Reading Time: < 1 min

Bulli Raju Character Similarities With Hai Hai Nayaka
సంక్రాంతికి వస్తున్నాంలో బుల్లి రాజు పాత్రను చూస్తే ఆ సినిమా గుర్తుకొస్తుంది.

దర్శకుడు జంధ్యాలను కామెడీ కింగ్ అయిన బ్రహ్మనందం కామెడీ బ్రహ్మ అని ఎందుకంటారో తెలుసా. జంధ్యాల సినిమాల్లో ప్రత్యేకత ఏంటంటే అయన ఎంత కామెడీ సినిమా తీసినా, దానిలో ఉండే మెయిన్ స్టోరీ ఎమోషన్ ని మిస్ చెయ్యకుండా ఎంటర్టైనింగ్ గా ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యగలరు. ఉదాహరణకి చిరంజీవి నటించిన చంటబ్బాయ్ సినిమా చూస్తే ఎంత కామెడీ గా ఆ మూవీ నేరేటివ్ ఉన్నాఆ క్యారెక్టర్ లేయర్స్ లో ఒక తెలియని ఎమోషన్ ఉంటుంది. అది క్లైమాక్స్ లో రివీల్ అవుతుంది. అంతే కాకుండా యాక్టర్ గిరీష్ కర్నాడ్ తో అయన తీసినా ఆనంద భైరవి సినిమా చూస్తే జంధ్యాలేనా ఆ సినిమా తీసింది అనేంత కళాత్మకంగా ఉంటుంది.

ఆయన రాసే మోనోలాగ్ లు, అయన క్యారెక్టర్స్ డిజైన్ చేసే విధానం చాలా బాగుంటుంది. ఆయన ఇంప్రమైజేషన్స్ కూడా బాగుంటాయి. ఓ షూటింగ్ సమయంలో కుక్క తిరుగుతుంటే అప్పటికప్పుడు స్పాట్ లో ఓ సన్నివేశాన్ని కామెడీ కి వాడుకున్నారు. ఇలాంటి చమత్కారాలు ఎన్నో చేశారు. ఇన్ని ఉన్నా కథలో మూల వస్తువు మిస్ కాకుండా అయన చేసే ప్రయత్నం నిజంగా ఆయన్ని కామెడీ జానర్ డైరెక్టర్స్ లో లెజెండ్ ని చేసింది. ఇప్పటికి అయన సినిమాల్లో సీన్స్ ని వాడి జనాలని నవ్వించ గలుగుతున్నారు ఈ జనరేషన్ డైరెక్టర్స్. దానికి ఉదాహరణ “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాలో బుల్లి రాజు అనే క్యారెక్టర్ జంధ్యాల తెరకెక్కించిన “హాయ్ హాయ్ నాయక” మూవీ లో గోపి అనే చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ కి చాలా దగ్గరగా ఉంటుంది.

ఆ సినిమాలో జమీందారి కోట శ్రీనివాస్ రావు కొడుకు అయిన గోపి స్కూల్ కు వెళ్లకుండా అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. అతనితో మాట్లడానికి ఏ టీచర్ కూడా ధైర్యం చేయరు. ఎందుకంటే గోపి నోటెంట ఒక్క మంచి మాట రాదు. అన్ని బండ బూతులే వస్తాయి. గోపి మాట్లాడిన ప్రతీసారి బూతు, బూతు, బూతు అనే రీరికాండ్ ప్లే అవుతుంది. ఇప్పటికీ ఆ పాత్ర గుర్తు ఉంది అంటే అది జంధ్యాల గొప్పతనం. ప్రస్తుతం వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో గోపి పాత్రను స్పూర్తిగా తీసుకొని బుల్లి రాజు పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తుంది.