Reading Time: 3 mins

Bhale Unnaade Movie Review

భలే వున్నాడే మూవీ రివ్యూ 

Emotional Engagement Emoji

‘ఉయ్యాలా జంపాలా’ సినిమా తో తెలుగు తెరకి పరిచయం అయిన హీరో రాజ్ తరుణ్ కెరీర్ బిగినింగ్ లో తన నటనలో కొత్తదనం, ఈజ్ తో బాగానే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.హిట్లు ,సూపర్ హిట్లు కూడా అందుకున్నాడు. గత కొంతకాలంగా తను చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొంత నిరాశని కలిగిస్తున్నాయి,ఈ క్రమంలో రాజ్ తరుణ్  హిట్ కొట్టి చాలా ఏళ్లే అవుతోంది. రాజ్ తరుణ్ చివరగా ‘తిరగబడరా సామీ’, ‘పురుషోత్తముడు’ అంటూ పరమ రొటీన్ చిత్రాలతో ఆడియెన్స్‌ను విసిగెత్తించాడు. మరి ఈ సారి కాస్త ట్రెండీ కాన్సెప్ట్‌తో భలే ఉన్నాడే అంటూ వచ్చాడు. ఈ మూవీ, డైరెక్టర్ మారుతి పేరు ఉండటం, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో బజ్ అయితే క్రియేట్ అయింది. మరి ఈ మూవీ అయినా రాజ్ తరుణ్‌కు హిట్ తెచ్చి పెడుతుందా? లేదా? అన్నది చూద్దాం.

కథ :

గౌరి (అభిరామి) ఒంటరిగా తన కొడుకు రాధను (రాజ్ తరుణ్) కష్టపడి పెంచుతుంది. రాధ గుణంలో రాముడి వంటివాడు. ఎలాంటి చెడు అలవాట్లు ఉండవు. అమ్మాయిలకు చీరకట్టే వృత్తి. అయినా కూడా అమ్మాయిల్ని తన చేత్తో తప్పుగా తాకడు. అమ్మాయిలు కవ్వించినా కూడా కరిగిపోడు. ఇక కృష్ణ (మనీషా) కాస్త మోడ్రన్ ఆలోచనలతో ఉండే అమ్మాయి. కృష్ణకు ఓ స్నేహితురాలు ఉంటుంది. గౌరి పని చేసే బ్యాంకులోనే కృష్ణ జాయిన్ అవుతుంది. రాధ చేసే వంటలు కృష్ణకు తెగ నచ్చుతాయి. మొహం చూడకుండానే రాధను ఇష్టపడుతుంది. రాధకి కూడా కృష్ణ అంటే ఇష్టం కలుగుతుంది. కానీ రాధ నుంచి కృష్ణ చాలా ఊహించుకుంటుంది. రాధ మాత్రం తన హద్దుల్లోనే ఉంటాడు. చివరకు ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. ఆ టైంలోనే కృష్ణ వద్దకు ఆమె స్నేహితురాలు వస్తుంది. తన భర్తకు మ్యాటర్ లేదని, తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని వాపోతుంది. దీంతో రాధ మీద కూడా కృష్ణకి అనుమానం కలుగుతుంది? ఆ తరువాత కృష్ణ ఏం చేసింది? అసలు రాధ అలా ఎందుకు అమ్మాయిలకు దూరంగా ఉంటాడు? నిజంగానే రాధకు మ్యాటర్ లేదా? చివరకు ఏం జరిగింది? అన్నది కథ.

భలే ఉన్నాడే సినిమా ఈ ట్రెండ్‌కు కావాల్సిన సినిమానే. అసలు ప్రేమ అంటే ఏంటి? మగాడు అంటే ఏంటి? అనేది చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. ప్రేమ అంటే శారీరక సుఖం.. మగాడు అంటే సుఖపెట్టేవాడు.. అని అనుకునే ఈ ట్రెండ్‌కు తగ్గట్టు, వారికి కనువిప్పు కలిగేట్టుగా ఈ పాయింట్ ఎంటర్టైనింగ్‌గా, ఎమోషనల్‌గా చెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లికి ముందే టెస్ట్ డ్రైవ్ చేయాలని అనుకునే ఆలోచనలున్న వారికి, అదే ప్రేమ అనుకుని భ్రమపడే వారికి.. ప్రేమకి అసలు అర్థం చెప్పేలా తీశాడనిపిస్తుంది. అందులో చాలా వరకు సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తుంది. మధ్యలో కొన్ని క్రింజ్ సీన్లు కూడా ఉన్నాయి. సినిమా పూర్తిగా బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా చెప్పలేం.

ప్రథమార్దం అంతా సరదా సరదాగా సాగుతుంది. వీటీవీ గణేష్, రాజ్ తరుణ్ కామెడీ సీన్లు.. హైపర్ ఆది పంచ్‌లు, హీరోయిన్ హీరో ట్రాక్.. ఇలా ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ కార్డ్ వచ్చే ఓ పది నిమిషాల ముందు మాత్రం విపరీతంగా నవ్వించేస్తాడు. నవ్వులతోనే ఇంటర్వెల్ పడుతుంది. ఇక సెకండాఫ్ ఎలా సాగుతుందా? అని అనుకునే ప్రేక్షకుడి కాస్త ఎదురు దెబ్బ తగులుతుంది. ఆశ్రమంలోకి వెళ్లిన తరువాత కొన్ని సీన్లు క్రింజ్‌లా అనిపించొచ్చు. కానీ కొన్ని సీన్లు ఎమోషనల్‌గా టచ్ అవుతాయి. సింగీతం శ్రీనివాసరావు సీన్లు ఆకట్టుకుంటాయి. ఫ్లాష్ బ్యాక్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోయినా.. మదర్ సెంటిమెంట్ బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్‌లో రాజ్ తరుణ్ యాక్టింగ్ ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ఇక రొటీన్‌గానే ఉంటుంది. కానీ అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించకూడదన్న నియమం ఎందుకు పెట్టుకున్నాడన్ని మాత్రం కాస్త ఎమోషనల్‌గా, కన్విన్స్‌గా చెప్పినట్టు అనిపిస్తుంది.

టెక్నీషియన్లుః 

సినిమాకి శేఖర్‌ చంద్ర పాటలు బాగున్నాయి. సినిమా రేంజ్‌ని పెంచాయి. వినసొంపుగానూ, కొత్తగానూ ఉన్నాయి. ఆర్‌ఆర్‌ సైతం ఆకట్టుకుంది. విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. సినిమా గ్రాండ్‌నెస్‌ ని పెంచాయి. ఎడిటింగ్‌ పరంగా చాలా లోపాలున్నాయి. సెకండాఫ్‌లో కన్‌ ఫ్యూజన్‌ క్రియేట్‌ చేసే సీన్లు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు శివ సాయి వర్దన్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్‌లో తడబడ్డాడు. ఫస్టాఫ్‌లా సెకండాఫ్‌ని డీల్‌ చేయలేకపోయాడు. మల్టీఫుల్‌ ఎమోషన్స్ చూపించే క్రమంలో కథ ట్రాక్‌ తప్పిన ఫీలింగ్‌ కలుగుతుంది. మెయిన్‌ ఎమోషన్స్ ఇందులో మిస్‌ అయ్యింది. ఆ జాగ్రత్తలు తీసుకుంటే సినిమా ఫలితం బాగుండేది

నటీనటులుః 

రాధా పాత్రలో రాజ్‌ తరుణ్‌ బాగా చేశాడు. చాలా సెటిల్డ్ గా మెప్పించాడు. అదే సమయంలో మగాడిగా ఉంటూ అమ్మాయిలా ప్రవర్తించడమనేది బిగ్‌ టాస్క్. ఆ విషయంలో రాజ్‌ తరుణ్‌కి మంచి మార్కులే పడతాయి. నటుడిగా అతనిలోని మెచ్యూరిటీని ప్రతిబింబిస్తుంది. అమ్మాయిలా చీరకట్టి డాన్స్ చేసి విజిల్స్ వేయించుకున్నాడు.

ఇక కొత్త అమ్మాయి మనీషా కందుకూర్‌ తొలి చిత్రంతోనే మెప్పించింది. రాజ్‌ తరుణ్‌ని కొన్ని సీన్లలో డామినేట్‌ చేసింది. ఈ ఇద్దరే సినిమాకి మెయిన్‌ పిల్లర్స్. వీరితోపాటు రాజ్‌ తరుణ్‌ మదర్‌గా అభిరామి బాగా చేసింది. తనే హీరోయిన్‌లా ఉంటూ అమ్మలా మెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇలాంటి పాత్ర చేయడమే పెద్ద సాహసం.

గోపరాజు రమణ తనకు యాప్ట్ గా నిలిచే పాత్రలో అదరగొట్టాడు. సుదర్శన్‌ చివర్లో కామెడీ నవ్వులు పూయించింది. రచ్చ రవి కాసేపు ఓ మెరుపు మెరిశాడు. వీటీవీ గణేష్‌ ఫన్‌ కూడా బాగుంది. తనదైన స్టయిల్‌లో నవ్వించాడు. హైపర్‌ ఆది కామెడీ ఫస్టాఫ్‌లో మెప్పిస్తుంది. కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సింగీతం లు కూడా అలరించారు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.

ఫైనల్‌గా :

`భలే ఉన్నాడే!.. భలే ఉందనిపించుకోలేకపోయింది. రాజ్‌ తరుణ్‌ వ్యక్తిగత జీవితం మాదిరిగానే ఆయన ఎంచుకుంటున్న సినిమాలుండటం గమనార్హం..

ప్లస్ పాయింట్స్ :

ఎంచుకున్న కథ, మ్యూజిక్,ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:

స్క్రీన్ ప్లే , డైరెక్షన్ ,

సినిమా వివరాలు :

సినిమా టైటిల్ : భలే ఉన్నాడే
బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్
విడుదల తేదీ : 13-09-2024
సెన్సార్ రేటింగ్: “U/A”
తారాగణం : రాజ్ తరుణ్, మనీష్ కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి
కథ – దర్శకుడు: జె శివసాయి వర్ధన్
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్
ఎడిటింగ్: శ్రీకాంత్ పట్నాయక్
నిర్మాత: ఎన్‌వి కిరణ్ కుమార్
నిజాం డిస్ట్రిబ్యూటర్: గ్లోబల్ సినిమాస్

మూవీ రివ్యూ :

రావ్ సాన్ ఫిలిమ్స్ టీమ్