చిత్రం ట్రైలర్ విడుదల
‘A’ ట్రైలర్ విడుదల చేసిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి
నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన థ్రిల్లర్ చిత్రం ‘A’. ఈ సినిమా టీజర్‌ను కోలీవుడ్ విలక్షణ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని, హీరో హీరోయిన్లు నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రానిలకు మంచి పేరు రావాలని, డైరెక్టర్ యుగంధర్ ముని, నిర్మాత గీతా మిన్సాలకు మంచి బ్రేక్ కావాలని యూనిట్నుకు అభిందనలు తెలిపారు విజయ్ సేతుపతి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘A’ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా మార్చి 5న పీవీఆర్ సినిమా విడుదల చేస్తుంది.
నితిన్ ప్రసన్న ఇందులో మూడు పాత్రలు (ట్రిపుల్ రోల్)ను పోషించారు. ఓ యువ కథానాయకుడు ఇలాంటి రిస్కీ సబ్జెక్ట్‌ను టచ్ చేయడమే కాదు, మూడు పాత్రలను చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి. ప్రీతి అస్రాని హీరోయిన్గా నటిస్తుంది. ట్రైలర్ విషయానికి వస్తే ఒక వైపు సైన్స్, మరో వైపు పూర్వజన్మ జ్ఞాపకాలు అనే కాన్సెప్ట్‌తో సినిమా ఉందనిపించేలా ఆసక్తికరంగా ట్రైలర్ ఉంది. విజయ్ కూరకుల బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రవీణ్ కె.బంగారి సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ఎసెట్‌గా నిలువనున్నాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ‘A’ సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తిని పెంచుతుందీ ట్రైలర్.
ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ సినిమా క్రేజ్‌ను మరింత పెంచేలా ఉంది. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను ట్రైలర్ మరో మెట్టుకి తీసుకెళుతుందనడంలో సందేహం లేదు. డైరెక్టర్ యుగంధర్ ముని సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేసిన తీరు సుస్పష్టంగా అర్థమవుతుంది.
నటీనటులు:
నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని తదితరులు
సాంతికేతిక వర్గం:
సినిమాటోగ్రాఫర్:ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ)
ఎడిటింగ్: ఆనంద్ పవన్, మణి కందన్ (ఎఫ్టిఐఐ).
సంగీతం విజయ్ కురాకుల
నిర్మాత; గీతా మిన్సాల
దర్శకత్వం; యుగంధర్ ముని.