Balakrishna 50 Years Interesting Movie Journey
బాలకృష్ణ 50 ఏళ్ల ఆసక్తికరమైన సినిమా ప్రస్థానం
నందమూరి నటసింహం బాలకృష్ణ 50 ఏళ్లుగా చిత్రసీమలో తిరుగులేని జర్నీ చేస్తున్నారు. నటరత్న ఎన్టీఆర్ తనయుడుగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఎన్నో విజయాలను అందుకున్నారు. ఆ ప్రయాణంలో అపజయాలు సైతం పలకరించాయి కానీ ఆయన ఎక్కడ కుంగి పోలేదు. తెరపై ఆయన్ను నటసింహం అని ఊరికే అనలేదు ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన నటన అద్భుతం. ఇక ఆయన మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. బాల నటుడి నుంచి మొదలైన ఆయన మూవీ జర్నీ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. ఈ జర్నీలో ఆయన సినిమాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చర్చిద్దాం.
ఎన్టీఆర్ నటవారసుడిగా 1974లో తాతమ్మ కల చిత్రంతో వెండి తెరకు పరిచయం అయ్యారు బాలయ్యా బాబు. ఆ తరువాత 1984లో మంగమ్మగారి మనవడు సినిమాలో సోలో హీరోగా నటించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రంలో సుహాసని హీరోయిన్‌గా నటించింది. అలా మొదలైన ఆయన సినిమా ప్రస్థానం 2024 నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ అర్ధశతాబ్దం కాలంలో మొత్తం 109 చిత్రాలలో నటించారు. ఆయన నటించని జానర్ లేదంటే ఆశ్చర్యపోతాము. జానపదం నుంచి మొదలు పెడితే పౌరానికం, సోసియే ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జానర్‌లను టచ్ చేసి రికార్డు సృష్టించాడు బాలయ్య.
ఆయన నటించి సినిమాల్లో ఇప్పటి వరకు 129 మంది హీరోయిన్లతో పని చేసి అత్యదిక హీరోయిన్లతో పని చేసిన నటుడిగా పేరు గడించాడు. పల్నాటి పులి, ఆత్మబలం, బాబాయ్ అబ్బాయ్, భలే తమ్ముడు, ముద్దుల కృష్ణయ్య, అనసూయమ్మగారి అల్లుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సోదరులు, భార్గవ రాముడు, రాము, అల్లరి కృష్ణయ్య, సహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు, భానుమతి మొగుడు, భలే దొంగ లాంటి ఎన్నో చిత్రాలలో చిత్రాలు చేశారు. ఇలాంటి కమర్షల్ చిత్రాలు చేస్తూనే., ఆదిత్య 369, భైరవ దీపంలాంటి సైన్స్ ఫిక్షన్ చిత్రాలను సైతం తీశారు. రూ. 10 లక్షలతో మొదలు పెట్టి 100 కోట్ల బడ్జెట్ వరకు ఆయన ఈ చిత్రాలు తెరకెక్కించారు.
బీ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా సమరసింహారెడ్డి చిత్రంతో ఫ్యాక్షన్ కథలను తెరపైకి తీసుకొచ్చి కమర్షియల్ హిట్ అందుకున్నారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన వీర సింహా రెడ్డి వరకు చాలా ఫ్యాక్షన్ చిత్రాలు తీసిన చరిత్ర ఆయనది. అలాగే సింహా అనే పేరుతో ఎక్కువ సినిమాలు తీసిన చరిత్ర కూడా బాలయ్యదే. అలా 10 ఫీట్ల కౌటట్ నుంచి 108 ఫీట్ల కటౌట్‌తో అభిమానులు వారి ప్రేమను చాటుకున్నారు. ఆయన చిత్రాలు సైతం 100 రోజుల నుంచి 1000 రోజులు ఆడిన రికార్డు ఉంది. బాలయ్య బాబు కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చిత్రం సింహా. ఆ తరువాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన లెజెండ్ చిత్రం ప్రొద్దటూరులో 100 రోజులు ఆడింది. అలాగే కర్నూలు జిల్లాలోని రెండు థియేటర్లలో నాలుగు షోల చొప్పున 365 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. బాలయ్య ఇమేజ్‌ను అందనంత ఎత్తుకు పెంచింది లెజెండ్.
సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవకు ఎన్నో అవార్డులు వరించాయి. కేవలం సినిమాలు మాత్రమే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుల్లు అని ఎన్టీఆర్ అన్నట్లు బాలయ్య బాబు సైతం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు. వారి అమ్మ పేరు మీద స్థాపించిన బసవతారకం క్యాన్సెర్ ఆసుపత్రి సౌత్ ఇండియాలో ఎంతో పేరుగాంచిన క్యాన్సర్ ఆసుపత్రి. తీరిక లేకుండా అటు పోలిటికల్, సోషల్ సర్వీస్, మూవీస్ అంతే కాకుండా ఓటీటీ షోలతో అలరిస్తున్నారు బాలయ్య.