Reading Time: 3 mins

Balakrishna 50 years Celebrations

బాలకృష్ణ 50 వసంతాల సినిమా ప్రస్థానం

నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆయన అభిమానులు ప్రత్యేక వేడుకలు నిర్వహించినున్నారు. ఈ వేడుకకు హైదరాబాద్ వేదిక కానుంది. నందమూరి తారాక రామారావు కొడుకుగా బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ నేటికి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇటు చిత్ర పరిశ్రమలో, అటు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఎంతో మంది డైరెక్టర్లతో పనిచేశారు. నందమూరి బాలయ్య ఈ పేరు అభిమానులకు ఓ పూనకం.

అసెంబ్లీలో చర్చలు, రెండు నెలల పాటు నిషేధం - బాలయ్య తొలి సినిమా 'తాతమ్మ కల' విశేషాలివే! - Balakrishna 50 Years Tatamma Kala

 

ఎన్టీఆర్ నటవారసుడిగా 1974లో తాతమ్మ కల చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు బాలయ్యా బాబు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ దర్శకత్వం చేశారు. అందులో తాతామ్మ కల నెరవేర్చే మనువడిగా అద్భతమైన నటన కనబరిచారు బాలకృష్ణ. ఆ తరువాత రామ్ రహిమ్ చిత్రంలో నటించారు. బాల నటుడిగా తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి చాలా సినిమాల్లో నటించారు. అన్నదమ్ముల అనుబంధం, వేముల వాడ భీమకవి, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి లాంటి చిత్రాలు ఎన్నో నటించారు. ఈ చిత్రాల తరువాత కూడా సోలోగా చాలా చిత్రాలలో నటించారు. కానీ బాలయ్యకు ఊహించినంతగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఆయన పరిశ్రమకు వచ్చిన పదేళ్లకు అంటే 1984లో మంగమ్మగారి మనవడు సినిమా వచ్చింది.

Mangamma Gari Manavadu (1984)

భార్గవ్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్‌పై కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మంగమ్మగారి మనవడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్‌ను అందుకుంది. అందాల తార సుహాసని నటించిన ఈ చిత్రం గోల్డెన్ జూబ్లీని జరపుకోవడం విశేషం. ఆ తరువాత ఇదే బ్యానర్‌పై కోడిరామ కృష్ణ తెరకెక్కించిన ముద్దుల మావయ్య చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం కంటే ముందే పల్నాటి పులి, ఆత్మబలం, బాబాయ్ అబ్బాయ్, భలే తమ్ముడు, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సోదరులు, భార్గవ రాముడు, రాము, అల్లరి కృష్ణయ్య, సహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు, భానుమతి మొగుడు, భలే దొంగ లాంటి చిత్రాలు చేశారు.

Muddula Mavayya 14 Apr 89

ఇక ముద్దుల మావయ్య తరువాత మళ్లీ ఈ రేంజ్‌లో చెప్పుకోదగ్గ చిత్రం ఆదిత్య 369 అని చెప్పవచ్చు. 1991లో వచ్చిన ఈ చిత్రం అద్బుతమైన టెక్నాలజీని ఉపయోగించుకొని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌త రక్తి కట్టించారు. తెలుగులో వచ్చిన మొదటి టైమ్ ట్రావెలింగ్ చిత్రం ఆదిత్య 369. ఈ చిత్రం తరువాత బాలయ్య బాబు నటించిన మరో కళాఖండం బైవర దీపం. ఈ చిత్రానికి సైతం విమర్శకులు ప్రశంసలు అందుకున్నారు. అలా తనదైన శైలీలో సినిమాలు చేస్తూ అలరిస్తున్న సమయంలో 1999లో బీ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా సమరసింహారెడ్డి. ఈ చిత్రంతో బాలయ్య కెరీర్ గ్రాఫ్ మారిపోయింది. హీరోయిజానికి కేరాఫ్ అడ్రస్‌గా బాలయ్య పేరు మారుమోగింది.

Happy Birthday Nandamuri Balakrishna: These 3 Faction films have made the Natasimham “the darling of the masses” | Telugu Movie News - Times of India

ఫ్యాక్షన్ బ్యాగ్‌డ్రాఫ్‌లో వచ్చిన సమరసింహారెడ్డి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అదే సంవత్సరం వచ్చిన సుల్తాన్ సినిమా సైతం మంచి హిట్ అందుకుంది. ఇదే తరహాలో నరసింహా నాయుడు, చెన్నకేశవ రెడ్డి, సీమసింహం, లక్ష్మీ నరసింహా లాంటి వరుస హిట్లు ఇచ్చారు. అలా బాలయ్య బాబు సినిమా జర్నీలో మరో మైలు రాయిలాంటి సినిమా సింహా. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సింహ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో వీరి కాంబినేషన్‌లో లెజెండ్, అఖండ లాంటి చిత్రాలు వచ్చాయి. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరీ లాంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ హిట్‌ను ఇచ్చాయి. ప్రస్తుతం బాబి కొల్లు దర్శకత్వంలో ఎన్బీకే 109 సినిమాను తెరకెక్కిస్తున్నారు. 108చిత్రాలు పూర్తి చేసుకొని బాలయ్య బాక్స్ ఆఫీస్ లెజెండ్‌గా నిలిచాడు. సినిమా రంగంలో నేటికి ఆయన 50 సంవత్సాలు పూర్తిచేసుకోవడం గొప్ప విశేషం. ఇలాగే మరిన్ని సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.