Reading Time: < 1 min

Asura Samharam Movie First Look Poster Launched

 

అసుర సంహారం మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో రూపొందనున్న క్రైమ్ థ్రిల్లర్ ‘అసుర సంహారం’.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం

క్రైమ్, సస్పెన్స్, త్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలని చూసేందుకు ఆడియెన్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో 750 చిత్రాలకు పైగా నటించి మెప్పించి తనికెళ్ల భరణి ప్రస్తుతం ప్రధాన పాత్రలో ‘అసుర సంహారం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సాయి ప్రవర్తిక బోయళ్ళ సమర్పణలో శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్ బ్యానర్ మీద సాయి శ్రీమంత్, శబరిష్ బోయెళ్ళ నిర్మించనున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం ఇలా అన్నింటిని కిషోర్ శ్రీకృష్ణ హ్యాండిల్ చేయనున్నారు.

అసుర సంహారం సినిమాలో తనికెళ్ల భరణితో పాటుగా.. మిధున ప్రియ ప్రధాన పాత్రలో నటించనున్నారు. విలేజ్ క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్  పనులు శరవేగంగా  జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇతర తారాగణం గురించి, ఇతర వివరాల గురించి త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ మూవీలో తనికెళ్ల భరణి విలేజ్ డిటెక్టివ్‌గా ఓ విభిన్నమైన  పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.

నటీనటులు :

తనికెళ్ల భరణి, మిధున ప్రియ తదితరులు

సాంకేతిక బృందం :

బ్యానర్ : శ్రీ సాయి తేజో సెల్యూలాయిడ్స్
నిర్మాత : సాయి శ్రీమంత్ శబరిష్ బోయెళ్ళ
ఎక్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ : మిధున ప్రియ
కెమెరామెన్:బాలు ABCD
సంగీతం : కరీం అబ్దుల్
ఎడిటర్ : నరేంద్ర కుమార్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కిషోర్ శ్రీకృష్ణ