Reading Time: 2 mins

Agathiya Movie Press Meet 

 

అగత్యా మూవీ ప్రెస్ మీట్

‘అగత్యా’కి ఆడియన్స్ నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది: ప్రెస్ మీట్ లో హీరో జీవా

ట్యాలెంటెడ్ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్‌ సర్జా లీడ్ రోల్స్ లో నటించిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్ పై ఇషారి కే గణేష్‌, అనీష్ అర్జున్ దేవ్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్‌ దర్శకత్వం వహించారు. రాశీఖన్నా హీరోయిన్‌గా నటిచింది. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హైదరాబాద్ లో నిర్వహించిన ప్రెస్ ప్రిమియర్ లో సినిమాని వీక్షించిన హీరో జీవా అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

-అందరికీ నమస్కారం. రంగం సినిమా నుంచి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్ కి థాంక్ యూ. ‘అగత్యా’ కోసం గత మూడేళ్ళుగా చాలా హార్డ్ వర్క్ చేశాం. అర్జున్ గారు, రాశి తో కలిసి నటించడం మంచి ఎక్స్ పీరియన్స్.

-డైరెక్టర్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ తో గొప్ప సినిమా ఇచ్చారు, సినిమాకి  చాలా గొప్ప రెస్పాన్స్ వస్తోంది. అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది.

-హెవీ సిజీ వర్క్, వీఎఫ్ఎక్స్ వున్న సినిమా ఇది. ఇంటర్నేషన్ టెక్నికల్ టీంతో ఈ సినిమా చేశాం. అవతార్ స్థాయిలో షూట్ చేశాం. చాలా కొత్త టెక్నాలజీని వాడాం. ఆడియన్స్ కి బిగ్ స్క్రీన్ పై గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.

-మన ల్యాండ్, కల్చర్, హెరిటేజ్, మెడిషన్ ని సెలబ్రేట్ చేసుకునే సినిమా ఇది. హారర్ తో పాటు మంచి ఎమోషనల్ హై కూడా ఆడియన్స్ ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారు. నాకు ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటినుంచో వుండేది. ఈ సినిమాతో ఆ కోరిక తీరింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులుని అలరించే కంటెంట్ వున్న సినిమా.

-ఈ సినిమా ఫస్ట్ క్రిడిట్ డైరెక్టర్ విజయ్ గారికి దక్కుతుంది. ప్రతి క్రాఫ్ట్ లో చాలా కేర్ తీసుకున్నారు. అద్భుతమైన సెట్ వర్క్ వుంది. ఆర్ట్ డైరెక్టర్ షన్ముఖం అద్భుతమైన సెట్స్ ని తీర్చిదిద్దారు. కెమరా వర్క్, సౌండ్ డిజైన్ కూడా సినిమాకి స్పెషల్ హైలెట్ గా నిలిచింది.

-ఈ సినిమా కోసం డైరెక్టర్ గారు చాలా రీసెర్చ్ చేశారు.  భారతీయ ఔషదాలు, వైద్యానికి సంధించిన చాలా విలువైన అంశాలు ఇందులో వున్నాయి. అవి ఆడియన్స్ కి చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. అందరికీ రిలేట్ అయ్యే సినిమా ఇది.

-అర్జున్ గారికి నేను బిగ్ ఫ్యాన్ ని. ఆయనతో కలసి వర్క్ చేయడం బ్లెసింగ్ గా భావిస్తున్నాను. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. దాదాపు ఇందులో సిజీలో షూట్ చేశాం. సినిమా చూసిన తర్వాత ఆయన చాలా సర్ ప్రైజ్ అయ్యారు.

-రాశితో వర్క్ చేయడం మంచి ఎక్స్ పీరియన్స్. తను సెట్స్ లో తెలుగులోనే మాట్లాడుతుంది. చాలా ఫ్రెండ్లీగా వుంటుంది.

-యువన్ శంకర్ రాజా నా ఫేవరేట్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయనతో కలసి ఐదారు సినిమా చేశాను. ప్రతి సినిమా మ్యూజిక్ ఐకానిక్ గా నిలిచింది. తన మ్యూజిక్ ఈ సినిమా గ్రాండియర్ ని మరింతగా పెంచింది.

-నేను స్టొరీ బేస్డ్ సినిమాలు చేయడానికి ఇష్టపడతాను. ఇలాంటి మల్టీ స్టారర్స్ చేయడం చాలా ఇష్టం. బిగ్ కాన్వాస్ వున్న సినిమా ఇది. ఆడియన్స్ తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను.

-మంచి కథల కోసం చూస్తున్నాను. మంచి స్క్రిప్ట్ కుదిరితే తెలుగులో సినిమా చేయాలని వుంది. నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. తెలుగు ఆడియన్స్ ప్రేమకి రుణపడి వుంటాను.