Anaganaga Teaser Review
అనగనగా టీజర్ రివ్యూ
నోటితో విసిరేసి చేతితో వేరుకునేవి ఏంటి? ఈ పోడుపుకథ చాలా ఆసక్తిగా ఉంది కదా.. ఇంతే ఆసక్తికరంగా ఉంది అనగనగా టీజర్. ఉగాది కానుకగా ఈ టీవి విన్ లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ టీజర్ లో ఆసక్తికలిగించే ఒక పాయింట్ ఏంటంటే సుమంత్ తెలుగు టీచర్ పాత్రలో నటిస్తున్నారు. విద్యార్థులకు చదువు బట్టిపట్టించడం కాదు, వారికి సులువుగా నేర్పించాలి అనే పాయింట్ చాలా బాగుంది. ఎంతో కాలంగా ఈ పాయింట్ చాలా మంది చర్చిస్తున్నారు. ఈ చిత్రంలో ఇదే పాయింట్ చుట్టు కథ రాసుకున్నారు డైరెక్టర్ సన్నీ సంజయ్.
కథ అంటే ఏంటి ఎందుకు అనే డైలాగ్ తో టీజర్ ఓపెన్ చేశారు. ఆ తరువాత సుమంత్ టీచర్ గా కనిపించారు. ప్రెజర్ లేని చదువు చెప్పడానికి ఆయన ప్రయత్నాన్ని చూపించారు. ఆ ప్రయత్నంలో ఆయనకు ఎదురైన సవాల్లు ఏంటన్నది ఈ టీజర్ లో చూపించారు. చదువు అంటే కేవలం మార్కులు మాత్రమే కాదు, జ్ఞానం అని చెప్పే ప్రయత్నం ఈ టీజర్ లో కనిపిస్తుంది. ఈ మధ్య సుమంత్ అన్ని ఇలాంటి వినుత్నమైన కథలతోనే వస్తున్నారు. చూడాలి మరి ఈ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో.