Bapu Movie Pre Release Event
బాపు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్
‘బాపు’ లాంటి కల్చర్ ని చూపించే సినిమా కోసం ఎదురుచూస్తున్నాను : రానా దగ్గుబాటి
వెర్సటైల్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్ లో ఒకరిగా ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్న డార్క్ కామెడీ-డ్రామా ‘బాపు’. ఈ చిత్రానికి దయా దర్శకత్వం వహిస్తున్నారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫెబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ రోజు మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో రానా దగ్గుబాటి, తిరువీర్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ..రెగ్యులర్ కి భిన్నంగా వుండే ఇలాంటి జోనర్స్ రావడం చాలా అరుదు. ఒక కల్చర్ ని చూపించే జానర్స్ రావడం ఆడియన్ గా చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. టీం అందరికీ అల్ ది వెరీ బెస్ట్’అన్నారు
హీరో తిరువీర్ మాట్లాడుతూ.. బాపు టైటిల్ పెట్టగానే నచ్చేసింది. ఇందులో ప్రమోషనల్ కంటెంట్ నా బాల్యానికి తీసుకెళ్ళింది. ట్రైలర్ లో మట్టివాసన కనిపించింది. బ్రహ్మాజీ గారిని ఇలాంటి పాత్రల్లో చూస్తే కడుపునిండిపోయింది. దయ గారు చాలా మంచి సినిమా తీశారు. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను’అన్నారు
మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. బాపు చాలా అందమైన సినిమా. సినిమా రెండు సార్లు చూశాను. చాల నచ్చింది. ఈ సినిమాకి జెన్యూన్ గా హెల్ప్ చేయాలని అనిపించింది. మన కుటుంబంలో పాత్రలు ఇందులో కనిపిస్తాయి. డైరెక్టర్ దయ మనుషుల ముసుగు తొలగించి ఓ కథ చెప్పాడు. టీం అందరికీ కంగ్రాట్స్. బ్రహ్మాజీ సపోర్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. అందరం చూసి ఈ సినిమాని సపోర్ట్ చేద్దాం’అన్నారు
యాక్టర్ బ్రహ్మాజీ మాట్లాడుతూ..రానా లాంటి డౌన్ టు ఎర్త్ హీరోని నేను ఎప్పుడూ చూడలేదు. చిన్న సినిమాలని ప్రోత్సహించడంలో ముందు ఉంటాడు. తను ఓ సామ్రాజ్యానికి అధినేత అయినప్పటికీ మేము సడన్ గా ఆయన డోర్ ఓపెన్ చేసి పిలవగానే మా ఈవెంట్ కి వచ్చారు. తనని దేవుడు చల్లగా చూడాలి. బాపు మంచి కంటెంట్ వున్న సినిమా. అందరూ కలసి మంచి ప్రయత్నం చేశాం. రానా మా ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’అన్నారు
డైరెక్టర్ దయ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం, మా నిర్మాతలు, నటీనటులందరికీ ధన్యవాదాలు. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. సినిమా 21న వస్తోంది. అందరూ థియేటర్స్ లో చూడాలని కోరుకుంటున్నాను’అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ RR ధ్రువన్ మాట్లాడుతూ.. ఇంత మంచి సోల్ ఫుల్ సినిమాకి మ్యూజిక్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది నా కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా. సినిమా అద్భుతంగా వచ్చింది. ఇందులో ప్రతి పాత్ర సహజంగా వుంటుంది. అందరికీ నచ్చుతుంది’అన్నారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
నటీనటులు :
బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్, బలగం సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ, మణి ఎగుర్ల, రాచ రవి, గంగవ్వ
సాంకేతిక వర్గం :
బ్యానర్: కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్
నిర్మాతలు: రాజు, సిహెచ్. భాను ప్రసాద్ రెడ్డి
రచన, దర్శకత్వం: దయా
సంగీతం: RR ధ్రువన్
సినిమాటోగ్రఫీ: వాసు పెండెం
ఎడిటింగ్: అనిల్ ఆలయం