Reading Time: < 1 min

Brahma Anandam Trailer Review
బ్రహ్మా ఆనందం ట్రైలర్ రివ్యూ

తెర వెనుక తండ్రీకొడుకులు తెరమీద తాతామనవడు ఇదే పాయింట్ ప్రేక్షకుడిని కట్టిపడేసింది. ఏదో గమ్మత్తుగా ఉంది అనే ఉత్సాహాన్ని ఇచ్చింది బ్రహ్మా ఆనందం సినిమా కాన్సెప్ట్. తెలుగు తెర కామెడీ బ్రహ్మాగా పేరున్న బ్రహ్మానందం, ఆయన కొడుకు గౌతమ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మ ఆనందం. నక్కా రాహుల్ యాదవ్ నిర్మాణంలో ఆర్వీఎస్ నిఖిల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న థియేటర్లోకి రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ లో కంటెంట్ చాలా భావేద్వేగంగా ఉంది.

ఒంటరిగా పెరిగిన ఓ యువకుడు స్వార్థపరుడిగా మారుతాడు. థియేటర్ ఆర్టిస్టుగా పనిచేసే అతనికి ఓ 6 లక్షలు అవసరం ఉంటుంది. తాను స్వార్థపరుడు అన్న విషయం తన చుట్టు ఉన్న వారికి తెలుసు కాబట్టి ఎవరూ తనకు హెల్ప్ చేయరు. అలాంటి సమయంలో బ్రహ్మానందం తనకు సాయం చేస్తా అని చెప్పడం, తన ఊర్లో ఒక పొలం ఉందని, దాన్ని అమ్మేసి తనకు డబ్బులు ఇస్తానని చెప్పడం ఒక ఎత్తు అయితే, తనను తాతా అని పిలవాలి అని చెప్పడం ఆసక్తికరమైన పాయింట్. భూమికోసం పల్లెటూరికి వెళ్లిన హీరోకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి, మనుషుల విలువలు తెలిశాయా అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాలి.

మొదటి నుంచీ ఈ మూవీపై పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. తండ్రి, కొడుకులు తాత మనవళ్లుగా నటిస్తున్నారు అనే పాయింట్ అందరిని ఆకర్షించింది. వెన్నెల కిశోర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు హ్యూమన్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి ఈ కథలో. ఇది కచ్చితంగా రొటీన్ సినిమాలా కాకుండా డిఫరెంట్ మూవీలా అనిపిస్తుంది. ఈ ఫిబ్రవరి 14న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో చూడాలి.

Title: BrahmaAnandam
Banner: Swadharm Entertainment
Producer: Rahul Yadav Nakka
Writer & Director: Rvs Nikhil
Music Director: Sandilya Pisapati
DOP: Mitesh Parvathaneni
Art Director: Kranthi Priyam
Editor: Praneeth Kumar
Executive Producers: D Vamsi Krishna Reddy, P Dayakar Rao
Costume Designer: Monika Yadav
Sound Design: Nagarjuna Thallapalli
Sound Mixing: Ajith Abraham George
MIX & MASTER: Sound Roof Studios
Line Producer: Satya Pradeep
Production Controller: Sri Hari Pedamallu
VFX: Anil Kumar Jooluri
PRO: Vamsi Kaka
Marketing: Housefull
Publicity Designer: P Syam
Direction Department: G Veerabhadra Rao, Bharath Babu Rampelli, Ashok Gamidi, Hari Krishna Puni, Shiva ESK, Namaswamy