Celebrate 100 years of ANR
అక్కినేని నాగేశ్వరరావు జయంతి కానుక
సినీ రంగ రాకుమారుడు : శ్రీ అక్కినేని నాగేశ్వరరరావు ( A . N . R ) గారి శత జయంతి సందర్బంగా .
ఒక దేవదాస్, ఒక లైలా మజ్ను అంటే మన సినీ రంగంలో గుర్తొచ్చే పేరు అక్కినేని నాగేశ్వరరావు. అయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణ జిల్లా , రామాపురం. ఆయన మొదటి సినిమా ధర్మ పత్ని ( 1941 ) , ఈ చిత్రంలో స్టూడెంట్ పాత్రా పోషించారు. అలా మొదలయిన ఆయన సినీ ప్రయాణం 1944 శ్రీ సీతారామ జననం అనే చిత్రంలో లీడ్ రోల్ పోషించారు. అంతే అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా సుమారు 258 సినిమాలలో నటించారు. ఆయన నటనకు గాను భారత ప్రభుత్వం ఐదు నంది అవార్డ్స్ , ఐదు ఫిలిం ఫేర్ అవార్డ్స్, దాదా సాహెబ్ పాల్కే అవార్డు, పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, లాంటి పురష్కారాలతో ఆయనను గౌరవించారు . అంతటి గొప్ప మహనీయుడి వందోవ పుట్టినరోజు సందర్బంగా ఆయన సినిమాలు కొన్ని దేవదాసు, ప్రేమాభిషేకం, గుండమ్మ కథ, డాక్టర్ చక్రవర్తి, భార్య భర్తలు, మిస్సమ్మ, మనం చిత్రాలను భారతదేశం మొత్తం ప్రదర్శిస్తున్నారు .
ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ప్రేముకుడి పాత్ర అయినా, ఒక భగ్నప్రేముకుడిలా అయినా, ఒక పల్లెటూరి కుర్రడిలా అయినా, పట్నంలో ఉండే కుర్రడిలా అయినా ఇట్టే ఒదిగిపోగలడు. ఆయన నటించిన పాత్ర తప్ప నాగేశ్వరరావు గారు కనిపించరు. అది ఆయన గొప్పతనం. అంతటి మహనీయుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారికి జయంతి శుభాకాంక్షలు. ఇంక లేటు ఎందుకు ఆయన నటించిన సినిమాలు ఎక్కడ ఆడుతున్నాయో ఈ లిస్ట్ ప్రకారం చూసి టికెట్స్ బుక్ చేసుకొని ఆయన మనమధ్యే ఉన్నారని స్మరిస్తూ ప్రేక్షకులు అందరూ వీక్షించండి.