Reading Time: < 1 min

Agent Movie Streaming On OTT
ఓటీటీలో అఖిల్ ఏజెంట్

అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఏజెంట్ మూవీ ఇన్నాళ్లకు ఓటీటీకి వచ్చేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అకిల్ కేరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 2023లో విడుదలైంది. సినిమా విడుదలైన ఫస్ట్ షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుంది. రా ఏజెంట్ గా అఖిల్ చేసే సాహసాలు థియేటర్ ప్రేక్షకులకు రుచించలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూద్దామని చాలా మంది ప్రేక్షకులు సరిపెట్టుకున్నారు. అయితే ఓటీటీ రేట్స్ తదితర కారణాల వలన ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవడం ఆలస్యం అయింది. మాములుగా ఏ సినిమా అయినా ఆరు వారాల తరువాత ఓటీటీకి వచ్చేస్తుంది. అందుకే కొన్ని మూవీస్ థియేటర్లో ఆడుతున్నప్పడు కూడా ఓటీటీలో దర్శనం ఇస్తున్నారు.

ఇన్ని నెలల తరువాత ఏజెంట్ చిత్రం ఓటీటీకి వచ్చింది. అఖిల్ సరసన సాక్షీ వైద్య నటించగా మలియాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటించారు. ఇండియన్ రా ఏజెంట్ భారీ యాక్షన్ సన్నివేశాలలో అఖిల్ కష్టపడ్డారు. సినిమా షూటింగ్ పనులు కూడా చాలా కాలం సాగాయి. మొత్తాన్ని ఈ చిత్రం సోనిలివ్ వేదికగా మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.