Chhaava Press Meet
ఛావా ప్రెస్ మీట్
విక్కీ కౌశల్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్గా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో మ్యాడ్ డాక్ సంస్థ నిర్మించిన ఛావా చిత్రం హిందీలో కలెక్షన్లు కురిపిస్తోంది. బాలీవుడ్లో ఇండస్ట్రీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడుదలైన రెండు వారాల్లోనే వందల కోట్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకు రావాలనే గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. మార్చి 7న గీతా ఆర్ట్స్ ద్వారా ఈ మూవీని తెలుగులోకి తీసుకొస్తున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బన్నీ వాస్ మీడియాతో మాట్లాడారు.
ఇతర భాషల్లో వచ్చిన గొప్ప చిత్రాల్నితెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. అందుకే మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాడానికి గీతా ఆర్ట్స్ ముందుంటుందని అన్నారు. గతంలో గజినీ, 2018, కాంతార వంటి చిత్రాలను తెలుగు వారికి అందించామని, ఇప్పుడు ఛావాని తీసుకు వస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఛావా లాంటి చిత్రాన్ని రీమేక్ చేయడం కష్టమైన పని అని, మ్యాజిక్ రీ క్రియేట్ చేయలేమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుందని చెప్పిన బన్నివాస్, పల్నాడు నాగమ్మ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనేది ఆయన కళ అని చెప్పారు.