Reading Time: 2 mins

Baroj 3D Is A Family Movie Mohanlaal
‘బరోజ్ 3డీ’ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా మోహన్ లాల్

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ టైటిల్ రోల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఎపిక్ ఫాంటసీ అడ్వంచర్ ‘బరోజ్ 3డీ’. ఈ ఎపిక్‌ డ్రామా ఫాంటసీ సినిమాని ఆశీర్వాద్‌ సినిమాస్‌ పతాకంపై ఆంటోని పెరుంబవూర్‌ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ నేషనల్ వైడ్ గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసి సినిమాపై అంచనాలు పెంచాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించారు.

ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో, డైరెక్టర్ మోహన్ లాల్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. గత నాలుగు దశాబ్దాలుగా అద్భుతమైన చిత్ర పరిశ్రమలో భాగం కావడం ఓ గౌరవంగా భావిస్తున్నాను. ఎన్నో కథలు, పాత్రలతో మీకు చేరువయ్యాను. మీ ప్రేమ ఆదరణకు కృతజ్ఞతలు. బరోజ్ చిత్రానికి దర్శకత్వం వహించానని మీ అందరికీ చెప్పడం చాలా ఆనందంగా వుంది. ఇది త్రీడీ ఫిల్మ్. నేటివ్ త్రీడీలో తీసిన సినిమా. గత 40 ఏళ్ళుగా ఈ ఫార్మెట్ లో సినిమాని ఎవరూ ప్రయత్నించలేదు. ఇది చిల్డ్రన్ ఫ్రెండ్లీ ఫిల్మ్. పిల్లలు, పెద్దలు అందరూ చూడాల్సిన సినిమా. చాలా ప్రేమతో తీశాం. మనలోని బాల్యాన్ని సెలబ్రేట్ చేసుకునే సినిమా. స్టొరీ టెల్లింగ్ చాలా కొత్తగా వుంటుంది. సంతోష్ శివన్ లాంటి ఇండియన్ బెస్ట్ కెమరామెన్ ఈ సినిమాకి పని చేశారు. ఫస్ట్ త్రీడీ ఫిల్మ్ కి పని చేసిన నా ఫ్రెండ్ రాజీవ్ కుమార్ ఇందులో పార్ట్ అయ్యారు. బాల మేధావి లిడియన్ నాదస్వరం ఈ సినిమాకి పాటలు సమకూర్చారు. తనలో అమాయకత్వం స్వచ్చమైన పాటలని అందించాయి. ఈ సినిమా బీజీఎం చాలా ప్రత్యేకంగా వుంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ తో అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. వారి ప్రొడక్షన్ జనతా గ్యారేజ్ సినిమా చేశాను. బరోజ్ కంటెంట్ వారికి చాలా నచ్చింది. గ్రేట్ విజన్ తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఫ్యామిలీ ఫిల్మ్. ప్రపంచం అంతా చూడదగ్గ సినిమా ఇది. అందరూ ఎంజాయ్ చేస్తారు’ అన్నారు

క్రియేటివ్ హెడ్ TK రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. మోహన్ లాల్ గారు డైరెక్టర్ గా డెబ్యు చేసిన ఈ సినిమాలో పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా వుంది. అపారమైన అనుభవం వున్న మోహన్ లాల్ గారు సినిమాని చాలా అద్భుతంగా మలిచారు. ఇందులో స్టొరీ టెల్లింగ్ చాలా కొత్త అనుభూతిని ఇస్తుంది. త్రీడీ, యానిమేటెడ్, విఎఫ్ ఎక్స్.. ఇలా విభాగాల్లో సినిమా అత్యున్నతంగా వుంటుంది. ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేశారు. మోహన్ లాల్ గారు చాలా ప్రేమతో ఈ సినిమా చేశారు. ప్రతిఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. అందరూ సినిమాని ఎంజాయ్ చేస్తారు’ అన్నారు.

ముఖేష్ మెహతా మాట్లాడుతూ.. మోహన్ లాల్ గారితో అసోసియేట్ అవ్వడం ఆనందంగా వుంది. ఆయన సినిమాతోనే మలయాళం కెరీర్ స్టార్ట్ చేశాను. ఆయనతో మూడు సినిమాలు చేశాను. ఈ సినిమాని చాలా ప్రేమ, పాషన్ తో చేశారు. నాలుగేళ్ళు కష్టపడ్డారు. త్రీడీలో అద్భుతమైన అనుభవం ఇస్తుంది. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’ అన్నారు.

నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కేరళ వెళ్ళినప్పుడు మోహన్ లాల్ గారు ఈ సినిమాలో కొన్ని సాంగ్స్ విజువల్స్ చూపించారు. మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. మేము చిన్నప్పుడు చూసిన చిన్నారి చేతన లాంటి సినిమాలు గుర్తుకొచ్చాయి. ఫెస్టివల్ టైం లో వస్తున్న ఈ సినిమా కుటుంబం అంతా కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇది రియల్ త్రీడీ సినిమా. షూటింగ్ మొదలుపెట్టినప్పుడే త్రీడీ వెర్షన్ లో షూట్ చేశారు. ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. మోహన్ లాల్ గారు యాక్ట్ చేసి, డైరెక్టర్ చేసి, హై బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఒక సెన్సేషనల్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ థాంక్ యూ’ అన్నారు.