Reading Time: < 1 min

Alert for Prabhas fans  Fauji Update Will Come Soon-Tel

ప్రభాస్ ఫ్యాన్స్‌కు అలెర్ట్  ఫౌజీ అప్డేట్ త్వరలో 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టైమ్ మాములుగా లేదు. వరుసగా సినిమాలో ఆయన బిజీబిజీగా ఉన్నారు. సినిమాలు కూడా అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండడం విశేషం. ఈ విషయంలో ఆయన అభిమానులు కూడా పూర్తి సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన అభిమానుల కోసం మరో గుడ్ న్యూస్ అందించడానికి సిధ్దం అవుతున్నారు. సెన్సబుల్ డైరెక్టర్ హను  రాఘవపూడి, ప్రభాస్ కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ చిత్రంలో ప్రభాస్ జోడిగా మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రం రజాకార్ బ్యాక్‌డ్రాఫ్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ సైతం ఫైనల్ చేసినట్లు సమాచారం. అతి త్వరలోనే షూటింగ్‌కు సైతం వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఈ చిత్రం నుంచి హీరో ప్రభాస్, మృణాల్ ఠాకూర్‌ల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆగస్టు 17 న విడుదల చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెలువడనుంది.

సీతారామ్ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టిన హనురాఘవపూడి కాస్త గ్యాప్ తీసుకొని ఫౌజీ అనే స్క్రిప్ట్‌ను రెడీ చేశారు. ప్రభాస్ చిత్ర కథ విపరీతంగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్‌తో పాటు అందాల తార త్రిష సైతం నటించనుంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ పార్ట్ 2 కోసం పనిచేస్తున్నారు. దానికి తరువాత కల్కి పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఇక ఇదే వరుసలో హ్యూమర్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం ఆ చిత్రం విడుదలకు దగ్గర పడుతుంది. రిలీజ్ డేట్ సైతం త్వరలో ప్రకటించనున్నారు. ఈ మధ్యలో ఫౌజీ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చారు. అతి త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్ళనుంది.