Reading Time: < 1 min

Actor Sandeep Kishan In ‘Raayan’ Movie – Tel

సందీప్ కిషన్ నటనా ప్రస్థానం

సందీప్ కిషన్ 2010 లో నటుడుగా ‘ప్రస్థానం’ సినిమా తో తన నటనా ప్రస్థానాన్ని కొనసాగించి 30 సినిమాలు పూర్తిచేసి 31 వ చిత్రంగా రాయన్ తో మరో విభిన్నమైన క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో రాయన్ అతనికి ఏడవ సినిమా. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మొదటి చిత్రం అయిన ‘ నగరం ‘ లో హీరో సందీప్ కిషన్ అవడం అతని ఎంచుకున్న కథలు,దర్శకులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సందీప్ కిషన్ క్రేజీ డైరెక్టర్స్ రాజ్ & డి కె ల మొదటి చిత్రంతో ‘ షోర్ ఇన్ ది సిటీ ‘  హిందీ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.భారతదేశంలో అన్ని భాషల ప్రేక్షకులకి సుపరిచయమైన నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు.దాంతో రాయన్ సినిమా పై కూడా అంచనాలు బానే వున్నాయి.