Reading Time: 3 mins

ARM Movie Prerelease Event Highlights
ఏఆర్ఎమ్ మూవీ ప్రీరిలీజ్ఈవెంట్ హైలెట్స్

మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ పై టోవినో థామస్ హీరోగా, కృతి శెట్టి, ఐశర్య రాజేష్, రోహిణి, హరీష్ ఉత్తమన్ నటించిన తాజా చిత్రం ఏఆర్ఎమ్. జితిన్ లాల్ దర్శకత్వం వూహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రీబ్యూటర్ చేస్తున్నారు. ఈ చిత్రం హీరో టోవినో థామస్‌కు 50 చిత్రం కావడం విశేషం. ఏఆర్ఎమ్ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. మిన్నల్ మురళి, 2018 చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన టోవినో థామస్ నేరుగా తెలుగు మూవీలో నటించాలని అభిమానలు కోరారు. ఏఆర్ఎమ్ చిత్రంలో తాను త్రిపాత్రిభినయం చేసినట్లు, దాని కోసం ఎంతో కష్టపడ్డడ్లు చెప్పారు. ఈ సందర్భంగా మూవీలోని ప్రధాన తారాగణం ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

నటీ రోహిణి మాట్లాడుతూ.. మలయాళం సినిమాలు చాలా బాగుంటున్నాయని, తెలుగు వారు సైతం వారి చిత్రాల గురించి ఎదిరిచూసేలా తీస్తున్నారని చెప్పారు. అలాగే టోవినో థామస్ లాంటి నటులు చాలా అద్భుతంగా నటిస్తూ తెలుగు వారికి దగ్గరవుతున్నారని చెప్పారు. అలాగే డైరెక్టర్ జితిన్ లాల్ దాదాపు 8 సంత్సరాలుగా ఈ సినిమాపై పనిచేస్తున్నారని చెప్పారు. ఏఆర్ఎమ్ అంటే అజయ్ గాడి రెండో దొంగతనం అని ఇదే సినిమా టైటిల్ అని చెప్పారు. ఇక సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందన్నారు. హీరో వేసిన మూడు పాత్రల్లో అజయ్ క్యారెక్టర్ కు తల్లిగా నటించినట్లు, తాను ఒకే హీరోకు మనవరాలిగా, కూతురుగా, తల్లిగా యాక్ట్ చేసినట్లు చెప్పారు. సినిమాకు పని చేసిన అందరూ మనులుపెట్టడం వలనే ఇంత పెద్దకథను చాలా సులువుగా చేశారని కొనియాడారు.

ఇలాంటి ఒక గొప్ప చిత్రాన్ని తెలుగులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే హీరోయిన్స్ కృతి శెట్టి,ఐశ్వర్య రాజేష్ నటన చాలా బాగుందని, దీన్ని కేవలం సినిమా అనడం కన్నా ఒక ఆర్ట్ అంటే సరిపోతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా 3డిలో వస్తుందని, ఈ చిత్రం 3డి కోసమే పుట్టిందా అన్నట్లు ఉందని చెప్పారు. మలయాళంలో ఎప్పుడూ బలమైన కథలు ఉంటాయి. అందుకే తాను మలయాళం సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నట్లు చెప్పారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రం తెలుగువారందరికి కచ్చితంగా నచ్చుతుంది అని యాక్టర్ రోహిణి చెప్పారు.

హరీష్ ఉత్తమన్ మాట్లాడుతూ.. ట్రైలర్ లో చూసినట్లు కేవలం యాక్షన్ మాత్రమే కాదు, సినిమాలో మంచి లవ్ స్టొరీ ఉందని చెప్పారు. కృతి చేసిన లక్ష్మీ పాత్ర తనకు మంచి పేరు తీసుకొస్తుందని పేర్కొన్నారు. విలేజ్ అమ్మాయిలా కృతి శెట్టి అద్భుతమైన నటన కనబరిచిందని తెలిపారు. ఇక టోవినో థామస్ తనకు సోదరుడు లాంటివాటు అని చెప్పారు. ఆయన ప్రస్తుతం ఎన్నో మంచి చిత్రాలతో అలరిస్తున్నారు అని తెలిపారు. ఇక ఏఆర్ఎమ్ సినిమాలో చాలా రోజుల తరువాత ఓ మంచి పాత్ర చేసినట్లు చెప్పారు. సెప్టెంబర్12 న థియేటర్ లో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని ఆదరిస్తారని కోరారు. ఇక టోవినో థామస్ 2018, మిన్నల్ మురళి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారని. త్వరలో డైరెక్ట్ తెలుగులో నటించాలని కోరారు. ఈ చిత్రాన్ని కచ్చితంగా 3డి లోనే చూడాలని అని కోరారు.

మైత్రీమూవీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ మాట్లాడుతూ.. సినిమా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ జితిన్ లాల్, హీరో టొవినో థామస్ కు ధన్యవాదాలు చెప్పారు. 2018, మిన్నల్ మురళి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గర చేశాయో, ఎఆరేమ్ చిత్రం అంతకు పదిరేట్లు మంచి పేరు తీసుకొస్తుందని చెప్పారు. ఈ చిత్రంలో నటించిన యాక్టర్స్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధ్య వచ్చిన మంజుమ్మల్ బాయ్స్, అడు జీవితం చిత్రాలను తమ సంస్థనే డిస్ట్రీబ్యూట్ చేసినట్లు ఇప్పుడు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ చెస్తున్నట్లు చెప్పారు. ట్రైలర్ చూసిన వెంటనే మైత్రిమూవీ ప్రొడ్యూసర్స్ నవీన్, రవి ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకురావాలని అన్నారు. దాంతో నిర్మాతలతో మాట్లాడి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చినట్లు.. అందరూ థియేటర్ లోనే చూడాలని కోరారు.

ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ.. చోతి క్యారెక్టర్ తో ఈ చిత్రంలో మీ ముందు కనిపించబోతున్నట్లు చెప్పారు. తాను చేసింది చాలా చిన్న క్యారెక్టర్ అయినా చాలా సంతోషంగా ఉందని ఐశర్య రాజేష్ చెప్పారు. టొవినో థామస్ చాలా డెడికేషన్ ఉన్న యాక్టర్ అని, తెలుగులో త్వరలోనే చేయాలని అన్నారు. అలాగు ఈ చిత్రానికి పని చేసిన కాస్ట్ అండ్ క్రూ కు థాంక్స్ చెప్పారు. సినిమాకు ప్రొడ్యూసర్ చాలా ముఖ్యం అని చెప్పారు. మంచి ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ బాగుండాలి అన్నారు. అందరూ సినిమాను ఆదరిస్తారని కోరారు.

హైదరాబాద్ కు రావడం ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది అని కృతి శెట్టి అన్నారు. మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పారు. ఈ స్టోరీ చాలా బాగుందని, ఫస్ట్ టైం విన్నపుప్పుడే ఇంప్రెస్ అయినట్లు చెప్పారు. డైరెక్టర్ 2017 నుంచి ఈ కథమీద పని చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మైత్రీమూవీ మేకర్స్ కి థాంక్స్ చెప్పారు. టొవినో థామస్ గురించి చెబుతూ.. ఈ జనరేషన్ నటులకు ఆయన ఇన్స్ పరేషన్ అని చెప్పారు. చాలా డేడికేషన్ ఉన్న నటుడు అని కొనియాడారు. ఐశ్వర్య, రోహిణి, హరీష్ అందరికి థాంక్స్ చెప్పారు. హీరోయిన్గా మలయాళంలో తన మొదటి సినిమా అని చెప్పారు.

టొవినో థామస్ మాట్లాడుతూ.. ముందుగా మైత్రీమూవీ మేకర్స్ కు ధన్యవాదాలు తెలిపారు. 2016 నుంచి ఈ సినిమాకు తాను కూడా పనిచేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ జితు లాల్ కథ చెప్పిన్పుడు త్రిపాత్రిభినయం అంటే చాలా కష్టమనిపించిందని, కానీ ఈ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముందు త్రీ క్యారెక్టర్స్ అంటే ఆలోచించాను, కానీ డైరెక్టర్ కన్విన్స్ చేసి ఒప్పించారని చెప్పారు. తల్లుమల చిత్రం నుంచి తెలుగు వాళ్ళు తనను ఆధారిస్తున్నట్లు చెప్పారు. రోహిణితో మూడు సినిమాల్లో పని చేసినట్లు, వారితో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే హరీష్ తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. నిజానికి ఆయన చాలా స్వీట్ పర్సన్ అని కానీ, ఆయనకు అన్నీ విలన్ పాత్రలే వచ్చాయిని, కానీ ఈ చిత్రంలో మంచి పాత్ర చేశారని చెప్పారు. అలాగే ఐశ్వర్య రాజేష్ కు తాను పెద్ద ఫ్యాన్ అని టొవినో థామస్ చెప్పారు. అంతేకాదు తాను నటించిన అన్ని చిత్రాలు చూసినట్లు చెప్పారు. అలాగే కృతి శెట్టి అద్భుతమైన యాక్టర్స్ అని చెప్పారు. తన క్యారెక్టర్ చాలా అమాయకంగా ఉండాలని లక్ద్మీ పాత్రకు తను చాలా సూట్ అయిందన్నారు. సెప్టెంబర్ 12 అందరూ చూడండి అని కోరారు. చివరిగా సినిమా కోసం పని చేసిన లైట్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికి థాంక్స్ చెప్పారు.

Movie Title : ARM
Banner: Magic Frames
Cast: Tovino Thomas, Krithi Shetty, Aishwarya Rajesh, Surabhi Lakshmi, Basil Joseph
Director: Jithin Laal
Music : Dhibu Ninan Thomas
Cinematography: Jomon T John Isc
Editor: Shameer Muhammed
Producer : Listin Stephen, Dr. Zachariah Thomas