Reading Time: 2 mins

Baapu Movie Review
బాపు మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

పల్లెటూరు నేపథ్యంలో తాజాగా వచ్చిన సినిమా బాపు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్రలో నటించారు. దయ దర్శకత్వం వహించారు. ట్రయిలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకులను
ఏ మేరకు ఆకట్టుకుంటుందో ఈ రివ్యూలో చూద్దాము.

కథ:

తెలంగాణలోని ఒక ఊరిలో చంటి (రచ్చ రవి) జెసిబి డ్రైవర్ బావులను పూడికలు తీస్తూ ఉంటాడు. అలా తీస్తున్నప్పుడు ఒకరోజు బంగారు విగ్రహం బయటపడుతుంది. దాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంట్లో దాచిపెట్టి అమ్మ లక్ష్మమ్మ (గంగవ్వ)కు జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. చంటి వచ్చేసరికి లచ్చమ్మ దాన్ని బావిలో పడేస్తుంది. అదే ఊళ్లో ఎకరం పొలం ఉన్న రైతు మల్లన్న (బ్రహ్మాజీ). ఆయనకు భార్య సరోజ (ఆమని), ఆటో నడుపుకునే కొడుకు రాజు(మణి), డిగ్రీ చదివే కూతురు వరలక్ష్మి(ధన్య), ఇంటిదగ్గర ఖాళీగా ఉండి చుట్టలు కాల్చే నాన్న రాజయ్య (సుధాకర్ రెడ్డి) ఉంటారు. వ్యవసాయం కోసం ఊర్లో అందిన ప్రతిచోట అప్పు చేస్తాడు మల్లన్న. కానీ చేతిదాకా వచ్చిన పత్తి పంట వాన పాలవుతుంది. దాంతో కష్టాలు మళ్ళీ మొదటికి రావడంతో తాను ఆత్మహత్య చేసుకుంటే రైతు భీమా ఐదు లక్షలు కుటుంబానికి వస్తాయని ఆలోచిస్తాడు. కానీ ఒకరు చూసి ఆ చావును అడ్డుకుంటారు. ఆ తర్వాత కుటుంబమంతా కలిసి ఒక ప్లాన్ వేస్తారు. దాని వలన మల్లన్న తండ్రి రాజయ్య చిక్కుల్లో పడతాడు. ఆ ప్లాన్ ఏంటి? కష్టాల నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది..? ఆ బంగారు విగ్రహం ఏమైంది అనేది బాపు కథ.

కథనం:

బాపు సినిమాలో కూడా ఇదే చేశారు. బ్రహ్మాజీ, ఆమని, ధన్య, అవసరాల శ్రీనివాస్ లాంటి కొందరు నటులు మినహాయిస్తే.. మిగిలిన వాళ్ళంతా కొత్తవాళ్లే. పూర్తిగా ఊరు నేపథ్యంలోనే సాగే కథ ఇది. కథలోకి వెళ్లడానికి ఎక్కువగా టైమ్ తీసుకోలేదు దర్శకుడు దయా. తాను అనుకున్న పాయింట్ మొదటి 10 నిమిషాల్లోనే చెప్పాడు. ఆ తర్వాత అసలు కథలోకి వెళ్లాడు. బ్రహ్మాజీ రైతు ఎపిసోడ్ మొదలైన తర్వాత ఊహించినంత వేగంగా కథనం ముందుకు సాగలేదు. కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. రైతు కష్టాలను న్యాచురల్‌గా చూపించారు కానీ ఎమోషన్స్ పరంగా మాత్రం బాగా మిస్ ఫైర్ అయింది బాపు. కథలో తాను చెప్పాలనుకున్న పాయింట్ వదిలేసి.. ఇంకొక క్రైమ్ పాయింట్ మీద కథ చాలా సేపు నడిపాడు దర్శకుడు. ముగింపు కూడా ముందుగానే ఊహించొచ్చు.

నటీనటులు:
బ్రహ్మాజీ నటన బాగుంది. ఆమని కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా నటించింది. మరో కీలకమైన పాత్రలో మేం ఫేమస్ ఫేమ్ మణి అలరించాడు. ఇక ధన్య బాలకృష్ణన్ తన వరకు బాగా నటించింది. అవసరాల శ్రీనివాస్ అతిథి పాత్రలో అవసరం మేరకు అక్కడక్కడా కనిపించాడు. బాపు టైటిల్ రోల్ చేసిన సుధాకర్ రెడ్డి అలరించాడు.

సాంకేతిక అంశాలు:
బాపు సినిమాకు మెయిన్ హైలైట్ ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం. ఆయన అందించిన పాటలే కాదు.. ఆర్ఆర్ కూడా అదిరిపోయింది. వాసు పెండం సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. ఊరి అందాలు బాగా చూపించాడు. సినిమా నిడివి కేవలం రెండు గంటలే అయినా కూడా ఎందుకో బాగా లెంతీగా అనిపించింది. ఫస్టాఫ్‌లో హీరో హీరోయిన్ లవ్ ట్రాక్‌లో కొన్ని సీన్స్‌తో పాటు పాట కూడా కట్ చేసే ఛాన్స్ ఉన్నా రిస్క్ తీసుకోలేదు ఎడిటర్. దర్శకుడి ఛాయిస్ కాబట్టి అతని తప్పు పట్టలేము. దర్శకుడు దయ తనకు వచ్చిన అవకాశం అంతగా వాడుకోలేదనే చెప్పాలి. కథ రాసుకున్నాడు కానీ ఎమోషన్స్ పట్టుకోవడంలో విఫలమయ్యాడు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
సుధాకర్ రెడ్డి నటన
పాటలు
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
లవ్ ట్రాక్
ఎమోషన్స్ పండలేదు
స్లో నెరేషన్

అంతిమ తీర్పు: ఎమోషన్స్ పండని బాపు

Movie Title:-Bapu
Banners:-Comrade Film Factory, Athira Productions
Release Date : 21-02-2025
Cesnor Rating : “U/A”
Cast :-Brahmaji, Aaamani, Avasarala Srinivas, Balagam Sudhakar Reddy
Directed by:-Daya
Music:-R R Dhruvan
Cinematography:-Vasu Pendem
Editing:-Anil Aalayam
Producers:-Raju,C H Bhanu Prasad Reddy
Nizam Distributor : Global Cinemas LLP