Reading Time: 2 mins

Anushka Shetty Birthday Special
అనుష్క శెట్టి బర్త్ డే స్పెషల్

స్వీటీ ఈ పేరు చాలా మందికి పరిచయమే. ఆమే టాలీవుడ్ అందాల భామ అనుష్క శెట్టి. తన యాక్టింగ్ అండ్ బ్యూటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ్లామరస్ రోల్ చేసినా, అచ్చ తెలుగమ్మాయిలా చీరలో మెరిసినా, రాణీ అవతారంలో కన్పించినా, వీర వనితలా పోరాటాలు చేసినా తనకంటూ ప్రత్యేకమైన శైలీని ఏర్పాటు చేసుకుంది. అనుష్క అందిరా కాదు తన సరసన యాక్ట్ చేసే కథనాయుకుడు కనీసం ఆరడుగులు ఉండాలి, దానికి తగ్గట్లు పర్సనాలిటీ ఉండాలి ఎందుకంటే అనుష్క ఎత్తు 5 అడుగులు 9 అంగులాలు మరి. దేవసేన పాత్రలో వెండితెరపై అనుష్క శెట్టి అభినయం అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. వెంటనే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో మోడర్న్ అమ్మాయి పాత్రలో ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే నటి అనుష్క. నవంబర్ 7 ఈ స్వీటీ పుట్టిన రోజు సంబర్భంగా ఆమె సినీ ప్రయాణంపై ఓ లుక్కెద్దాం.

స్వీటి 1981 నవంబర్ 7 న కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. బెంగుళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌ పూర్తి చేసుకొని భరత్ ఠాకూర్ వద్ద యోగ శిక్షణ పొందింది. మొదటి సారి 2005లో సూపర్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఇక తనకు మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం విక్రమార్కుడు. రవితేజ, ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంతో అనుష్క తెలుగువారందరికి దగ్గరయ్యారు. లక్ష్యం, సౌర్యం, చింతకాయల రవి వంటి చిత్రాలు చేసిన అనుష్క అరుంధతి అనే ప్రయోగాత్మకమైన చిత్రంతో స్టార్ డమ్ సంపాదించుకుంది. అలా విభిన్నమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులు మనసు దోచుకుంది. అలా వేదం సినిమాలో వేశ్య పాత్ర పోషించి ఫిల్మ్ ఫెయిర్ అవార్డును సొంతం చేసుకుంది.

ఏ పాత్ర అయినా చేసే ఈజ్ ఉంది కాబట్టే దర్శకులందరి చూపు అనుష్కపై పడింది. రుద్రమదేవి చిత్రంతో టైటిల్ రోల్ లో నటించి పోరాట సన్నివేశాలను అద్భుతంగా చేసింది. ఆ తరువాత దేవసేనగా బహుబలి చిత్రంలో మెప్పించింది. అనుష్క ఏం చేసినా ఓ ప్రత్యేకత ఉంటుందని అభిమానులు భావిస్తుంటారు. మిస్ శెట్టి మిస్టర పొలిశెట్టి చిత్రం తరువాత అనుష్క కొంత గ్యాప్ తీసుకున్నారు. ఒకప్పుడు వాణిజ్య ప్రకటనలో నటించినట్లు ఇప్పుడు నటించడం లేదు. మళ్లీ త్వరలోనే ఓ మంచి చిత్రంతో ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ బిజినెస్ ఆఫ్ టాలీవుడ్ తరఫున అనుష్క శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు.