Reading Time: 4 mins

Committee Kurrollu Movie Pre Release Event – Tel

కమిటీ కుర్రోళ్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్

 

కమిటీ కుర్రోళ్లు చిత్రం అందరినీ అలరిస్తుంది.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సోమవారం నాడు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్, అడివి శేష్, వెంకీ అట్లూరి వంటి వారు గెస్ట్‌గా విచ్చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో..

వీడియో సందేశంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘మా నిహారిక నిర్మించిన కమిటీ కుర్రోళ్లు ఆగస్ట్ 9న రాబోతోంది. ఆల్రెడీ నేను ఈ చిత్రాన్ని చూశాను. చాలా బాగుంది. మా నిహారిక మల్టీటాలెంట్. మంచి చిత్రాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకుంటోంది. మంచి కథ, కొత్త కాన్సెప్ట్ చిత్రాలను తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ చిత్రం గోదావరి చుట్టు పక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. యదు వంశీ గారికి ఇది మొదటి చిత్రం. అందరూ కొత్త వాళ్లు నటించారు. మంచి విజువల్స్ ఉంటాయి.అనుదీప్ సంగీతం బాగుంది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు వస్తుంది.. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

నాగబాబు మాట్లాడుతూ.. ‘ఫణి గారు ఓ కథను వినమని చెప్పారు. కానీ నేను వినలేదు. నిహారిక ఆల్రెడీ కథ వినేసింది. కథ నాకు చాలా నచ్చింది.. ఓ సారి వినండి నాన్నా అని నిహారిక చెప్పింది. వంశీ నాకు డ్యాన్స్, ఫైట్స్ లేకుండా సినిమా అంతా చూపించాడు. వంశీ కరెక్ట్‌గా తీస్తే సినిమా బాగుంటుందని అర్థమైంది. నిహారికకు మంచి జడ్జ్‌మెంట్ ఉంటుంది. తెలిసిన మొహాలతో సినిమా చేయాలని అనుకుంది. కానీ కొత్త మొహాలు అయితే బాగుంటుందని నేను అనుకున్నాను. దర్శకుడు మాత్రం నాలానే అనుకున్నాడు. అన్నయ్య చిరంజీవి గారు మొదటి చిత్రంగా పునాది రాళ్లు చేశారు. ఇందులో నటించిన వారికి కూడా దాదాపు పునాది రాళ్లు టైం చిరంజీవి గారికి ఉన్న ఏజ్ ఉంటుంది. మనవూరి పాండవులు చిత్రంలో చాలా మంది కొత్త వాళ్లున్నారు. యంగ్ స్టర్స్ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది. అనుదీప్ గారు మంచి పాటలిచ్చారు. నా స్నేహితుడు ఫణికి సినిమాలు అంటే ప్యాషన్. నిహారికతో కలిసి సినిమాలు చేస్తాను అని అన్నాడు. ఈ కథ మా అందరికీ చాలా నచ్చింది. ఇందులో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. ఎండింగ్ మాత్రం ప్రముఖ నాయకుడ్ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆగస్ట్ 9న రాబోతోన్న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆదరించండి’ అని అన్నారు.

వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘కమిటీ కుర్రోళ్లు చిత్రాన్ని నేను చూశాను. ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది. ఈ చిత్రంలో ఉన్నట్టే నాకు ఓ 12 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ మూవీ చూసినప్పుడు నాకు పాత రోజులు గుర్తొచ్చాయి. ప్రతీ కుర్రాడికి ఈ కథ నచ్చుతుంది. చాలా చోట్ల కన్నీరు పెట్టేసుకున్నాను. ఆడియెన్స్‌కి కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుందనిపిస్తుంది. అసలు ఈ చిత్రంలో పన్నెండు పాటలున్నాయని నాకు అనిపించలేదు. అనుదీప్ మంచి పాటలు ఇచ్చారు. అన్వర్ ఎడిటింగ్ కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ రాజు గారు మంచి విజువల్స్ ఇచ్చారు. సినిమా టీం అంతా కలిసి అద్భుతంగా పని చేసింది. డైరెక్టర్ వంశీకి ఆల్ ది బెస్ట్. ఆగస్ట్ 9న థియేటర్లో జాతరగా ఉండబోతోంది. అందరూ అద్భుతంగా నటించారు. అందరికీ అద్భుతమైన డెబ్యూ దొరికింది. అందరి పేర్లు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. కష్టపడి, క్రమశిక్షణతో ఉంటే ఈ ఇండస్ట్రీలో అందరికీ స్థానం ఉంటుంది. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులను అందిస్తున్న మా చెల్లి నిహారికను చూస్తుంటే గర్వంగా ఉంది. ఆగస్ట్ 9న థియేటర్లో ఈ చిత్రం దద్దరిల్లబోతోంది’ అని అన్నారు.

సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ.. ‘ కమిటీ కుర్రోళ్లు టైటిల్ విన్నప్పుడే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అందరూ అద్భుతంగా నటించారు. వంశీ గారి మేకింగ్, టేకింగ్.. అనుదీప్ మ్యూజిక్, రాజు గారి విజువల్స్ అన్నీ బాగున్నాయి. మా నిహారిక నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఫణి గారి ఎంతో సహకరించారు. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలి’ అని అన్నారు.

అడివి శేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం కోసం అందరూ కమిటెడ్‌గా పని చేశారని అర్థం అవుతోంది. నాకు ట్రైలర్ చాలా నచ్చింది. ఈ చిత్రంలో అన్ని అంశాలను చూపించారు. ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది. టీం మీద రెస్పెక్ట్‌తో ఇక్కడకు వచ్చాను. చాలా పాజిటివ్ వైబ్‌ కనిపిస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాకు ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. ఈ మూవీ కూడా కలెక్షన్లతో పాటుగా, అవార్డులను కూడా కొల్లగొడుతుంది. వంశీ గారితో నాకు ఓ సినిమా చేయాలని ఉంది. అనుదీప్ గారి పాటలు చాలా నచ్చాయి. నిహారిక, ఫణి గారికి మంచి సక్సెస్ రావాలి. ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.

వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. ‘సాయి,వరుణ్, నిహారికలే నాకు లైఫ్ ఇచ్చారు. ముద్దపప్పు ఆవకాయ్ సినిమాకు స్క్రిప్ట్ నేను రాశాను. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అయింది. ఆ తరువాత వరుణ్‌తో తొలిప్రేమ వచ్చింది. ఇలాంటి ప్రాజెక్ట్‌ను నిర్మించిన నిహారిక,ఫణి గార్లకు థాంక్స్. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. మూడు రోజుల్లోనే బడ్జెట్ రికవరీ అవుతుంది’ అని అన్నారు.

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘ఆరోగ్యం బాగా లేకపోయినా అడిగిన వెంటనే వచ్చిన అడివి శేష్‌కు థాంక్స్. నా వెన్నంటే ఉండి నాకు సపోర్ట్ చేసే వరుణ్ అన్నకి థాంక్స. ప్రపంచమంతా బాగుండాలని కోరుకునే మా బావ తేజ్‌కు థాంక్స్. డైరెక్టర్ వంశీ గారి పేరు ఇకపై ఎక్కువగా వినిపిస్తుంది. రాజు గారు ఇచ్చిన విజువల్స్ అందరికీ గుర్తుంటాయి. ఫణి గారు ఎంతో సహకరించారు. ప్రణయ్ గారు మంచి జాతర సెట్ వేశారు. విజయ్ గారు మంచి ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారు. ఎడిటర్ అన్వర్ గారు అద్భుతమైన ప్రొడక్ట్ ఇచ్చారు. అనుదీప్ గారు మంచి పాటలు ఇచ్చారు. సుభాష్, కొండలరావు మంచి డైలాగ్స్ రాశారు. కొత్త వాళ్లైనా అద్భుతంగా నటించారు. పదిహేను మంది కొత్త ఆర్టిస్టులను నేను ఇస్తున్నాను అన్న తృప్తి నాకు కలుగుతోంది. సాయి కుమార్ గారు టీంతో కలిసిపోయారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. మీ అందరికీ నచ్చుతుంది. కచ్చితంగా చూడండి’ అని అన్నారు.

డైరెక్టర్ యదు వంశీ మాట్లాడుతూ.. ‘మా కమిటీ కుర్రోళ్లు చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. ఇది నా ఎక్స్‌పీరియెన్స్. ఎవరు సినిమా చూసినా అది వాళ్ల వాళ్ల బయోపిక్‌లానే అనిపిస్తుంది. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ చిత్రాన్ని నిర్మించిన నిహారిక గారికి థాంక్స్. ఆమె చాలా మంది పేరెంట్స్, యాక్టర్స్‌కి ఫ్లాట్ ఫాం ఇచ్చారు. కాంబినేషన్ చూడకుండా.. కథను చూసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఆమెకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మా 11 మంది కుర్రోళ్ల సినిమా. వాళ్ల కష్టానికి నిదర్శనం. మా టీం రుణాన్ని నేను తీర్చుకోలేను. వాళ్లంతా నా కథను నమ్మారు. వాళ్లంతా ఇప్పుడు హీరోలయ్యారు. మా కుర్రోళ్లు జెమ్స్. ఆగస్ట్ 9న సినిమా చూసి అందరూ అదే మాట చెప్పబోతోన్నారు’ అని అన్నారు.

నిర్మాత ఫణి మాట్లాడుతూ.. ‘నాకు సినిమాలంటే పిచ్చి. అందుకే చిత్రాలను నిర్మించేందుకు ఇండస్ట్రీకి వచ్చాను. మా ఈవెంట్‌కు వచ్చిన నాగబాబు గారికి, పద్మజ గారికి, సాయి దుర్గ తేజ్ గారికి, వరుణ్ తేజ్ గారికి, అడివి శేష్ గారికి థాంక్స్. నిహారికను చూస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటో తెలుస్తుంది. వంశీ ఎంతో అద్భుతంగా కథను నెరేట్ చేశాడు. కమిటీ కుర్రోళ్లు చిత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది. అందరికీ పాత రోజులు గుర్తొస్తాయి. మా చిత్రం పెద్ద హిట్ అవుతుంది. టీం అంతా ఎంతో కష్టపడి పని చేసింది.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రానికి వంశీ చాలాకష్టపడ్డాడు. 11 మంది కొత్త హీరోలు, నలుగురు అమ్మాయిలు చాలా కష్టపడ్డారు. ప్రతీ రోజూ వందల మందితో షూటింగ్ చేశాం. టీం అంతా చాలా కష్టపడి సినిమాను తీశాం. మా మీద నమ్మకం పెట్టుకున్న ఫణిగారికి, నిహారికి గారికి థాంక్స్. మా చిత్రం ఆగస్ట్ 9న రాబోతోంది. అందరూ చూసి పెద్ద విజయాన్ని అందిస్తారని కోరుతున్నామ’ని అన్నారు.

కెమెరామెన్ రాజు మాట్లాడుతూ.. ‘నిహారిక గారితో నాకు ఇది మూడో ప్రాజెక్ట్. మాకు సపోర్ట్ ఇచ్చిన ఫణి గారికి థాంక్స్. వంశీ గారి ప్యాషన్ వల్లే ఈ చిత్రం ఇంత బాగా వచ్చింది. ఇంత బాగా విజువల్స్ రావడానికి ఆయనే కారణం. అందరూ అద్భుతంగా నటించారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ ప్రణయ్ మాట్లాడుతూ.. ‘నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన ఆర్ట్ డిపార్ట్మెంట్‌కు థాంక్స్’ అని అన్నారు.

ఎడిటర్ అన్వర్ అలీ మాట్లాడుతూ.. ‘నిహారిక గారు ఇలాంటి చిత్రాలను ఇంకా నిర్మించాలి. నాకు ఇంత మంచి చిత్రం ఇచ్చిన వంశీ గారికి థాంక్స్. ఈ పాత్రల కోసం ఈ కుర్రోళ్లంతా పుట్టారనేట్టుగా ఉంటుంది. ఆగస్ట్ 9న ఈ చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

లిరిక్ రైటర్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ‘హనుమాన్ సినిమాతో అనుదీప్‌తో పరిచయం ఏర్పడింది. ఈ మూవీ కోసం ట్యూన్ పంపించాడు. వెంటనే లిరిక్స్ రాస్తానని అన్నాను. గుర్తుకొస్తున్నాయి.. హ్యాపీడేస్ పాటల పక్కన పాటకు స్థానం రావాలని అనుకుని రాశాను. ఈ చిత్రంలో రెండు పాటలు రాశాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన అనుదీప్, దర్శక నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.

లిరిక్ రైటర్ సింహాచలం మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నాలుగు పాటలు రాశాను. అన్నీ అద్భుతంగా వచ్చాయి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అనుదీప్, వంశీ గారికి థాంక్స్. మా అందరికీ అవకాశం ఇచ్చిన నిహారిక గారికి థాంక్స్. ఆగస్ట్ 9న చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

రైటర్ వెంకట్ సుభాష్ మాట్లాడుతూ.. ‘ముందుగా మా కథను నాగబాబు గారు విన్నారు. ఆ తరువాత నిహారిక గారి వద్దకు ప్రాజెక్ట్ వెళ్లింది. వంశీతో నాది నాలుగేళ్ల ప్రయాణం. ఈ కథకు ఎన్నో వర్షెన్స్ రాశాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ.. ‘వంశీ గారితో నాలుగేళ్లు ప్రయాణం చేశాం. మా దర్శకుడు చాలా ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగారు. చివరకు నిహారిక గారి వద్దకు ప్రాజెక్ట్ వెళ్లింది. ఆమె రాకతో మాకు వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించినట్టుగా అనిపించింది’ అని అన్నారు.