Allari Naresh Movie Bacchala Malli Song Release -TEL
అల్లరి నరేష్ న్యూ మూవీ బచ్చల మల్లి నుంచి ఫోక్ మెలోడీ సాంగ్ రిలీజ్
యూనిక్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’ మేకర్స్ ముందుగా అనౌన్స్ చేసినట్లుగా సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫస్ట్ లుక్, అల్లరి నరేష్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచాయి. మేకర్స్ ఇప్పుడు మ్యూజిక్ జర్నీ కిక్ స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ మా ఊరి జాతరలో రిలీజ్ అయ్యింది.
సీతారామం ఫేమ్ కంపోజర్ విశాల్ చంద్రశేఖర్ ఫోక్, ఫంక్ బ్లెండ్ చేస్తూ పాటను స్కోర్ చేసారు. ఈ మెలోడీని సింధూరి విశాల్‌తో కలిసి హను-మాన్ కంపోజర్ గౌరా హరి మెస్మరైజింగ్ పాడారు.
అల్లరి నరేష్, అమృత అయ్యర్‌ల అద్భుతమైన బాండింగ్‌ని లిరిసిస్ట్ శ్రీమణి చాలా ఆకర్షణీయంగా అందించారు. లీడ్ పెయిర్ ఒకరినొకరు ఎంతగా ప్రేమిస్తున్నారో ఈ పదాలు వివరిస్తాయి. నరేష్ తన భార్యకు ఏదో ఒక స్పెషల్ ప్రెజెంట్ చేయలాని కోరుకుంటుండగా, ఆమె తన జీవితాంతం అతనితో గడపాలని కోరుకుంటుంది.
విజువల్స్ కంపోజిషన్ బ్యూటీఫుల్ గా ఉన్నాయి. అల్లరి నరేష్, అమృత అయ్యర్ అద్భుతమైన కెమిస్ట్రీని షేర్ చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మీ ప్లేలిస్టు లో న్యూ ఫేవరేట్.
ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్‌లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు.
రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మానాడు, రంగం, మట్టి కుస్తి వంటి చిత్రాలకు పనిచేసిన రిచర్డ్ ఎం నాథన్ డీవోపీగా చేస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్.
కథ, డైలాగ్స్ సుబ్బు స్వయంగా అందించగా, విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, ఎడిషనల్ స్క్రీన్‌ప్లే విశ్వనేత్ర అందించారు.
బచ్చల మల్లి ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుంది.
నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.
సాంకేతిక సిబ్బంది:
కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
ఎడిషనల్ స్క్రీన్ ప్లే: విశ్వనేత్ర
సంగీతం- విశాల్ చంద్రశేఖర్
డీవోపీ- రిచర్డ్ M నాథన్
ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్
ప్రొడక్షన్ డిజైన్- బ్రహ్మ కడలి