Reading Time: < 1 min

Chandreswara Movie April Release

చంద్రేశ్వర మూవీ ఏప్రిల్ విడుదల

శ్రీరామనవమి శుభాకాంక్షల తో ఏప్రిల్ లో విడుదల కానున్న చంద్రేశ్వర
శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల  సమర్పణలో  సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన సస్పెన్స్ తో  కూడుకున్న  క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘చంద్రేశ్వర’. ఈ సినిమా  ఏప్రిల్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.   ఇటీవల ‘ అఖిల నన్ను పట్టించుకోవే”‘ సాంగ్ సరిగమ  మ్యూజిక్ ద్వారా చిత్ర యూనిట్ రిలీజ్  చేశారు.
ఈ సందర్భంగా
కో ప్రొడ్యూసర్ పి. సరిత మాట్లాడుతూ – చంద్రేశ్వర మూవీలో ప్రేక్షకులని మెప్పించే సాంగ్స్ నచ్చాయని అనుకుంటున్నాం. సినిమాను కూడా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ మా టీమ్ కు కావాలి. అన్నారు.
కో ప్రొడ్యూసర్ వి. బాలకృష్ణ మాట్లాడుతూ – ముందుగా మీ అందరికీ శ్రీరామ  నవమి శుభాకాంక్షలు. ఇటీవల మా చంద్రేశ్వర మూవీలోని సాంగ్ లాంఛ్ చేయడం సంతోషంగా ఉంది. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులకు థ్యాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. చంద్రేశ్వర మూవీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ డాక్టర్ రవీంద్ర చారి మాట్లాడుతూ – నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా. చంద్రేశ్వర మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నా. ఆర్కియాలజీ  నేపథ్యంలో ఎమోషనల్ తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది అనే అంశాలు ఆకట్టుకుంటాయి. డివోషనల్ టచ్ తో పాటు మంచి కామెడీ కూడా ఈ సినిమాలో ఉంటుంది. ఏప్రిల్  లో మా చంద్రేశ్వర చిత్రాన్ని మీ ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం. అన్నారు.
నటీనటులు –  సురేష్ రవి, ఆశ వెంకటేష్, నిలగల్ రవి, బోసే వెంకట్, అడుకులం మురుగదాస్ గజరాజ్, జె ఎస్ కే గోపి, తదితరులు
టెక్నికల్ టీమ్
సంగీతం: జెరాడ్ ఫిలిక్స్
డిఓపి: ఆర్వి సీయోన్ ముత్తు
సింగర్స్: సాయి చరణ్
లిరిక్స్: వెంకట్, వై.జ్యోతి
డిటిఎస్: శ్యామ్
ఎడిటర్: నందమూరి హరి
పిఆర్వో: బి. వీరబాబు
కో ప్రొడ్యూసర్ పి.సరిత , వి. బాలకృష్ణ
ప్రొడ్యూసర్: డాక్టర్ రవీంద్ర చారి
డైరెక్టర్: జీవి పెరుమాళ్ వర్ధన్