Arjun S/O Vyjayanthi Movie Song Launch Event
అర్జున్ S/O వైజయంతి చిత్రం సాంగ్ లాంచ్ ఈవెంట్
అర్జున్ S/O వైజయంతి నిజాయితీగా చేసిన సినిమా. తప్పకుండా అందరికీ కనెక్ట్ అవుతుంది: సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరో నందమూరి కళ్యాణ్ రామ్
-అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను: లేడి సూపర్ స్టార్ విజయశాంతి
-కళ్యాణ్ రామ్, విజయశాంతి, ప్రదీప్ చిలుకూరి, అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్’ అర్జున్ S/O వైజయంతి సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే సాంగ్ గ్రాండ్ గా లాంచ్
నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, విజయశాంతి హీరో తల్లిగా కీలక పాత్ర పోషిస్తుంది. తల్లీ కొడుకుల అనుబంధం సినిమా ప్రధానాంశం. ఈరోజు, చిత్తూరులో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా సెకండ్ సింగిల్- ముచ్చటగా బంధాలే సాంగ్ ని లాంచ్ చేశారు.
స్టార్ కంపోజర్ బి అజనీష్ లోక్‌నాథ్ స్వరపరిచిన ముచ్చటగా బంధాలే, కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకుల భావోద్వేగ అనుబంధంను సున్నితంగా చిత్రీకరించిన మేలోడిక్ మాస్టర్ పీస్.
రఘు రామ్ సాహిత్యంతో కూడిన ఈ పాట తల్లి స్వభావాన్ని హైలైట్ చేస్తుంది, ఆమె తన కొడుకు విజయం సాధించాలనే కలలను సాకారం చేసుకుంటూ, అతనికి నిరంతరం ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అదే సమయంలో, కొడుకు తన తల్లిని సంతోషంగా, గర్వంగా ఉంచేందుకు ఎంతో ప్రయత్నిస్తాడు. తల్లి-కొడుకుల బంధంతో పాటు, ఈ పాట కళ్యాణ్ రామ్ ప్రేమ వైపు ఒక గ్లింప్స్ అందిస్తుంది, సాయి మంజ్రేకర్‌తో అతని సున్నితమైన రిలేషన్ ని పాటకు అదనపు ఎమోషన్ ని జోడిస్తుంది.
హరిచరణ్ సోల్ ఫుల్ వాయిస్ ఈ పాట ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేసింది,మొత్తంమీద, ముచ్చటగా బంధాలే తల్లి-కొడుకుల బంధానికి హృదయపూర్వక నివాళి.ఈ చిత్రానికి సోహైల్ ఖాన్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ ప్రముఖ పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రామ్ ప్రసాద్, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సా. ఇప్పటికే హ్యుజ్ సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 18న విడుదల కానుంది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో లేడీస్ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ.. సినిమాలో పని చేసిన అందరికీ అభినందనలు. కళ్యాణ్ రామ్ బాబు తల్లి గురించి ఎంత అద్భుతంగా చెప్పాడు. తను విలువలు ఉన్న మనిషి, క్రమశిక్షణ గల మనిషి. ఎన్టీ రామారావు గారి మనవడు. ఆ క్రమశిక్షణ ఎక్కడికి పోతుంది. ఈ సినిమాని చాలా అద్భుతంగా చేశాడు. 18వ తారీఖున మీరంతా చూస్తారు. మీరంతా మెచ్చుకుంటారు. అంత అద్భుతంగా చేసాడు. ఈ కాలేజీలో ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరికీ థాంక్యూ. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. నిజాయితీ పని చేసాం. ఈ సినిమాని చాలా పెద్ద హిట్ చేయవలసిందిగా మీ అందరిని కోరుకుంటున్నాను. థాంక్యూ’అన్నారు
హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. చిత్తూరు ప్రజలకు ఇక్కడే విద్యార్థులకు, మా నందమూరి అభిమానులందరికీ లవ్ యు ఆల్. మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అమ్మ నేర్పిందే. అలాంటి అమ్మలని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆ బాధ్యత కోసం మనం ఎంత త్యాగం చేసిన సరిపోదు. అదే అర్జున్ సన్నాఫ్ వైజయంతి. చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది. కాలేజ్ లైఫ్ బెస్ట్ లైఫ్. ఇక్కడ ఎంజాయ్ చేయండి. భాద్యతగా ఉండండి. నేర్చుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం నేర్చుకున్నదే రేపు మనకి లైఫ్ ఇస్తుంది. ఇక్కడికి విచ్చేసినఅందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. 12వ తేదీన మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది. ఆ ఈవెంట్ కి తమ్ముడు వస్తాడు. ఆరోజు మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. ఈ ఈవెంట్ అద్భుతంగా జరగడానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అందరికీ పేరుపేరు ధన్యవాదాలు’అన్నారు
హీరోయిన్ సాయి మంజ్రేకర్ మాట్లాడుతూ.. సెకండ్ సాంగ్ ని చిత్తూరులో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా హీరో కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారికి దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. కళ్యాణ్ రామ్ గారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన బిగ్ ఇన్స్పిరేషన్ .ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను.
యాక్టర్ పృథ్వి మాట్లాడుతూ..ఈ సినిమా గురించి చాలా విషయాలు చెప్పాలి. వండర్ఫుల్ ఫిల్మ్ ఇది. ఇప్పుడు లాంచ్ అయిన సాంగ్ మదర్ అండ్ సన్ బ్యూటిఫుల్ బాండింగ్ గురించి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసి ఆడియన్స్ తప్పకుండా వెళ్లి అమ్మకి థాంక్స్ చెప్తారు. సినిమాలో అంత మంచి ఎమోషన్ ఉంది. ఏప్రిల్ 18న తప్పకుండా అందరూ థియేటర్స్ లో చూడండి’అన్నారు.
డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ.. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది. మీలో అందరికీ మీ మదర్ బర్తడే గుర్తుందా? మనం పుట్టగానే అమ్మ ప్రతి బర్త్ డే కి కేక్ కట్ చేస్తుంది. అది సెలబ్రేషన్ . మనం పెద్దయ్యాక అమ్మ బర్త్ డేని గుర్తు పెట్టుకుని కేక్ కట్ చేయాలి. అది ఎమోషన్. అదే ఈ సినిమాలో చూపించాలనుకున్నాం. దీనికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్స్ కి మా హీరో కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నందమూరి అభిమానులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి అభిమానం ఆదరణ మర్చిపోలేను.అన్నారు.
నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా మాట్లాడుతూ.. ఈ సాంగ్ చిత్తూరులో లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మీ అందరి ఎనర్జీ చూస్తుంటే మాకు చాలా ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు పోటాపోటీగా నటించారు. కళ్యాణ్ గారితో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. విజయశాంతి గారు ఈ సినిమాని ఒప్పుకోవడమే మా ఫస్ట్ సక్సెస్ గా భావిస్తున్నాం. మా డైరెక్టర్ ప్రదీప్ గారికి, ఈ సినిమాల్లో పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్యూ. మా సినిమా ఏప్రిల్ 18న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది అందరూ సినిమాని థియేటర్స్ లో చూసి పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను’అన్నారు .
లిరిక్ రైటర్ రఘురాం మాట్లాడుతూ.. ఈ సినిమాకి సింగిల్ కార్డు రాసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి, డైరెక్టర్ ప్రదీప్ గారికి నిర్మాతలకు ధన్యవాదాలు. ముచ్చటగా బంధాలే చాలా బ్యూటిఫుల్ సాంగ్. ఈ సినిమా కోసం అందరూ ఒక ఎమోషన్ తో పనిచేశారు తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది. కళ్యాణ్ రామ్ గారి కెరీర్ లో ఈ సినిమా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది’అన్నారు
రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ… ఈ వేడుక మా కాలేజీలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ రామ్ గారికి విజయశాంతి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ సినిమా గొప్ప విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు మా చిత్తూరు జిల్లాలో ఈవెంట్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా వారికి ధన్యవాదాలు. లేడీ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో ఎవరినైనా చూడాలంటే అది వన్ అండ్ ఓన్లీ విజయశాంతి గారిని చూడాలి. నందమూరి అందగాడు మా కళ్యాణ్ రామ్ అన్న. చిత్ర దర్శకులకు నిర్మాతలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ఎడిటర్ తమ్మి రాజు మాట్లాడుతూ.. కళ్యాణ్ రామ్ గారి దగ్గరనుంచి విజయశాంతి గారి దగ్గరనుంచి ఆడియన్స్ ఏం కోరుకుంటారో అంతకుమించి ఈ సినిమా ఉంటుంది. ఏప్రిల్ 18న మీరంతా థియేటర్స్ లో చూస్తారు. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది’అన్నారు.
రైటర్ శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ.. ఈవెంట్ చిత్తూరులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్ రామ్ గారికి థాంక్యూ. తెర ముందు తప్పితే తెర వెనక నటించడం రాని గొప్ప వ్యక్తిత్వం ఆయనది. క్లాసిక్ అనే పదానికి పర్ఫెక్ట్ మీనింగ్ విజయ్ విజయశాంతి గారు. ఆమె కర్తవ్యం సినిమాలో ఎంత ఫెరోషియస్ గా ఉన్నారో ఈ సినిమాలో కూడా అంతే ఫెరాషియస్ గా ఉన్నారు. మా డైరెక్టర్ ప్రదీప్ గారికి థాంక్యూ. ఆయనలో చాలా ప్రతిభ ఉంది. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది’అన్నారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
పీఆర్వో: వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో