Reading Time: 2 mins

All eyes are on these three films
ఈ మూడు సినిమాలపైనే అందరి చూపు

టాలీవుడ్‌లో ఈ ఏడాది పెద్దగా చిత్రాలు రాలేదు. అంతే కాదు వచ్చిన చిత్రాలలో విజయాలు తక్కువ, ఫైయిలూర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది ముగియడానికి ఇంకో మూడు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఈ సమయంలో పెద్ద హీరోల సినిమాలపై అందరి దృష్టి ఉంది. మరి ఆ చిత్రాలు ఏంటో చూద్దాం. జనవరిలో సంక్రాంతి పండుగకు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్, వెంకటేష్ హీరోగా సైంధవ్, నాగార్జున నటించిన నా సామిరంగ. ఈ నాలుగు చిత్రాలలో గుంటూరు కారం యావరేజ్ టాక్ తెచ్చుకోగా, సైంధవ్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అలాగే నా సామిరంగ సైతం మిక్సుడ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ బ్లాక బస్టర్ హిట్ టాక్ తెచ్చుకొని సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ్ హీరోగా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈగల్ చిత్రం సైతం బాక్స్ ఆఫీస్‌ వద్ద బోల్తా పడింది. వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఊరుపేరు భైరవ కోణ, వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలైంటీన్, గోపిచంద్ హీరోగా నటించిన భీమా చిత్రాలు తూడుచుకుపెట్టుకు పోయాయి. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన గామి కమర్షల్‌గా పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ, కొంత మేర పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన కామెడీ చిత్రం ఓం భీమ్ బుష్ సైతం జనాలను ఆకర్షించలేక పోయింది. ఇక టిల్లు స్క్వేర్ చిత్రం మాత్రం అలరించింది. ఇదే వరుసలో విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం దర్శకత్వంలో వచ్చిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రం సైతం డిజాస్టర్ అయింది. ఈ మధ్యలో కూడా చాలా చిన్న సినిమాలు వచ్చాయి కానీ ఏవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

కోన వెంకట్ తెరకెక్కించిన గీతాంజలి2 కూడా జనాలను ఆకర్షించలేదు. సూపర్ హిట్ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు చిత్రం కూడా ఆడలేదు. యూత్‌ కనెక్ట్ అయ్యేలా లవ్‌మీ, భజే వాయు వేగం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి చిత్రాలు అలరించలేకపోయాయి. ఇదే వరుసలో వచ్చిన ఆనంద్ దేవరకొండ గం గం గణేషా చిత్రం కాస్త పరువాలేదనిపించింది. ప్రభాస్ నటించిన కల్కి చిత్రం ఒక్కటి పెద్ద విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు కానీ పెద్దగా ఆడలేదు. తాజాగా నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం చిత్రం కూడా ఆకట్టుకోలేపోవడం గమనార్హం. ఈ తరణంలో ఈ ఏడాదిలో వచ్చే సినిమాలపై అందరి దృష్టి ఉంది.

పరిశ్రమకు ప్రతీ వేసవి కాలం బాగా కలిసివస్తుంది.. ఎందుకంటే స్టూడెంట్స్ కాళీగా ఉంటారు. ఫ్యామిలీలు సైతం ఎక్కువ ఎంటర్‌టైన్మెంట్ కోరుకుంటారు. కానీ ఈ సమ్మర్‌లో ఎన్నికల హడావిడీ, ఆ తరువాత ఐపీఎస్ ఉండడంతో ఇండస్ట్రీ పెద్దగా క్యాష్ చేసుకోలేకపోయింది. ఇప్పటి వరకు 2024 సంవత్సరంలో పెద్దగా చెప్పుకోదగ్గ విజయాలు లేవు, ఒక కల్కి తప్ప. ఈ ఏడాది చేదు జ్ఞాప‌కంలా మిగులుతుందా లేదా మంచి విజయాలతో ముగుస్తుందా అనేది చెప్పడానికి ఇంకో మూడు చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.  ఈ నెలాఖ‌రున దేవ‌ర‌ చిత్రం విడుదల కాబోతుంది. ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్‌, జాన్వీ క‌పూర్ నటించడంతో హిందీలో సైతం బజ్ పెరిగింది. ఇక ఓవ‌ర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ చూస్తుంటే దేవర చిత్రం సంచలనం చేస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

అలాగే రామ్ చ‌ర‌ణ్ నటిస్తున్న గేమ్ ఛేంజ‌ర్ ఈ డిసెంబ‌రులో విడుదల కాబోతోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు బ్యాన‌ర్‌లో భారీ బడ్జెట్ ‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. అప్డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం మీదున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆకలిమీదున్నారు. దాంతో గేమ్ ఛేంజర్ ఫుల్ మీల్స్ అవుతుందా లేదా అనేది చూడాలి. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ష 2. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ టాక్ తెచ్చుకుందో మనం చూశాము, అలాగే పార్ట్2 కూడా అదే స్థాయిలో రికార్డు సృష్టిస్తుందని అల్లు అర్జున్ అభిమానులు నమ్ముతున్నారు. చూడాలి మరి ఈ సంవంత్సరం చివర్లో విడుదలయ్యే దేవ‌ర‌, పుష్ష 2, గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలు ఏ మేరకు హిట్ అవుతాయో.