Reading Time: 3 mins

Bacchala Malli Movie Teaser Launch Event

 

బచ్చల మల్లి మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్

 

బచ్చల మల్లి.. గమ్యం, నాంది లా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా అవుతుంది: టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్

అల్లరి నరేష్, సుబ్బు మంగదేవీ, రాజేష్ దండా, బాలాజీ గుత్తా, హాస్య మూవీస్ బచ్చల మల్లి రివర్టింగ్ టీజర్ లాంచ్

హీరో అల్లరి నరేష్ తన అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బచ్చల మల్లి’లో కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

టీజర్ మెయిన్ గా అల్లరి నరేష్ పాత్రపై ఫోకస్ చేస్తోంది. అల్లరి నరేష్ క్యారెక్టర్ ని కేర్ ఫ్రీ, మొండిపట్టుదల, మూర్ఖత్వం  వ్యక్తిగా టీజర్ హైలెట్ చేస్తోంది. అమృత అయ్యర్‌ క్యారెక్టర రిజెక్ట్ చేసినప్పటికీ ధైర్యంగా ఆమెతో ఫ్లర్ట్ చేస్తాడు. టీజర్ అతని రెబల్, నిర్లక్ష్య వైఖరి చూపిస్తోంది. అతను ఇతరుల అభిప్రాయాలని పట్టించుకోకుండా తన స్వంత నిబంధనలపై జీవితాన్ని గడపాలని నిశ్చయించుకున్నాడు. నరేష్ పాత్ర పిల్లల నుంచి విరాళాల పెట్టెను తీసుకున్నప్పుడు, అతని రియల్ నేచర్ ని ప్రజెంట్ చేసే మూమెంట్ తో టీజర్ ఎండ్ అయ్యింది.

నరేష్ మాస్ లుక్, అతని పెర్ఫార్మెన్స్ కంప్లీట్ చేస్తూ ఈ మాస్ క్యారెక్టర్‌కి డెప్త్ తీసుకొచ్చింది. అతని ప్రయాణంలో అమృత అయ్యర్ కీలక పాత్ర పోషిస్తుండగా, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష కూడా ఉన్నారు.

రిచర్డ్ ఎమ్ నాథన్ సినిమాటోగ్రఫీ, విశాల్ చంద్రశేఖర్ పవర్ ఫుల్ స్కోర్‌ టీజర్ ని మరింత ఎలివేట్ చేశాయి. హాస్య మూవీస్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. ఎడిటింగ్ ఛోటా కె. ప్రసాద్.

సుబ్బు మంగదేవి కథ, సంభాషణలు రాశారు,విప్పర్తి మధు స్క్రీన్‌ప్లే, అడిషినల్ స్క్రీన్‌ప్లేకి విశ్వనేత్ర సహకారం అందించారు. టీజర్‌ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసింది. బచ్చల మల్లి డిసెంబర్ 20న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ…తెలుగు సినిమా అభిమానులందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. డైరెక్టర్ సుబ్బు గారు మూడేళ్లు ఈ సినిమాతో జర్నీ చేశారు. ఈ సినిమా గురించి తప్ప దేని గురించి ఆలోచించలేదు. అది నాకు చాలా నచ్చింది. ఆయన కథ ఎంత అద్భుతంగా చెప్పారో అంతకంటే అద్భుతంగా సినిమా తీశారు. సినిమా చూశాను కాబట్టి అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఈ సినిమాలో సాంగ్స్ చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి. విశాల్ అండ్ డైరెక్టర్ సుబ్బు గారు దాదాపు 6 నెలలు కూర్చుని ఈ సినిమా కోసం పాటల్ని సిద్ధం చేశారు. చాలా కష్టపడి ఇష్టపడి చేశారు. ఎడిటింగ్ చోటా గారు, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి.. అందరూ కలిసి ఒక టీం ఎఫర్ట్ గా ఈ సినిమా చేశాం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఆర్టిస్టు టెక్నీషియన్ గురించి మాట్లాడతారు. ప్రసాద్ బెహరా చాలా మంచి యాక్టర్. చాలా సెటిల్ గా చేస్తాడు. తను పెద్ద స్టార్ కావాలని కోరుకుంటున్నాను. మధుగారు  తెర వెనక చాలా కీలక పాత్ర పోషించారు. అమృత గారు దగ్గర్నుంచి ఈ సినిమాలో నటించిన అందరికీ చాలా మంచి పేరు వస్తుంది. బచ్చల మల్లి..  గమ్యం, నాందిలా ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే సినిమా అవుతుంది. నాంది చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో,  ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా అంతే హ్యాపీగా ఉన్నాను. బచ్చలమల్లి డిసెంబర్ 20 తేదీన మీ ముందుకు వస్తుంది. థియేటర్లో అందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరోయిన్ అమృత అయ్యర్ మాట్లాడుతూ.. టీజర్  రెస్పాన్స్ చూసినప్పుడు డిసెంబర్ 20 బిగ్ హిట్ అనే కాన్ఫిడెన్స్ వచ్చేసింది. బచ్చలమల్లి సినిమాకి వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నరేష్ గారు చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ చేశారు. అంత మంచి క్యారెక్టర్ రాసిన డైరెక్టర్ గారికి థాంక్యూ సో మచ్. హాస్య ప్రొడక్షన్ లో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ పేరుపేరునా థాంక్స్. డిసెంబర్ 20న తప్పకుండా ఈ సినిమా చూడండి’ అన్నారు

డైరెక్టర్ సుబ్బు మంగదేవి మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. ఈ సినిమా మూడేళ్ల కష్టం. నా డైరెక్షన్ టీం కి థాంక్యూ.  నాతో పాటు సమానంగా కష్టపడ్డారు. మధుగారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా సక్సెస్ లో సగం క్రెడిట్ ఆయనకి దక్కుతుంది.  కరోనా సమయంలో హాస్పిటల్లో ఉన్న మా అమ్మగారిని చూడ్డానికి సరైన సమయంలో వెళ్లలేక పోయాను. నేను వెళ్లేటప్పుడు అదే చివరి చూపు అయింది. అప్పుడు నాకు అర్థమైంది జీవితంలో ఏ విషయాన్ని కూడా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. లైఫ్ లో వెనక్కి వెళ్లి సరిదిద్దుకోలేని తప్పు చేయకూడదు కదా అనిపించింది. అది నాకు చాలా బలంగా తాకింది.  ఇలాంటి పాయింట్ మీద ఒక కథ చెప్పాలనిపించింది. ప్రతి ఒక్కరూ ఏదో మూమెంట్లో ఒక తప్పు చేస్తారు. అలాంటి ఒక పాయింట్ ని జెన్యూన్ గా చెప్పాలనిపించింది. ఈ పాయింట్ చెప్పడానికి, ఈ సినిమా తీయడానికి నాకు మొదట ఎంకరేజ్ చేసింది నరేష్ గారు. ఆయన లేకపొతే బచ్చలమల్లి అనే క్యారెక్టర్ లేదు. నేను ఎలా చేయమంటే అలా చేశారు. నాకు అంత కంఫర్ట్ ఇచ్చారు. అమృత గారు బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కావేరి పాత్రతో కనెక్ట్ అవుతారు. విశాల్ గారితో వర్క్ చేయడం చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్.  చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు

నిర్మాత రాజేష్ దండా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 20 వస్తున్నాం. కొడుతున్నాం. రాసి పెట్టుకోండి ఈ సినిమా కథ విన్నప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. చాలా ఇష్టపడి ప్రేమించి చేసిన సినిమా ఇది. రిచర్డ్ గారు చాలా ఇంపాక్ట్ ఫుల్ ఫోటోగ్రఫీ ఇచ్చారు. విశాల్ గారు చాలా మంచి పాటలు ఇచ్చారు. హనుమాన్ తర్వాత అమృత ఇయర్ ఈ సినిమా చేస్తున్నారు.  నరేష్ గారి కెరియర్లో ఇది బెస్ట్ మూవీ అని గర్వంగా చెప్తున్నాను. మీరందరూ ఆ సినిమాని బ్లెస్ చేయాలి’ అన్నారు.

యాక్టర్ ప్రసాద్ బెహరా మాట్లాడుతూ .. అందరికీ నమస్కారం. యూట్యూబ్లో నా వీడియో చూసి డైరెక్టర్ సుబ్బు గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. నరేష్ గారు ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఇప్పుడు బచ్చలమల్లితో డిసెంబర్ 20న మన ముందుకు రాబోతున్నారు. ఒక ఫిల్టర్ లెస్ వ్యక్తి ఎలా ఉంటాడో బచ్చల మల్లి అలా ఉంటాడు. అల్లరి నరేష్ గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. టీం అందరి సపోర్ట్ కి థాంక్యూ సో మచ్’ అన్నారు

డిఓపి రిచర్డ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో పార్ట్ అవడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఫస్ట్ తెలుగు ఫిలిం. చాలా అద్భుతంగా సినిమాని చేసాము. రిజల్ట్ కూడా చాలా గొప్పగా ఉంటుందని నమ్ముతున్నాం’అన్నారు

ఎడిటర్ చోటా కె ప్రసాద్ మాట్లాడుతూ.. మా సినిమా డిసెంబర్ 20వ తారీఖున మీ ముందుకు వస్తుంది. బచ్చలమల్లి క్యారెక్టర్ అందరికీ కనెక్ట్ అవుతుంది. మన జీవితంలో అలాంటి క్యారెక్టర్ మనకి ఎదురుపడి ఉంటుంది. డిసెంబర్ 20న తప్పకుండా అందరూ థియేటర్స్ లో సినిమా చూడండి’ అన్నారు

ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. చాలా మంచి కథ ఇది. చాలా మంచి సినిమా అవుతుందని నమ్మకం ఉంది’అన్నారు.

తారాగణం :

అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు.

సాంకేతిక సిబ్బంది :

కథ, మాటలు, దర్శకత్వం – సుబ్బు మంగదేవి
నిర్మాతలు – రాజేష్ దండా, బాలాజీ గుత్తా
బ్యానర్: హాస్య మూవీస్
సంగీతం- విశాల్ చంద్రశేఖర్
డీవోపీ- రిచర్డ్ M నాథన్
ఎడిటింగ్- ఛోటా కె ప్రసాద్